×
Ad

Gold Price : బంగారం, వెండి ధరల్లో గణనీయ మార్పు.. 2008 తరువాత ఇదే తొలిసారి.. ప్రధాన కారణాలివే.

Gold Silver Price : జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి వరుసగా మూడరోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి, బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి.

Gold Silver

  • మళ్లీ ట్రెండ్‌లోకి వెండి
  • అమాంతం దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు
  • 2008 తరువాత ఒకరోజు అత్యధిక లాభం
  • గణనీయ మార్పులకు కారణాలివే

Gold Price : బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అమాంతం దూసుకెళ్లాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో.. ఒక్కరోజులోనే భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా 2008 నవంబర్ నెల తరువాత ఒక్కరోజులోనే అత్యధికంగా ఈ లోహాల ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Highest Selling Cars : కొత్త ఏడాది.. కొత్త జోష్.. కార్ల అమ్మకాల్లో రికార్డుల మోత.. ఈ 5 కార్లు టాప్ అంతే.. ఎగబడి కొనేశారు!

జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి వరుసగా మూడరోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి, బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య ఢిల్లీ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ర్యాలీ చేశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.24వేలు పెరిగింది.. బంగారం సైతం రూ.5వేలు లాభపడింది

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,50,500 కాగా.. కిలో వెండి రూ. 2,48,490 వద్ద ఉంది. అయితే, మంగళవారం వీటి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,500కు చేరగా.. కిలో వెండి రేటు రూ.2,79,600 వద్ద స్థిరపడ్డాయి.

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో, సురక్షితమని భావించడమే ికాక, పలు రంగాల నుంచి వస్తున్న గిరాకీ ఫలితంగా గతవారంలో ఔన్సు బంగారం ధర గతంలో ఎప్పుడూలేనంతగా తొలిసారి గరిష్ఠమైన 5,594.84 డాలర్లు వద్దకు చేరుకుంది. ఔన్సు వెండి రూ.115.50 డాలర్లకు చేరాయి. అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా వార్ష్‌ను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాక, బంగారం, వెండి ట్రేడింగ్‌లో భారీ అమ్మకాలు వచ్చాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉండాలనే వార్ష్ దృక్పథం వల్ల, డాలర్ బలోపేతం అవుతుందనే అంచనాలతో ఈ కమొడిటీల కాంట్రాక్టులను తెగనమ్మడం, వీటికి మార్జిన్లు పెంచడమూ ప్రభావం చూపింది. ఫలితంగా ఔన్సు బంగారం ధర 4403 డాలర్లకు, వెండి ధర 75డాలర్లకు దిగివచ్చింది.

ధరలు పెరుగుదలకు కారణాలు ఇవే..
బంగారం, వెండి ధరల్లో మళ్లీ గణనీయ మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో మంగళవారం మళ్లీ భారీగా కొనుగోళ్లు వచ్చాయి. ఫలితంగా 2008 నవంబరు తరువాత ఒక్కరోజులోనే అత్యధికంగా ఈ లోహాల ధరలు పెరిగాయని చెబుతున్నారు. మంగళవారం రాత్రి 11.55 గంటల సమయానికి ఔన్సు బంగారం ధర 292 డాలర్లు (6.3శాతం) పెరిగి 4926 డాలర్లకు, వెండి ధర ఆరు డాలర్లు (7.5శాతం) అధిగమై 83 డాలర్లకు చేరాయి. దేశీయంగా డాలర్ తో పోలిస్తే రూపాయి కాస్త బలపడి 90.32 స్థాయికి చేరినా కూడా ఇక్కడ బంగారం, వెండి ధరలు పెరిగాయి.