Health Insurance EMI : నెలకు రూ.1,000కే హెల్త్ ఇన్సూరెన్స్.. ఒకేసారి ప్రీమియం కట్టాల్సిన పనిలేదు!

Health Insurance EMI : నెలకు రూ.1,000తో హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం ఎలా? ఒకేసారి రూ.36,000 చెల్లించకుండా ఈఎంఐ విధానంలో ప్రీమియం చెల్లించే విధానం, బెనిఫిట్స్, పాలసీ తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం..

Health Insurance EMI

  • హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈఎంఐతో ఖర్చు తగ్గించుకోండి
  • రూ.36 వేల భారం ఒక్కసారిగా వద్దు.. ఆరోగ్య బీమా కోసం ఈ ఆప్షన్ చూడండి
  • మధ్యతరగతి కుటుంబాలకు ఊరట.. నెలవారీ చెల్లింపులతో హెల్త్ ఇన్సూరెన్స్

Health Insurance EMI : మీకు హెల్త్ పాలసీ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోండి.. అయితే ప్రస్తుత రోజుల్లో కుటుంబ ఖర్చులను నిర్వహించడం అంత ఈజీ కాదు. ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లులు, నిత్యావసరాల మధ్య ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించడం చాలా మందికి భారంగా మారుతోంది.

దీంతో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ వాయిదా వేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించలేని వారికి నెలవారీ ఈఎంఐల (Health Insurance EMI) రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. అసలు ఈ విధానం ఎలా పనిచేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హెల్త్ ఇన్సూరెన్స్ ఇక నెలవారీ ఈఎంఐలో.. :
సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు ఏడాది ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని బీమా పాలసీల్లో నెలవారీ లేదా 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన పనిఉండదు.

ఉదాహరణకు.. మూడేళ్ల ఆరోగ్య బీమా పాలసీకి మొత్తం ప్రీమియం రూ.36వేలు అనుకుందాం. ఈ మొత్తాన్ని 36 నెలలకు సమానంగా విభజిస్తే.. నెలకు రూ.1,000 చెల్లించాల్సి వస్తుంది. అంటే, ఒకేసారి రూ.36వేలు చెల్లించకుండా చిన్న మొత్తాల్లో ప్రీమియం చెల్లించవచ్చు. అయితే, అదనపు వడ్డీ లేదా ఛార్జీలు లేని సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది. పేమెంట్ విధానం బీమా సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

Read Also : New Car vs Used Car : కొత్త కారు కొనాలా? పాత కారు కొనాలా? మీ డబ్బుకు ఏది బెస్ట్ ఛాయిస్?

ఈఎంఐ విధానంపైనే ఆసక్తి :

పాలసీబజార్ డేటా ప్రకారం.. సుమారు 13 శాతం మంది వినియోగదారులు ఆరోగ్య బీమా ప్రీమియంలను నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సగటు ప్రీమియం లేదా ఈఎంఐకి సంబంధించి సుమారు రూ.17,500గా రిపోర్టు చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. ఆరోగ్య బీమాను ఒకేసారి చేసే పెద్ద ఖర్చుగా కాకుండా నెలవారీ బడ్జెట్‌లో భాగంగా చూసేవారే ఎక్కువ అనమాట.

మూడేళ్ల పాటు ప్రీమియం ఒకేలా ఉంటుందా? :
మూడేళ్ల పాలసీ తీసుకున్నంత మాత్రాన అన్ని సందర్భాల్లోనూ ప్రీమియం ఒకేలా ఉంటుందని భావించకూడదు. ప్రీమియం మార్పులు, పేమెంట్ విధానం, పాలసీ కొనసాగింపు వంటి అంశాలు బీమా సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవాలి.

ఈఎంఐలో బీమా.. ముందు ఇవి తెలుసుకోండి :
నెలవారీ ఈఎంఐతో బడ్జెట్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చు. అయితే, తక్కువ ఈఎంఐ చూసి మాత్రమే పాలసీని ఎంచుకోవద్దు. ఆస్పత్రి ఖర్చుల కవరేజ్, ప్రీ-డిసీజ్ వెయిటింగ్ పీరియడ్, కో-పేమెంట్ నిబంధనలు, రూమ్ రెంట్ లిమిట్స్, నెట్‌వర్క్ ఆసుపత్రులు వంటి అంశాలను పరిశీలించాలి.

అలాగే, వాయిదా ఆలస్యమైతే లేదా పేమెంట్ చేయకపోతే పాలసీపై ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా తెలుసుకోవాలి. మొత్తానికి నెలవారీ ఈఎంఐ ద్వారా ఆరోగ్య బీమా తీసుకోవడం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. కానీ సరైన కవరేజ్, పేమెంట్ నిబంధనలు, పాలసీ బెనిఫిట్స్ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం బెటర్..