Happy Father’s Day : ఫాదర్స్ డే స్పెషల్: మీ నాన్నకు ఎప్పటికీ గుర్తుండే టాప్ 5 బెస్ట్ గాడ్జెట్ గిఫ్ట్స్!
Happy Father's Day: ఫాదర్స్ డే రోజున మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నారా? ఈ టాప్ 5 గాడ్జెట్లలో ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి.. ఇందులో ఐదోవది మాత్రం చాలా స్పెషల్..
- Sreehari A
- Updated on- June 21, 2026 / 03:27 PM IST
Happy Father's Day
- ఫాదర్స్ డే రోజున మీ నాన్నకు ఇలా గిఫ్ట్ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేయండి
- టాప్ 5 స్మార్ట్ గాడ్జెట్లలో హెల్త్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ వాచ్ కూడా
- వైర్ లెస్ బడ్స్ నుంచి డిజిటల్ ఫొటో ఫ్రేమ్ వరకు ఏది బెటర్
Happy Father’s Day: ఈరోజు.. (జూన్ 21) ఫాదర్స్ డే.. ఫ్యామిలీ కోసం నాన్న ఎంతో చేస్తారు.. అమ్మలాగే ఎన్నో త్యాగాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అలాంటి తండ్రి కష్టానికి తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి. ప్రతిఒక్క ఫ్యామిలీకి తండ్రులే బలం… వారే అండగా నిలుస్తారు కూడా. ఆయన కష్టాన్ని తాను భరిస్తూ ఫ్యామిలీకి ఆనందాన్ని పంచుతాడు.
అందుకే ప్రతి ఫ్యామిలీకి నాన్నే హీరో.. అలాంటి నాన్నకు ప్రత్యేకమైన రోజు అంటే.. అది ఫాదర్స్ డే.. ఈ ప్రత్యేకమైన రోజున నాన్నకు ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని ప్రతి కొడుకు, కూతురు భావిస్తుంటారు.
మీరు కూడా ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేయాలని చూస్తుంటే మీకోసం మార్కెట్లో అద్భుతమైన టెక్ గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. మీ నాన్నకు ఉపయోగపడే 5 అద్భుతమైన టెక్ గాడ్జెట్ గిఫ్ట్స్ అందిస్తున్నాం.. ఇందులో హెల్త్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ వాచ్ కూడా ఉంది. ఈ గాడ్జెట్లలో ఏది మీ నాన్నకు నచ్చుతుందో చూసి గిఫ్ట్ ఇవ్వొచ్చు.
వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ :
మ్యూజిక్ వినడం లేదా ఫోన్‌లో మాట్లాడటం ఇష్టపడేవారికి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అద్భుతమైన ఆప్షన్. వైర్లతో పనిఉండదు. ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. మంచి సౌండ్ క్వాలిటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం రోజువారీ వినియోగానికి సౌకర్యవంతంగా ఉంటాయి. మీ నాన్న ట్రావెల్ చేసినా లేదా వాకింగ్ చేసే సమయంలో మ్యూజిక్ వినడం ఇష్టపడేవారు అయితే ఆయనకు ఈ గిఫ్ట్ కచ్చితంగా నచ్చుతుంది.
Read Also : iPhone 17 Pro Series : ఓరినాయనో..! ఆపిల్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మరి ఇంత తక్కువ ధరకా?
స్మార్ట్‌ఫోన్ స్టాండ్ , బ్లూటూత్ స్పీకర్ :
స్మార్ట్‌ఫోన్ స్టాండ్ లేదంటే డెస్క్ డాక్ చిన్నదైనా చాలా యూజ్ ఫూల్ డివైజ్.. వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్ లేదా సినిమాలు చూసేటప్పుడు మీ ఫోన్ ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. మ్యూజిక్ ప్రియులకు పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అద్భుతమైన ఆప్షన్. కాంపాక్ట్ డిజైన్, పవర్ ఫుల్ సౌండ్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంట్లో రెస్ట్ తీసుకున్నా లేదా చిన్నపాటి మీటింగ్ కోసమైన ఈజీగా బ్లూటూత్ స్పీకర్ వాడొచ్చు.
ఎలక్ట్రిక్ షేవర్, పవర్ బ్యాంక్ :
ఎలక్ట్రిక్ షేవర్ లేదా ట్రిమ్మర్ ప్రతిరోజూ వాడుతుంటారు. షేవింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. ప్రొఫెషనల్ లుక్ మారిపోవచ్చు. పవర్ బ్యాంక్ కూడా అత్యంత ముఖ్యమైన గాడ్జెట్. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో పవర్ బ్యాంక్ దగ్గర ఉంచుకుంటే ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. మీ నాన్న ఎక్కువగా లాంగ్ జర్నీ చేసేవారు అయితే ఈ పవర్ బ్యాంకు గిఫ్ట్ ఇవ్వొచ్చు.
బ్లూటూత్ కీఫైండర్ :
మీ నాన్న ఎక్కువగా తాళాలు, పర్సు, ఇతర ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకుంటున్నారా? మీ నాన్నకు బ్లూటూత్ కీఫైండర్ అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఈ చిన్న డివైజ్ మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులను గుర్తించంలో సాయపడుతుంది. వస్తువుల కోసం పదేదపే వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ కీఫైండర్ చిన్నదైనా చాలా యూజ్ ఫుల్ గాడ్జెట్ అనమాట.. ఈ టెక్ గాడ్జెట్ మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే..
డిజిటల్ ఫొటో ఫ్రేమ్ :
ఈ గిఫ్ట్‌లలో డిజిటల్ ఫొటో ఫ్రేమ్ చాలా స్పెషల్. ఎక్కువకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోలకు సంబంధించి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. ఇది కేవలం ఒక గాడ్జెట్ మాత్రమే కాదు. ఎమోషనల్ గిఫ్ట్ కూడా. మంచి గిఫ్ట్ కోసం చూస్తున్నవారికి డిజిటల్ ఫొటో ఫ్రేమ్ అద్భుతమైన ఆప్షన్.
