×
Ad

Harley Davidson : బైకు లవర్స్‌కు పండగే.. హార్లే డేవిడ్సన్ బైకులు ఇక చౌకైన ధరకే.. జీరో టాక్స్ డీల్.. లగ్జరీ కార్ల ధరలు కూడా!

Harley Davidson : భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా హై-ఎండ్ వాహనాలపై దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తుంది. వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగువ, మధ్య స్థాయి ఆటోమొబైల్స్‌కు ఎలాంటి రిలీఫ్ ఉండదు.

Harley Davidson

  • భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం
  • హై-ఎండ్ వాహనాలపై 110 శాతం నుంచి 30 శాతానికి దిగుమతి సుంకం
  • 800cc నుంచి 1600cc వరకు ఇంజిన్ బైకు మోడళ్ల ధరలు తగ్గనున్నాయి

Harley Davidson : బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. హార్లే-డేవిడ్సన్ బైకుల ధరలు భారీగా తగ్గనున్నాయి.. అతి త్వరలో భారత మార్కెట్లో అతి చౌకైన ధరలో హార్లే-డేవిడ్సన్ బైకులు లభించనున్నాయి. సామాన్యులు కూడా ఈ హై ఎండ్ బైకులను సొంతం చేసుకోవచ్చు. భారత్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ ఒప్పందంతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టే కొన్ని విదేశీ వాహనాలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.

హార్లే–డేవిడ్సన్ బైక్‌లపై దిగుమతి సుంకాలు ఎత్తేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో 800cc నుంచి 1600cc వరకు ఉన్న బైకు మోడళ్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే హై-ఎండ్ కార్లపై కూడా సుంకాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఈ డీల్ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలకు చోటు లేదు. మార్చి నాటికి ఒప్పందంపై సంతకాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత మార్చి నాటికి కొత్త మార్పులు అమల్లోకి రావచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కార్లు, బైకుల అభిమానులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

50శాతం నుంచి 18 శాతానికి సుంకాలు :

భారత్‌పై అమెరికా పరస్పర సుంకాలు ఇప్పుడు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. ఈ మేరకు అమెరికా వచ్చే వారం అధికారిక ఉత్తర్వు జారీ చేసే అవకాశం ఉంది. ఒప్పందం అధికారికంగా సంతకం చేశాక మాత్రమే అమెరికా నుంచి మరిన్ని మినహాయింపులు, తగ్గింపులు ఉంటాయని భావిస్తున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం.. హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై ఫస్ట్ డే నుంచే దిగుమతి సుంకం (జీరో టాక్స్) ఉండదని వర్గాలు చెబుతున్నాయి. ఇదే కేటగిరీలోని ఇతర హై-ఎండ్ వాహనాలపై కూడా సుంకాలు భారీగా తగ్గుతాయి.

Read Also : Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి బ్రో.. రూ. 20వేల లోపు ధరలో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా? 

ఇతర హై-ఎండ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలకు, భారత్ దిగుమతి సుంకాన్ని 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తుంది. అయితే, ఈ మార్పు 3000cc కన్నా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్లకు మాత్రమే వర్తిస్తుంది.

Harley Davidson (Image Credit to Original Source )

దిగువ, మధ్య శ్రేణి వాహనాలకు మినహాయింపు లేదు :
ఈ వాణిజ్య ఒప్పందం కింద దిగువ, మధ్య స్థాయి ఆటోమొబైల్స్‌కు ఎలాంటి సుంకం మినహాయింపులు ఉండవని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఆటోమోటివ్ విడిభాగాల ఎగుమతికి భారత్ ప్రాధాన్యత సుంకం-రేటు కోటాను పొందుతుంది.

మధ్యంతర వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే కొన్ని భారతీయ ఆటో విడిభాగాలు జీరో టాక్స్ వద్దనే అమెరికాలోకి ప్రవేశిస్తాయని, మరికొన్ని 18 శాతం సుంకానికి లోబడి ఉంటాయని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అన్నారు.

యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో వాణిజ్య ఒప్పందాలలో భారత్ కూడా మినహాయింపులను అందించింది. ఈ డీల్స్ ప్రకారం.. యూరోపియన్ లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాలు క్రమంగా తగ్గనున్నాయి. కొన్ని సందర్భాల్లో 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దాంతో విదేశీ తయారీదారులు ఎక్కువ సంఖ్యలో భారత మార్కెట్‌ వైపు మొగ్గుచూపే అవకాశాలు పెరుగుతాయి.