Gold Monetisation Scheme : లాకర్‌లో బంగారం ఉందా? ఇక అదే మీకు ఆదాయం తెచ్చిపెడుతుంది.. కేంద్రం కొత్త గోల్డ్ ప్లాన్!
Gold Monetisation Scheme : లాకర్, అల్మారాల్లో దాచిన బంగారం బయటకు తీసుకురండి.. త్వరలో కేంద్రం తీసుకురాబోయే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో డిపాజిట్ చేయండి.. వడ్డీతో పాటు భారీగా బెనిఫిట్స్ పొందవచ్చు..
- Sreehari A
- Published on- July 3, 2026 / 07:11 PM IST
Gold Monetisation Scheme
- త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (GMS) ప్రవేశపెట్టనున్న కేంద్రం
- నగల దుకాణదారులు కూడా బంగారం సేకరణ భాగస్వాములుగా మారొచ్చు
- ఇళ్లలోని బంగారంతో 90 బిలియన్ డాలర్ల విలువైన నిధులే లక్ష్యం
Gold Monetisation Scheme : మీ ఇంట్లో బంగారం ఉందా? బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఇకపై మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.. ఇప్పటివరకూ ఇంట్లో అల్మారాలు, లాకర్లలో భద్రంగా దాచిన బంగారంతో భారీ మొత్తంలో సంపాదించుకోవచ్చు.
అది ఎలాగంటారా? కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈసారి బ్యాంకులే కాదు.. గుర్తింపు పొందిన జ్యువెలరీ షాపులను కూడా కలెక్షన్ పార్ట్‌నర్లుగా చేర్చనుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఇకనుంచి ప్రజలే తమకు దగ్గరలోని జ్యువెలర్ వద్దకు వెళ్లి బంగారాన్ని డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వడ్డీకి వడ్డీ.. మరెన్నో బెనిఫిట్స్ :
ఇంట్లో దాచిన బంగారానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదే ఆ బంగారాన్ని ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేశారంటే వడ్డీకి వడ్డీ మరెన్నో ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. మీకు అవసరమైతే నిబంధనల ప్రకారం.. గోల్డ్ లేదా దానికి సమానమైన క్యాష్ కూడా తీసుకోవచ్చు. అంటే.. నిరుపయోగమైన బంగారాన్ని ఇక ఆదాయం ఇచ్చే పెట్టుబడిగా మార్చుకోవచ్చు అనమాట.
జ్యువెలరీ వ్యాపారులకు పండగే :
ప్రత్యేకించి కేంద్రం తీసుకురాబోయే ఈ కొత్త గోల్డ్ స్కీమ్ ద్వారా జ్యువెలరీ వ్యాపారులకు బాగా కలిసిరానుంది. ఎందుకంటే.. ప్రజల దగ్గర నుంచి బంగారం సేకరణలో భాగస్వాములు కావడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో దేశీయంగా లభించే బంగారం వినియోగం భారీగా పెరుగుతుంది. ఫలితంగా బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గిపోతుంది. ముడి బంగారం లభ్యత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also : Moto G77 Power : మతిపొగొట్టే ఫీచర్లతో మోటో G77 పవర్ వస్తోందోచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు బ్యాకప్..!
25వేల టన్నుల బంగారం :
అందులోనూ కేంద్ర ప్రభుత్వానికీ ఈ స్కీమ్ కీలకంగా మారేలా కనిపిస్తోంది. ప్రతి ఏడాదిలో భారీగా ఉండే బంగారం దిగుమతులు ఇకపై తగ్గనున్నాయి. అదే జరిగితే విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి తగ్గుతుంది.
ప్రస్తుతం భారతీయుల దగ్గర సుమారు 25 వేల టన్నుల బంగారం ఉందని అంచనా. అందులో కేవలం 5 శాతమైనా ఈ పథకంలోకి వస్తే.. దాదాపు 1,250 టన్నుల బంగారం, సుమారు రూ.8 లక్షల కోట్ల విలువైన ఆస్తి ఆర్థిక వ్యవస్థలోకి చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, గతంలో ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. కానీ, ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
