Honda City e:HEV : హోండా సెడాన్ కారు కావాలా? ఏకంగా రూ. 1.97 లక్షలు డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ఇంకా తగ్గొచ్చు!

Honda City e:HEV : హోండా సెడాన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. మీ బడ్జెట్ ధరలో హోండా సిటీ e:HEV (హైబ్రిడ్) కొనేసుకోవచ్చు. హోండా కార్లలో ఈ మోడల్ చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్తి వివరాలివే..

Honda City e:HEV

  • కొంటే ఈ హోండా సిటీ ఎలక్ట్రిక్ కారునే కొనాలి
  • సెడాన్ మోడల్ ఎంత డిస్కౌంట్ ధరకు వస్తుందంటే?
  • సెడాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.99 లక్షలు

Honda City e:HEV : హోండా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. కొత్త సెడాన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ కారు అసలు వదులుకోవద్దు. మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టగలిగితే.. హోండా సిటీ ఇ:హెచ్‌ఈవి (హైబ్రిడ్) కారును కొనేసుకోవచ్చు.

ప్రస్తుతం, హోండా కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కార్లలో హోండా సిటీ ఇ:హెచ్‌ఈవి (హైబ్రిడ్) ఒకటి. దీనిపై ప్రస్తుతం రూ. 1.97 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ కారును తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హోండా సిటీ ఇ:హెచ్‌ఈవి ధర :
హోండా సిటీ e:HEV సెడాన్ ధర విషయానికి వస్తే.. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.99 లక్షలు. మీరు ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేస్తే రూ. 2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ లిమిట్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్టాక్ కూడా లిమిటెడ్‌గానే ఉంది.

Read Also : OnePlus 13 : కొంటే వన్‌ప్లస్ కొనాలి.. ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ చాలా చీప్ గురూ.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

హోండా సిటీ ఇ:హెచ్‌ఈవి లుక్స్ :
హోండా సిటీ e:HEV లుక్, డిజైన్ విషయానికి వస్తే.. ఫ్రంట్, బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లోగోలు, అలాగే బూట్‌పై e:HEV బ్యాడ్జ్ ఉంటాయి. ఈ సెడాన్‌లో స్పోర్టీ లుక్ కోసం డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, స్పాయిలర్, డిఫ్యూజర్ ఉన్నాయి. 6 విభిన్న ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

హోండా సిటీ e:HEV లోపల కూడా అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్-టోన్ (ఐవరీ + బ్లాక్) ఇంటీరియర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, లెదర్ సీట్లు ఉన్నాయి.

హోండా సిటీ ఇంజిన్, మైలేజ్ :
హోండా సిటీ e:HEV 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ (హైబ్రిడ్ సిస్టమ్)తో పనిచేస్తుంది. ఈవీ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజన్ డ్రైవ్ అనే 3 డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ కారు లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.