Home Loan Rates : పండగ చేస్కోండి! ఈ జూన్‌లో తక్కువ వడ్డీకే హోం లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!
Home Loan Rates : ఈ జూన్ నెలలో ఎస్బీఐ నుంచి ఐసీఐసీఐ బ్యాంకు వరకు హోం లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.. లేటెస్ట్ డిటెయిల్స్..
- Sreehari A
- Published on- June 6, 2026 / 04:25 PM IST
Home Loan Rates
- తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్ బ్యాంకులివే
- ఎస్బీఐ నుంచి ఐసీఐసీఐ బ్యాంకు వరకు లేటెస్ట్ వడ్డీ రేట్లు
- ఆర్బీఐ రెపో రేటును యథాతథం.. ఈఎంఐలలో మార్పు లేదు
Home Loan Rates : హోం లోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఈ జూన్ నెలలో పలు బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఇటీవలే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.
ప్రస్తుతానికి హోం లోన్ల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఫలితంగా హోం లోన్లు తీసుకున్నవారు, కొత్తగా హోం లోన్ తీసుకునేవాళ్లు నెలవారీ ఈఎంఐలు పెరుగుతాయనే ఆందోళన అవసరం ఉండదు.
వాస్తవానికి, రెపో రేటు అంటే.. ఆర్‌బీఐ బ్యాంకులకు అప్పుగా ఇచ్చే రేటు.. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 5.25 శాతం వద్దే ఉంచుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంకు తెలిపింది.
ఆర్బీఐ రెపో రేటును పెంచకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు హోం లోన్లపై అందించే వడ్డీ రేట్లను కూడా పెంచలేదు. ప్రస్తుతం ఏయే బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
లేటెస్ట్ హోం లోన్ల వడ్డీ రేట్లు ఇలా :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 7.25 శాతం నుంచి 9.05 శాతం వార్షిక వడ్డీ రేటుతో హోం లోన్లను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా : బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోం లోన్లు ప్రస్తుతం సంవత్సరానికి 7.20 శాతం నుంచి 9.25 శాతం వరకు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : వడ్డీ రేటు 7.15 శాతం నుంచి 9.6 శాతం వరకు ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు ఏడాదికి 7.10 శాతం నుంచి 9.15 శాతం వరకు ఉంటుంది.
కెనరా బ్యాంక్ : ఈ బ్యాంకు ప్రస్తుతం హోం లోన్లపై సంవత్సరానికి 7.25 శాతం నుంచి 10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా : వడ్డీ రేటు 7.10 శాతం నుంచి 10.25 శాతం వరకు ఉంటుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : వడ్డీ రేట్లు 7.10 శాతం నుంచి ప్రారంభం
జీతం పొందే వారికి 8.20, జీతం పొందని వారికి 8.20 వడ్డీ రేట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ : ఈ బ్యాంక్ గృహ రుణాలపై 7.5 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం
యాక్సిస్ బ్యాంక్ : యాక్సిస్ బ్యాంక్‌లో హోం లోన్ వడ్డీ రేటు 8శాతం నుంచి ప్రారంభమై 11.9శాతం వరకు
కోటక్ మహీంద్రా బ్యాంక్ : హోం లోన్ వడ్డీ రేటు 7.60 శాతం నుంచి ప్రారంభం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: హోం లోన్ వడ్డీ 7.75శాతం నుంచి అందుబాటులో ఉంది.
