Highest FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? ఏప్రిల్‌లో అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులివే.. ఏయే బ్యాంకుల్లో వడ్డీ ఎంతంటే?

Highest FD Rates : మార్కెట్ రిస్క్ వద్దనుకుంటే.. ఫిక్స్ డ్ డిపాజిట్లు తీసుకోవడం చాలా బెస్ట్.. పీఎస్‌యూ, ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే FDలపై అద్భుతమైన రాబడులను అందిస్తున్నాయి. ఓసారి లుక్కేయండి.

Highest FD Rates

  • స్టాక్ మార్కెట్ కన్నా ఫిక్స్‌డ్ డిపాజట్లపై అద్భుతమైన రాబడులు
  • ఈ ఏప్రిల్‌లో అత్యధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే
  • ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ రేటును అందిస్తున్నాయంటే?

Highest FD Rates : ఫస్ట్ టైమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా? స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువని చాలామంది ఫిక్స్ డ్ డిపాజిట్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో పెట్టుబడుల కన్నా ఈ ఎఫ్‌డీ పెట్టుబడులు చాలా సేఫ్ కూడా.. అందుకే ఈ పెట్టుబడులకు భారీ డిమాండ్ ఉంటుంది. అంతేకాదు.. ఎఫ్‌డీలపై రాబడులు ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి.

పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా టైమ్ టర్మ్ ఎంచుకోవచ్చు. మార్కెట్ రిస్క్ లేకుండా అద్భుతమైన రాబడులను కోరుకునే పెట్టుబడిదారులకు బెస్ట్ ఆప్షన్. ప్రభుత్వ రంగ (PSU), ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎంతవరకు రాబడిని పొందవచ్చు అనేది పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

ప్రైవేట్ బ్యాంక్ :
ప్రైవేట్ బ్యాంకులలో, యశ్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 3 ఏళ్ల ఎఫ్‌డీలపై 7శాతం వరకు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పెద్ద బ్యాంకులలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ కాలానికి 6.45శాతం రాబడిని అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా 6.40శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లన్నీ 3 ఏళ్ల ఎఫ్‌డీలకు వర్తిస్తాయి.

Read Also : Samsung Galaxy A Series : శాంసంగ్ తీసుకోవాలంటే ఇదే బెస్ట్ టైమ్.. A57, A37పై బంపర్ ఆఫర్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!

ప్రభుత్వ బ్యాంకులు :
ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU) తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. కానీ, సేఫ్టీ పరంగా పెట్టుబడిదారులలో బెస్ట్ ఆప్షన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 3 ఏళ్ల కాలపరిమితికి 6.30శాతం అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ 3 ఏళ్ల ఎఫ్ డీలపై 6.25శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

చిన్న ఫైనాన్స్ బ్యాంకులు :
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ రేట్లను అందించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 ఏళ్ల ఎఫ్డీలపై 7.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ కూడా ఇదే కాలానికి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి.

ఇందులో సూచించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 8, 2026 నాటికి వ్యాలీడ్ అవుతాయి. మీరు పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే మంచి రాబడిని అందించే వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, నిబంధనలు, షరతులను పోల్చి చూసుకోండి. ఈ వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల వెబ్‌సైట్‌ల ఆధారంగా రూపొందాయి. కాలక్రమేణా ఈ వడ్డీ రేట్లు మారొచ్చు.