Highest Selling Cars : కొత్త ఏడాది.. కొత్త జోష్.. కార్ల అమ్మకాల్లో రికార్డుల మోత.. ఈ 5 కార్లు టాప్ అంతే.. ఎగబడి కొనేశారు!
Highest Selling Cars : జనవరి 2026లో ఈ 5 కార్లు అత్యధికంగా అమ్మడయ్యాయి. ఏయే కార్ల మోడల్స్ ఎక్కువగా సేల్ అయ్యాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Highest Selling Cars
- భారీగా అమ్మడైన సరసమైన కార్ల మోడల్స్ ఇవే
- 2026 జనవరిలో బడ్జెట్ కార్లకే ఫుల్ డిమాండ్
- మారుతి సుజుకి నుంచి టాటా వరకు జోరుగా అమ్మకాలు
Highest Selling Cars : 2026 జనవరిలో దేశీయ ఆటో రంగానికి గోల్డెన్ స్టార్ట్.. కొత్త ఏడాది ప్రారంభంలోనే కార్ల షోరూమ్లు వినియోగదారులతో నిండిపోయాయి. కొత్త కారు కొనేందుకు షోరూంలకు క్యూకట్టేసారు. వేలాది మంది డ్రీమ్ కార్ కొనేందుకు ఆసక్తి చూపించారు.
ఇందులో ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఊహించని అమ్మకాలతో మార్కెట్ షేక్ చేశాయి. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, స్టైలిష్ లుక్, ఫ్యామిలీకి సరిపడే స్పెషిఫికేషన్లు, ఫీచర్లతో ఎస్ యూవీల కార్లు ఫస్ట్ చాయిస్గా నిలిచాయి.
బడ్జెట్లో బెస్ట్ కార్లకే డిమాండ్ :
ఖరీదైన కార్ల కన్నా సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన కార్లనే ఎక్కువ మంది కొనేశారు. ధరతో పాటు మంచి మైలేజీ అందించే కార్లనే ఎక్కువగా కొన్నారు. దాంతో జనవరి సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి. జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లలో మారుతి సుజుకి నుంచి టాటా వరకు దాదాపు అన్ని కంపెనీలు భారీ అమ్మకాలతో నెల ముగించాయి.
ఒక్కసారిగా కార్ల సేల్స్ ఊపందుకోవడంతో ఆటో కంపెనీలు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి టాటా వరకు అనేక కార్ల తయారీదారులు అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. ఏ కంపెనీ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
టాటా నెక్సన్ :
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి టాటా నెక్సాన్ SUV వరకు జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన కారు. ఈ కాలంలో మొత్తం 23,365 టాటా నెక్సాన్ కొనుగోలు చేశారు. గత ఏడాదిలో కన్నా 51 శాతం ఎక్కువ. 2025లో ఈ నెలలో 15,398 టాటా నెక్సాన్లను కొనుగోలు చేశారు.
మారుతి సుజుకి డిజైర్ :
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సెడాన్ డిజైర్ జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా నిలిచింది. ఈ కాలంలో మొత్తం 19,629 యూనిట్లతో మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 27 శాతం పెరిగాయి. జనవరి 2025లో మొత్తం 15,383 యూనిట్లతో మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు జరిగాయి.
టాటా పంచ్ :
జనవరి 2026లో టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన మూడో కారుగా నిలిచింది. జనవరి 2026లో మొత్తం 19,257 యూనిట్ల టాటా పంచ్ అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 18 శాతం పెరిగింది. గత ఏడాదిలో ఈ సంఖ్య 16,231 యూనిట్లుగా ఉంది.
హ్యుందాయ్ క్రెటా :
జనవరి 2026లో భారత మార్కెట్లో పాపులర్ SUV మోడల్ హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన నాల్గో కారుగా నిలిచింది. హ్యుందాయ్ క్రెటా సేల్స్ మొత్తం 17,921 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి. గత ఏడాదిలో ఈ సంఖ్య 18,522 యూనిట్లుగా ఉంది.
మారుతి సుజుకి ఎర్టిగా :
జనవరి 2026లో మారుతి సుజుకి ఎర్టిగా ఐదో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మొత్తం 17,892 యూనిట్ల మారుతి సుజుకి ఎర్టిగా అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగాయి. గత ఏడాదిలో మొత్తం 14,248 యూనిట్ల మారుతి సుజుకి ఎర్టిగా అమ్ముడయ్యాయి.
