Amazon Prime Day Sale : అమెజాన్‌లో డబుల్ డిస్కౌంట్స్! ఈ ధరకు మళ్లీ రావు.. ఐఫోన్ నుంచి వివో వరకు సూపర్ ఆఫర్లు!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ అనేక ఇతర ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు..

Discounts on iPhones, Vivo Smartphones

  • అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 సేల్ ముగుస్తోంది
  • ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్లు
  • శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్, వివో X300 అల్ట్రాపై డిస్కౌంట్

Amazon Prime Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ ఈరోజు (సోమవారం)తో ముగుస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్, అనేక ఇతర ప్రొడక్టులపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఎందుకంటే ఈ సేల్‌లో అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి..

అమెజాన్ ప్రైమ్ డే 2026 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
ఈ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. 256జీబీ మోడల్ అసలు ధర రూ. 1,19,900 కాగా, ఇప్పుడు (Amazon Prime Day Sale) కేవలం రూ. 96,990 ధరకే లభిస్తోంది. ఐఫోన్ ఎయిర్‌తో పాటు ఐఫోన్ 17 ప్రోను కూడా రూ. 1,34,900 నుంచి రూ. 1,24,900 తగ్గింపు ధరకు కొనేసుకోవచ్చు.

శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ S26 ప్లస్ 5జీపై కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 139,999 నుంచి ఇప్పుడు రూ. 104,999కే అందుబాటులో ఉంది. ఇదిలా ఉండగా, ఈ సేల్‌లో వివో X300 అల్ట్రా భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. 16జీబీ + 512జీబీ వేరియంట్ ఇప్పుడు రూ. 1,99,999 నుంచి రూ. 1,59,999 ధరకు కొనేసుకోవచ్చు.

Read Also : Tata EV Car Discounts : కొత్త ఎలక్ట్రిక్ కారు కావాలా? ఈ జూలైలో టాటా EV కార్లపై భారీ క్యాష్ డిస్కౌంట్లు.. రూ. 3.35 లక్షల వరకు సేవింగ్స్

ఈ సేల్ కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే స్పెషల్. ప్రైమ్ సభ్యత్వం లేని కస్టమర్లు ప్రైమ్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకుంటే ఈ సేల్‌లోని అన్ని ఆఫర్‌లను పొందవచ్చు. అమెజాన్ ప్రస్తుతం ప్రైమ్ వార్షిక సభ్యత్వాన్ని ధర రూ. 1,499 నుంచి తగ్గించి రూ. 999కే అందిస్తోంది.

కొత్త కస్టమర్లు అదనంగా రూ. 500 తగ్గింపుతో పొందవచ్చు. సాధారణ ప్లాన్‌తో పాటు ‘ప్రైమ్ షాపింగ్ ఎడిషన్’ (సంవత్సరానికి రూ. 200) లేదా ‘ప్రైమ్ లైట్ ప్లాన్’ (ఏడాదికి రూ. 599) ప్లాన్లను కూడా ఎంచుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ సభ్యులు అర్హత గల బ్యాంక్ కార్డుతో అదనంగా సేవింగ్ చేసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ఎంపిక చేసిన ప్రొడక్టులు, అర్హత గల ఈఎంఐ లావాదేవీలపై 10శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన ప్రొడక్టులపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.