Hero Vida VX2 Go FB : బ్యాటరీ రెంట్ టెన్షన్‌కు గుడ్‌బై.. కొత్త హీరో విడా VX2 Go FB ఎంట్రీ.. ఫుల్ ఛార్జ్‌తో 128 కి.మీ రేంజ్..!

Hero Vida VX2 Go FB : బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో పనిలేదు.. ఏకంగా బ్యాటరీతో పాటు స్కూటర్ కొనేసుకోవచ్చు. హీరో మోటోకార్ప్ రూ. 1.13 లక్షల ధరతో ఫిక్స్‌డ్ 3.1 kWh బ్యాటరీతో విడా VX2 గో FB వేరియంట్‌ను అందిస్తోంది.

Hero Vida VX2 Go FB

  • హీరో కస్టమర్ల కోసం విడా విఎక్స్2 గో ఎఫ్‌బీ స్కూటర్ వచ్చేసింది
  • ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేశారంటే 128కి.మీ దూసుకెళ్లిపోతుంది
  • బ్యాటరీ రెంట్ అవసరం లేని కస్టమర్ల కోసం కొత్త వేరియంట్

Hero Vida VX2 Go FB : హీరో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. హీరో మోటోకార్ప్ విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌లో మరో అద్భుతమైన వేరియంట్ ప్రవేశపెట్టింది. అదే.. కొత్త హీరో విడా VX2 గో ఎఫ్‌బీ వేరియంట్‌. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.13 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఇప్పటివరకు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానంలో లభించిన విడా VX2 గో స్కూటర్ భిన్నంగా కొత్త VX2 గో ఎఫ్‌బీలో 3.1kWh బ్యాటరీ కూడా ఒకేసారి కొనేసుకోవచ్చు. అంటే.. బ్యాటరీ కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఈ వేరియంట్‌ ఎందుకంటే? :
ఈ హీరో కొత్త వేరియంట్‌లో ముఖ్యమైన మార్పు బ్యాటరీ ఓనర్‌షిప్ ఒక్కటే.. కొత్త స్కూటర్‌ కొన్నాక వెంటనే బ్యాటరీ కూడా పూర్తిగా కస్టమర్లదే అవుతుంది. బ్యాటరీ రెంట్ లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ టెన్షన్ అక్కర్లేదు. ఒకేసారి మొత్తం చెల్లించి వాహనాన్ని పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని హీరో ఈ అద్భుతమైన ఆప్షన్ అందించింది.

స్కూటర్‌లో టెక్నికల్ మార్పుల్లేవ్ :
బ్యాటరీ యాజమాన్యం తప్ప స్కూటర్‌లో ఎలాంటి టెక్నికల్ మార్పులు చేయలేదు. ఇదే ఎలక్ట్రిక్ మోటార్, అదే ఛాసిస్, అదే రైడింగ్ మోడ్‌లతో తీసుకొచ్చింది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కూడా ఎలాంటి మార్పు లేదని హీరో స్పష్టం చేసింది.

Read Also : iPhone 18 Pro Price : వావ్.. కొత్త ఆపిల్ ఐఫోన్ 18 ప్రో అదుర్స్.. ఆన్‌లైన్‌లో ధర వివరాలు లీక్..!

ఫీచర్లు మారలేదు :
హీరో VX2 గో ఎఫ్‌బీలో ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, విడా ప్లాట్‌ఫామ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్, ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

స్కూటర్ రేంజ్ ఎంతంటే? :
ఈ స్కూటర్‌లో 3.1kWh బ్యాటరీ ప్యాక్‌ అందించారు. ఐడీసీ స్టాండర్డ్స్ ప్రకారం.. సింగిల్ ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 128 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదని కంపెనీ పేర్కొంది. అయితే, రియల్ రేంజ్ రైడింగ్ విధానం, ట్రాఫిక్, రోడ్ల పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇది ఎవరికి బెస్ట్? :
హీరో విడా VX2 గో FB అనేది కొత్త స్కూటర్ కాదు.. ఇప్పటికే మార్కెట్లో లభించే VX2 గో మోడల్‌కు మరో యాజమాన్య ఆప్షన్ మాత్రమే. తక్కువ ధరలో మంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌ ఎంచుకునే వారికి BaaS మోడల్ అందుబాటులో ఉంది.

ఒకేసారి చెల్లించి బ్యాటరీతో పాటు స్కూటర్‌ను పూర్తిగా సొంతం చేసుకునే వారికి VX2 Go FB బెస్ట్ ఆప్షన్. ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్ లేదా ఫీచర్లలో మార్పులు అవసరం ఉండదు. పూర్తి మొత్తంలో ఓనర్‌షిప్‌ను కోరుకునే కస్టమర్లకు ఈ వేరియంట్‌ అద్భుతంగా ఉంటుంది.