×
Ad

Honda February 2026 Offers : హోండా కార్లపై భారీ ఆఫర్లు.. అమేజ్ నుంచి హోండా సిటీ వరకు రూ.2 లక్షలు డిస్కౌంట్.. ఏ కారు ధర ఎంతంటే?

ఫిబ్రవరి 2026లో కొత్త హోండా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హోండా సెడాన్, SUV మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ఏ కారు ధర ఎంతంటే?

  • Published On : February 10, 2026 / 05:22 PM IST

Honda February 2026 Offers

Honda February 2026 Offers : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త హోండా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. హోండా ఫిబ్రవరి నెలలో సెడాన్, SUV మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, అనేక బెనిఫిట్స్ ప్రకటించింది.

హోండా అమేజ్, హోండా సిటీ, హోండా ఎలివ్ వంటి కార్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపై లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రతి హోండా కారుపై ఎంత డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హోండా అమేజ్ డిస్కౌంట్ :
ప్రస్తుతం హోండా ఫిబ్రవరి 2026లో హోండా అమేజ్‌పై రూ. 57వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 7.47 లక్షలుగా ఉంది. లెవల్ 2 అడాస్, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, భారీ 416-లీటర్ బూట్‌తో వస్తుంది.

సేఫ్టీ, ఇతర ఫీచర్ల పరంగా అద్భుతమైన కారుగా చెప్పొచ్చు. కంపెనీ ప్రస్తుతం సెకండ్ జనరేషన్ హోండా అమేజ్‌పై రూ.68వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.97 లక్షలుగా ఉంది.

Read Also : Motorola G96 5G : వాలెంటైన్స్ డే సేల్.. ఈ మోటోరోలా 5జీ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో‌ జస్ట్ ఎంతంటే?

హోండా ఎలివేట్ డిస్కౌంట్ ఆఫర్లు :
హోండా ఎలివేట్ కారుపై కూడా అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఫిబ్రవరి 2026లో ఈ హోండా ఎలివేట్ కారు తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ప్రస్తుతం హోండా ఎలివేట్‌పై రూ. 1.48 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. హోండా ఎలివేట్ ధరలు రూ. 11.59 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.

హోండా సిటీ డిస్కౌంట్ ఆఫర్లు :
ఫిబ్రవరి 2026 వరకు హోండా హోండా సిటీ కారుపై భారీ ఆఫర్‌ అందిస్తోంది. ప్రస్తుతం 5వ జనరేషన్ హోండా సిటీపై రూ. 1.27 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. హోండా సిటీ ధరలు రూ. 11.95 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.

హోండా సిటీ e-HEV డిస్కౌంట్ ఆఫర్లు :
ప్రస్తుతం కంపెనీ హోండా సిటీ e:HEVపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కారు మోడల్ ప్రారంభ ధర సుమారు రూ. 19.99 లక్షలు ఉండగా రూ. 1.97 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.