Senior Citizen Savings Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. ఇలా పెట్టుబడి పెట్టారంటే ప్రతి 3 నెలలకు మీ ఖాతాలో రూ. 51,250 వడ్డీ.. ఎలాగంటే?
Senior Citizen Savings Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం. ప్రతి మూడు నెలలకు మీ ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ అవుతాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published On : April 12, 2026 / 07:30 AM IST
Senior Citizen Savings Scheme
- సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన సేవింగ్ స్కీమ్
- పోస్టాఫీసులో పెట్టుబడితో ప్రతి 3 నెలలకు రాబడి ఎంతంటే?
- సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటు, రూ. 1,000తో ఖాతా ఓపెన్
Senior Citizen Savings Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మీరు సీనియర్ సిటిజన్లు అయితే ఇది మీకోసమే.. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత ఆదా చేయాలనుకుంటారు. అయితే, ఆదా చేసిన మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతమవుతుంటారు. మీ డబ్బు సురక్షితంగా ఉండి భారీ మొత్తంలో రాబడిని అందించే అద్భుతమైన పథకాలు ఉన్నాయి.
అందులో పోస్టాఫీస్ అందించే పథకం అందుబాటులో ఉంది. అదే.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS). ఈ పథకాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధుల కోసం అందిస్తోంది. ఈ వయస్సులో ఎవరిపైనా ఆధారపడకుండా సౌకర్యవంతమైన లైఫ్ గడిపేందుకు అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
2. డబ్బు నష్టపోయే రిస్క్ లేదు :
ఈ పథకాన్ని పోస్టాఫీసులు, అధీకృత బ్యాంకుల ద్వారా నిర్వహిస్తారు. ఇందులో ఎలాంటి రిస్క్ లేదు. ఎందుకంటే.. మీరు డిపాజిట్ చేసే ప్రతి రూపాయికి ప్రభుత్వం నేరుగా హామీ ఇస్తుంది. SCSS పథకం ప్రస్తుతం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సాధారణ బ్యాంక్ FD వడ్డీ రేటు కన్నా చాలా ఎక్కువ.
3. కేవలం రూ. 1,000తో ఖాతా ఓపెన్ :
ఈ పథకంలో పెట్టుబడికి ముందు లక్షల రూపాయలు అవసరం లేదు. మీరు కేవలం రూ. 1,000తో ఖాతా తెరవవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడితో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
4. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలం :
60 ఏళ్లు పైబడిన ఎవరైనా తమ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) కింద రిటైర్ అయ్యే వారికి 55 ఏళ్లు పైబడినప్పటికీ, రక్షణ శాఖ నుంచి రిటైర్మెంట్ అయ్యే వారికి 50 ఏళ్లు పైబడినప్పటికీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులను అందిస్తుంది.
ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు ఉంటుంది. ప్రతి 3 నెలలకు వడ్డీని లెక్కించి చెల్లిస్తారు. ఏ కారణం చేతనైనా 5 ఏళ్ల లోపు ఖాతాను క్లోజ్ చేస్తే.. పన్నులు మినహాయించిన తర్వాత ఫండ్స్ వాపసు ఇస్తారు.
5. ప్రతి 3 నెలలకు రూ. 51,250 వస్తాయి :
ఈ పథకంలో మీరు రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి 3 నెలలకు 8.2శాతం వడ్డీ రేటుతో రూ. 51,250 వడ్డీ లభిస్తుంది. ప్రతి నెలా మీ ఖాతాలో రూ. 17వేలు జమ అవుతాయి. 5 ఏళ్ల తర్వాత అసలు రూ. 25 లక్షలను విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు కోరుకుంటే.. మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు.
