Credit Card Bill
Credit Card EMI : క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ప్రస్తుత రోజుల్లో అనేక మంది క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు. చేతిలో కార్డు ఉంది కదా అని క్రెడిట్ కార్డు స్వైప్ చేసి ఆ తర్వాత బిల్లు కట్టేయొచ్చులే అని భావిస్తుంటారు. కానీ, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఎవరైనా అవసరానికి మించి క్రెడిట్ కార్డు ఖర్చు చేయడం చేస్తే.. ఆ బిల్లు ఒకేసారి చెల్లించడం చాలా కష్టంగా మారుతుంది. అప్పుడు వడ్డీ భారం భారీగా పెరుగుతుంది.
క్రెడిట్ కార్డులు గీకేసి అనవసరమైన ఖర్చులను పెంచుకోవడం చాలా ఈజీ. కానీ బిల్ జనరేట్ అయ్యాక పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సి వస్తుంది. లేదంటే బ్యాంకులు అధిక వడ్డీ వసూలు చేస్తాయి.
అది కాస్త ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డు వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
క్రెడిట్ కార్డు బిల్లు ఎక్కువైందా? ఈఎంఐ ఆప్షన్ ఇదిగో :
ఒకవేళ మీ క్రెడిట్ కార్డు బిల్లు భారీ మొత్తంలో వస్తే.. వెంటనే ఇలా చేయండి. ఒకేసారి బిల్లు చెల్లించడం కష్టంగా అనిపిస్తే అసలు ఆందోళన చెందవద్దు. అనేక బ్యాంకులు క్రెడిట్ కార్డ్ బిల్లు ఈఎంఐలుగా మార్చుకునేందుకు అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈఎఐం విధానంలో మీ మొత్తం బిల్లు చిన్న నెలవారీ వాయిదాలుగా చెల్లించవచ్చు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అయితే, తొందరగా ఈఎంఐలను కట్టేయడమే చాలా బెటర్. ఎందుకంటే.. ఏవైనా అదనపు ఛార్జీలు ఉంటే ఎక్కువ నెలలు వడ్డీగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈఎంఐలకు కన్వర్ట్ చేసే ముందు ఛార్జీలు, వడ్డీ మొత్తం ఎంత పడుతుందో చెక్ చేసుకోండి.
Read Also : PM Kisan Yojana : పీఎం కిసాన్ 22వ విడతపై ఉత్కంఠ.. ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. మీరు అర్హులేనా? చెక్ చేసుకోండి!
మీ క్రెడిట్ బిల్లు భారీ మొత్తంలో ఉండి ఒకేసారి పేమెంట్ చేయలేని సమయంలో ఈఎంఐలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి బిల్లు మొత్తాలను ఈఎంఐలుగా మార్చడం వల్ల మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా కంట్రోల్ చేయొచ్చు.
ఎవరు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు? :
మీరు ఈఎంఐ గురించి మీ కార్డ్ ప్రొవైడర్‌తో మాట్లాడండి. మీ బ్యాంక్ అకౌంట్ డిఫాల్ట్‌గా లేకపోతే మీకు గుడ్ క్రెడిట్ హిస్టరీ ఉంటే అప్పుడు మాత్రమే ఈఎంఐ ఆప్షన్ అర్హత పొందవచ్చు.
ఎవరు ఎంచుకోకూడదు? :
మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం ఒకేసారి పేమెంట్ చేస్తే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవద్దు. ఎందుకంటే.. మీ ఖర్చులతో పాటు అదనపు వడ్డీ, ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.