Ethanol Race Cars : తక్కువ మైలేజ్ ఇచ్చే ఇథనాల్‌నే రేస్ కార్లలో ఎందుకు వాడుతారు? అసలు సీక్రెట్ ఇదే!
Ethanol Race Cars : ఇథనాల్ వాడితే తక్కువ మైలేజ్ వస్తుందనేది అక్షర సత్యం.. అదే ఇథనాల్ రేస్ కార్లలో ఎందుకు వాడుతున్నారో తెలుసా? మన కార్లలో రాని మైలేజీ వాటికి ఎలా వస్తుంది అనేకదా మీ సందేహం.. ఈ స్టోరీ చదివాక మీకే తెలుస్తుంది..
- Sreehari A
- Published on- July 4, 2026 / 08:28 PM IST
Ethanol Race Cars
- ఇథనాల్‌తో మైలేజ్ తగ్గుతుంది.. ఇది నిజమే
- రేస్ కార్లలో కూడా ఇదే ఇథనాల్ మిశ్రమం వాడుతారు
- తక్కువ మైలేజ్, ఎక్కువ పర్ఫార్మెన్స్ అందించగలదు
Ethanol Race Cars : ఒకప్పుడు రేస్ ట్రాక్‌లపై దూసుకెళ్లిన సూపర్‌కార్ల ట్యాంకుల్లో ఇదే ఇథనాల్ ఇంధనం వాడేవారు.. కానీ, ఇప్పుడు అదే ఇథనాల్ మన పెట్రోల్ బంక్‌లలోకి కూడా వస్తోంది. వాస్తవానికి, ఇథనాల్ ఎక్కువైతే మైలేజ్ తగ్గుతుందని ఒకవైపు నిపుణులు చెబుతున్నమాట..
అదే ఇథనాల్ మరి రేస్ కార్లకు అంత పవర్ ఎక్కడి నుంచి ఇస్తుందని మరోవైపు మోటార్‌స్పోర్ట్స్ ప్రపంచం చెబుతోంది. ఒకే ఇంధనం (Ethanol Race Cars) ఎలా ఒకేసారి తక్కువ మైలేజ్ ఇస్తుంది? అత్యధిక పర్ఫార్మెన్స్ అందించగలదు? ఈ ప్రశ్న వెనుక అసలు నిజం తెలిస్తే ఇథనాల్‌పై మీ అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు.
ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే.. ఎనర్జీ డెన్సిటీ (Energy Density) అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే E20, E85 వంటి హై ఇథనాల్ మిశ్రమాలను వాడితే ఒక లీటర్ ఇంధనంతో వెళ్లే దూరం కొంత తగ్గుతుంది. అంటే.. మైలేజ్ తగ్గడం అనేది శాస్త్రీయంగా నిజమే.
అయితే, ఇక్కడే చాలామందికి ఒక సందేహం రావొచ్చు.. మైలేజ్ తగ్గితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే రేస్ కార్లు ఇథనాల్‌ను ఎందుకు వాడుతున్నాయి? మీకు కూడా ఇలాంటి సందేహమే వచ్చిందా? అసలు రేస్ కార్లలో ఎందుకు వాడుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రేస్ కార్ల లక్ష్యం మైలేజ్ కాదు.. పర్ఫార్మెన్స్ :
రేసింగ్‌లో ఎంత మైలేజీ కాదు.. ఎంత వేగంగా వెళ్లామనేది చాలా కీలకం.. ఒక లీటర్‌తో ఎంత దూరం వెళ్లడం కాదు. ఎంత వేగంగా యాక్సిలరేట్ చేశాం.. ఎంత ఎక్కువ పవర్, టార్క్ ఉత్పత్తి చేశామనేదే చూస్తారు. ఇథనాల్‌కు పెట్రోల్ కన్నా చాలా ఎక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉంటుంది. తద్వారా ఇంజిన్‌ను హై కంప్రెషన్‌తో ట్యూన్ చేయవచ్చు. ఫలితంగా నాకింగ్ తగ్గిపోయి ఇంజిన్ మరింత పవర్ జనరేట్ చేస్తుంది.
ఇంజిన్ కూలింగ్ ఉంచే ఫీచర్ :
ఇథనాల్ ఆవిరయ్యే సమయంలో ఎక్కువ హీట్ గ్రహిస్తుంది. దాంతో ఇంజిన్‌లోకి వెళ్లే గాలి కూల్ అవుతుంది. చల్లని గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా దహనం వేగంగా జరుగుతుంది. ఇదే కారణంగా టర్బోచార్జ్డ్ రేస్ ఇంజిన్లు మరింత పవర్‌ను జనరేట్ చేయగలవు.
రేసింగ్ ప్రపంచమంతా ఇథనాల్‌పైనే :
2007లో వచ్చిన (Koenigsegg CCXR) వంటి హైపర్‌కార్లు E85 ఇథనాల్‌తోనే 1,018bhp పవర్ ఉత్పత్తి చేయగలవు. గంటకు 400 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలవు. ఫార్ములా-1 వంటి మోటార్‌స్పోర్ట్స్‌లో కూడా ఇథనాల్ మిశ్రమాల వినియోగం పెరగడానికి ఇదే కారణం.
సాధారణ కార్లలో ఎందుకు పనిచేయదు?
మనం నిత్యం వాడే ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లలో పెట్రోల్ మాత్రమే కాదు.. అనేక రకాల ఇథనాల్ మిశ్రమాలపై నడిచేలా తయారు చేస్తారు. అందుకే కార్ల ఇంజిన్ ట్యూనింగ్ (Compromise) పద్ధతిలో ఉంటుంది. దాంతో రేస్ కార్ల మాదిరిగా ఎక్కువ పవర్ అందుకోలేవు. రాబోయే రోజుల్లో ఎలాంటి కొత్త ఇంధన మిశ్రమం వచ్చినా జస్ట్ వాడుకోవడమే.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇథనాల్‌లో మైలేజ్ కన్నా పర్ఫార్మెన్స్ మాత్రమే బలంగా చెప్పొచ్చు.
