Caller Name Display : ట్రాయ్ కొత్త రూల్స్.. ట్రూకాలర్ మాదిరిగా ‘డిఫాల్ట్ కాలర్ నేమ్’ తప్పనిసరి..! ఈ సర్వీసుపై టెల్కోల అభిప్రాయమేంటి?

Caller Name Display : ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ట్రూకాలర్ మాదిరిగా ఎవరూ ఫోన్ చేసినా వారి పేరు డిఫాల్ట్ కాలర్ నేమ్‌ తప్పనిసరి చేయనుంది. ఈ సర్వీసు ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Caller Name Display : ట్రాయ్ కొత్త రూల్స్.. ట్రూకాలర్ మాదిరిగా ‘డిఫాల్ట్ కాలర్ నేమ్’ తప్పనిసరి..! ఈ సర్వీసుపై టెల్కోల అభిప్రాయమేంటి?

Trai wants to make 'Truecaller-like' name display compulsory

Caller Name Display : స్పామ్ కాల్‌లను అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. భారత టెలికాం నెట్‌వర్క్‌లో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సప్లిమెంటరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టాలని దేశీయ టెలికం కంపెనీలకు ట్రాయ్ సిఫార్సు చేస్తోంది. ఈ సీఎన్ఏపీ సర్వీసు ప్రకారం.. మొబైల్ యూజర్లు అందించిన డేటాను ఉపయోగించి ఫోన్ స్క్రీన్‌లపై త్వరలో కాలర్ నేమ్ డిస్‌ప్లే కానుంది. అంటే.. కాలర్ ఐడెంటిఫికేషన్ ఫీచర్‌ను డిఫాల్ట్‌గా అందించనుంది.

Read Also : Reliance Jio New Plan : రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ఇదిగో.. 18జీబీ ఎక్స్‌ట్రా డేటా.. 14 ఓటీటీ బెనిఫిట్స్ మీకోసం..!

ఇదేగాని అమల్లోకి వస్తే.. బిజినెస్ కనెక్షన్‌లు ఉన్న సబ్‌స్క్రైబర్ ఎంటిటీలు తమ కంపెనీ పేరునే డిఫాల్ట్‌గా పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్లకు స్పామ్ కాల్స్ సమస్యను పరిష్కరించడంతో పాటు మోసాలను నియంత్రించడానికి టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఇన్‌కమింగ్ కాల్‌లలో కాలర్‌ల పేర్లను ప్రదర్శించాలని సిఫార్సు చేసింది. అయితే, ఈ కాలర్ వివరాలను కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF) నుంచి పొందవచ్చు. దీనిపై వాటాదారుల అభిప్రాయాలను స్వీకరించి చర్చించిన అనంతరం ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులను ఖరారు చేసింది.

కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) ఏంటి? :
కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అనేది ఒక సప్లిమెంటరీ సర్వీస్ (CNAP). ఈ సీఎన్ఏపీ సర్వీసు కింద రిజిస్టర్ చేసుకున్న ఎవరైనా కాల్ చేసినప్పుడు.. ఫోన్ స్క్రీన్‌లపై కాలర్ పేరు డిస్‌ప్లే అవుతుంది. ఈ తరహా కాలర్ ఐడెంటిఫికేషన్ ఫీచర్‌ను భారతీయ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ప్రవేశపెట్టాలని ట్రాయ్ టెల్కో కంపెనీలకు సిఫార్సు చేసింది.

సీఎన్ఏపీ సర్వీసు ఎలా పనిచేస్తుందంటే? :
సీఎన్ఏపీ అనేది కాంటాక్టు స్పామ్ కాల్‌లను అరికట్టగలదని భావిస్తున్నారు. సీఎన్ఏపీలో కాలర్ నేమ్ ఎవరు? అనేది కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF)లో టెలిఫోన్ సబ్‌స్ర్కైబర్ అందించిన పేరు, ఐడెంటిటీ వివరాల ఆధారంగా కనిపిస్తుంది. సీఎన్ఏపీలో నమోదైన కాలర్ నేమ్ అనేది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో రిజిస్టర్ అయిన ‘ట్రేడ్‌మార్క్ నేమ్’ లేదా జీఎస్టీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన కమర్షియల్ నేమ్ (కంపెనీ) లేదా ఏదైనా ఇతర ప్రత్యేక పేరు కావచ్చు.

ఇలా ఏదైనా ఒక పేరును డిఫాల్ట్‌గా రిజిస్టర్ చేస్తారు. సదరు వ్యక్తి పేరును రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి పేరు అధికారికంగా నమోదు అవుతుంది. ఏ నెట్ వర్క్ నుంచి ఫోన్ కాల్ చేసినా వారి పేరు డిఫాల్ట్ కాలర్ నేమ్‌గా మొబైల్ స్క్రీన్ప్‌పై కనిపిస్తుంది.

ట్రూకాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీసులకు సీఎన్ఏపీకి తేడా ఏంటి? :
లోకల్ స్మార్ట్‌ఫోన్ టూల్స్ లేదా ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ, యాంటీ స్పామ్ వంటి థర్డ్-పార్టీ యాప్‌లు కూడా ఫోన్ కాల్ సమయంలో కాలింగ్ నేమ్ డిస్‌ప్లే చేస్తాయి. స్పామ్ ఐడెంటిఫికేషన్ సౌకర్యాలను కూడా అందిస్తాయి, ఈ సర్వీసులు కేవలం క్రౌడ్-సోర్స్ డేటా ఆధారంగా ఉంటాయి. వీటిని అంతగా నమ్మలేమని ట్రాయ్ భావిస్తోంది. ఎందుకంటే.. ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి.. ఫోన్ కాలర్ తమ కాంటాక్టుల్లో సేవ్ చేసిన పేరు ఆధారంగానే డిస్‌ప్లే అవుతాయి. ఒకవేళ కాంటాక్టు సేవ్ చేయకపోతే ఫోన్ చేసినా కాలర్ నేమ్ కనిపిస్తుంది.

అందులో కచ్చితత్వం ఉండదనే వాదన వినిపిస్తోంది. అందుకే ట్రాయ్.. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ ద్వారా డిపాల్ట్ కాల్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ అందించనుంది. తద్వారా కాంటాక్టుల్లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నప్పటికీ అది కాలర్ నేమ్‌గా కనిపించదు. కొత్త సిమ్ తీసుకునే సమయంలో కస్టమర్ అప్లికేషన్ ఫారం (CAF)లో కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న కాలర్ నేమ్ ఆధారంగానే పేరు కనిపించనుంది.

సీఎన్ఏపీ సర్వీసుపై ట్రాయ్ ప్రక్రియ ఏంటి? :
ఈ కాల్ ఐడెంటిఫికేషన్ సర్వీసుపై వాటాదారులు, కస్టమర్లు, పరిశ్రమల నుంచి అభిప్రాయాలను కోరుతూ ట్రాయ్ ఒక కన్సలెంటేషన్ పేపర్ విడుదల చేసింది. వాటాదారుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా భారత టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ ప్రవేశపెట్టేందుకు ట్రాయ్ సిఫార్సులను ఖరారు చేసింది.

సీఎన్ఏపీ అమలుపై టెల్కోల వైఖరి ఏంటి? :
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ టెల్కోలు కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అమలును తప్పనిసరి చేయకూడదని, ఒక ఆప్షనల్‌గా మాత్రమే ఉంచాలని అభిప్రాయపడుతున్నాయి. గతంలోనే టెలికాం ఆపరేటర్ల కోసం.. టెలికాం ఇండస్ట్రీ బాడీ 2023 ప్రారంభంలో రెగ్యులేటర్ ట్రాయ్‌తో సాంకేతిక, ప్రైవసీ, వ్యయ సంబంధిత ఆందోళనలను లేవనెత్తింది. ఈ తరహా విధానం ద్వారా నెట్‌వర్క్ యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉందని గతంలోనే టెల్కోలు అభిప్రాయపడ్డాయి.

సీఎన్ఏపీ సర్వీసుపై ట్రూకాలర్ స్పందన ఇదే :
టెలికం పరిశ్రమలో వినియోగదారుల కమ్యూనికేషన్ సురక్షితంగా ఉండేలా ట్రాయ్ చేసే ప్రయత్నాలన్నింటిని ట్రూకాలర్ స్వాగతించింది. భారతీయ వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ట్రాయ్‌కి తన మద్దతును కూడా అందించింది. ప్రస్తుత ట్రాయ్ సిఫార్సులు భారతీయ టెలికాం యూజర్ల ప్రైవసీని అందిస్తాయని విశ్వసిస్తున్నామని అభిప్రాయపడింది. ఉత్పత్తి, భారత ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా భారతీయులకు డిజిటల్ కమ్యూనికేషన్‌ను సురక్షితంగా అందించే మిషన్‌కు కట్టుబడి ఉంటామని ట్రూకాలర్ స్పష్టం చేసింది.

Read Also : Dubai Multiple-Entry Visa : భారతీయ పర్యాటకుల కోసం దుబాయ్ మల్టీ ఎంట్రీ వీసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలివే