Income Tax Return : ITR గడువు మిస్ అయ్యిందా? డోంట్ వర్రీ.. ఫస్ట్ టాక్స్ పేయర్లు చేయాల్సింది ఇదే!

Income Tax Return : ఐటీఆర్ డెడ్ లైన్ జూలై 31తో ముగిసింది. ఈ తేదీలోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయని పన్నుచెల్లింపుదారులు అన్ని వివరాలను చెక్ చేసుకుని ఐటీఆర్ పెనాల్టీలతో దాఖలు చేసుకోవచ్చు.. అది ఎలాగంటే?

Income Tax Return

  • ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారా? మీకు మరో ఛాన్స్
  • టాక్స్ పేయర్లు గడువు దాటిన కూడా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు
  • జూలై 31తో గడువు ముగిసింది.. పెనాల్టీలు, వడ్డీలతో దాఖలు చేయొచ్చు

Income Tax Return : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మీరు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేదా? గడువు దాటిపోయిందని కంగారుపడిపోతున్నారా? డోంట్ వర్రీ.. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు జూలై 31 చివరి గడువు ముగిసినా పర్వాలేదు. మీకు ఇంకా అవకాశం ఉంది. అంటే.. పెనాల్టీలతో ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు. ITR-1, ITR-2 ఫారమ్‌ల ద్వారా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే తమ రిటర్న్‌లు దాఖలు చేశారు.

మరికొందరు వ్యక్తిగత లేదా సాంకేతిక కారణాల వల్ల గడువులోగా ఫైల్ చేయలేకపోయారు. అయితే, గడువు మిస్ (Income Tax Return) అయిందని ఆందోళన అక్కర్లేదు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట జరిమానా, వడ్డీ చెల్లించి ఆలస్యంగా కూడా రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గడువు దాటితే ఏం చేయాలి? :
జూలై 31లోపు ITR-1 లేదా ITR-2 దాఖలు చేయలేకపోతే డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ (Belated Return) దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేయడం వల్ల పెనాల్టీతో పాటు బకాయి పన్నుపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. రీఫండ్ రావాల్సి ఉంటే.. సాధారణం కన్నా ఆలస్యంగా క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఎంత పెనాల్టీ చెల్లించాలి? :
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసే వారికి ఆదాయాన్ని బట్టి పెనాల్టీ విధిస్తారు.
* వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉంటే రూ.5వేల వరకు ఆలస్య రుసుము చెల్లించాలి.
* వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వర్తిస్తుంది.
* చెల్లించాల్సిన పన్ను బకాయి ఉంటే.. సెక్షన్ 234A ప్రకారం ఆ మొత్తంపై వడ్డీ చెల్లించకతప్పదు.

Read Also : Whatsapp Age Restrictions : బిగ్ షాకింగ్ న్యూస్.. వాట్సాప్‌లో ఇక వయసు చెప్పాల్సిందేనా? కొత్త ప్రాంప్ట్‌తో యూజర్లలో టెన్షన్!

ITR-3, ITR-4 దాఖలు చేసే వారికి మరో ఛాన్స్ :
ITR-3 లేదా ITR-4 ఫారమ్‌లను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఇంకా గడువు ఉంది. టాక్స్ ఆడిట్ అక్కర్లేని స్వయం ఉపాధి నిపుణులు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారులు, అలాగే సెక్షన్ 44AD, 44ADA కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఎంచుకున్న వారు ఆగస్టు 31 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా తమ రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చు.

టాక్స్ పేయర్లు ఇప్పుడేం చేయాలి? :
ఐటీఆర్ గడువు మిస్ అయిన వారు ఆలస్యం చేయకుండా వెంటనే తమ పన్ను వివరాలను చెక్ చేసుకోవడం మంచిది.

* ముందుగా ఫారమ్ 16, AIS, ఫారమ్ 26AS, బ్యాంకు వడ్డీ వివరాలు, పెట్టుబడి ఆధారాలతో అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ రెడీగా పెట్టుకోండి
* చెల్లించాల్సిన పన్ను ఏమైనా బకాయి ఉంటే ముందుగా చెల్లించండి. ఆపై రిటర్న్ దాఖలు చేయండి.
* డిసెంబర్ 31 లాస్ట్ డేట్ వరకు ఆగొద్దు. వీలైనంత త్వరగా బిలేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేయడం బెటర్.
* రిటర్న్ సబ్మిట్ చేశాక తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ (e-Verification) పూర్తి చేయండి. లేదంటే రిటర్న్ చెల్లదు.
* రీఫండ్ రావాల్సినవారు ఆలస్యం లేకుండా రిటర్న్ దాఖలు చేస్తే ప్రాసెసింగ్ ఫాస్ట్ పూర్తవుతుంది.

ఆగస్టు 5నలో కీలక నిర్ణయాలు :
ఈ నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరగనుంది. ఆగస్టు 3 నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం ఆగస్టు 5న కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. రెపో రేటులో మార్పులు జరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్ల ప్రభావం పడుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేటు పెంపు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే :
జూలై 31 గడువు దాటినా ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. అయితే ఆలస్యం చేసిన కొద్దీ పెనాల్టీలు, వడ్డీ భారం పెరుగుతుంది. అందుకు గడువు మిస్ అయిన టాక్స్ పేయర్లు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం బెటర్. లేదంటే భారీగా నష్టపోవడం ఖాయం..