Hyundai Models in India : ఈ ఫిబ్రవరిలో హ్యుందాయ్ కొత్త కారు మోడళ్లపై రూ. 43వేల వరకు బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Hyundai Models in India : ఈ ఫిబ్రవరిలో హ్యుందాయ్ కార్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyundai Models in India : ఈ ఫిబ్రవరిలో హ్యుందాయ్ కొత్త కారు మోడళ్లపై రూ. 43వేల వరకు బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Hyundai Nios, i20, Aura, Venue: Benefits up to Rs 43k in February 2024

Hyundai Models in India : 2024 జనవరిలో ఆటోమొబైల్ మార్కెట్ అత్యధిక దేశీయ నెలవారీ అమ్మకాలతో ప్రారంభమైంది. ప్రముఖ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఫిబ్రవరిలో కార్లపై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపుగా రూ. 43వేల వరకు ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది.

Read Also : Dubai Multiple-Entry Visa : భారతీయ పర్యాటకుల కోసం దుబాయ్ మల్టీ ఎంట్రీ వీసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలివే

భారత మార్కెట్లో హ్యుందాయ్ 13 మోడళ్లను అందిస్తోంది. అందులో మూడు హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయిస్తోంది. అందులో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఐ20 ఎన్-లైన్‌తో పాటు ఆరా, వెర్నా అనే రెండు సెడాన్లు ఉన్నాయి. ఎస్‌యూవీ లైనప్‌లో ఎక్స్‌టర్, వెన్యూ, వెన్యూ ఎన్-లైన్, క్రెటా, అల్కాజార్, టక్సన్, కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 ఉన్నాయి. కార్‌మేకర్ మార్చి 11న క్రెటా ఎన్-లైన్‌ను ప్రకటించింది. జనవరిలో క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసింది.

ఈ నెల 29 వరకు మాత్రమే బెనిఫిట్స్ :
గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, అరోరా, వెన్యూ వంటి మోడళ్లపై అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వినియోగదారులు ఫిబ్రవరి 29 వరకు ఈ కొత్త బెనిఫిట్స్ పొందవచ్చు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 30వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్‌తో రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. హ్యుందాయ్ ఐ20పై రూ.15వేల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది.

హ్యుందాయ్ ఆరాపై రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. హ్యుందాయ్ వెన్యూ కోసం క్యాష్ డిస్కౌంట్ రూ. 20వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 10వేలు అందిస్తుంది. హ్యుందాయ్ దేశీయంగా 57,115 యూనిట్లను నమోదు చేసింది. జనవరిలోనే అత్యధికంగా సేల్స్ నమోదు చేయగా.. కార్ల తయారీ సంస్థ 2023లో రికార్డు స్థాయిలో 602,111 యూనిట్ల దేశీయ విక్రయాలను నమోదు చేసింది.

Read Also : Caller Name Display : ట్రాయ్ కొత్త రూల్స్.. ట్రూకాలర్ మాదిరిగా ‘డిఫాల్ట్ కాలర్ నేమ్’ తప్పనిసరి..! ఈ సర్వీసుపై టెల్కోల అభిప్రాయమేంటి?