Hyundai Venue : హ్యుందాయ్ లవర్స్‌కు బిగ్ షాక్.. ఈ వెన్యూ కారుపై ఏకంగా రూ. 20వేలు పెంపు.. ఇంతకీ కొనాలా? వద్దా?
Hyundai Venue : కొత్త హ్యుందాయ్ కారు కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. హ్యుందాయ్ వెన్యూ ధర ఏకంగా రూ. 20వేలు పెరిగింది. కొనుగోలుదారులు ఈ వేరియంట్ కొనాలా? ఇతర వేరియంట్ కొనాలా? డిసైడ్ చేసుకోండి.
- Sreehari A
- Published On : March 30, 2026 / 07:11 PM IST
Hyundai Venue
- హ్యుందాయ్ వెన్యూ ధర భారీగా పెంపు
- వెన్యూ వేరియంట్లలో రూ. 5వేల నుంచి రూ. 20వేలు
- పెట్రోల్, డీజిల్ వెర్షన్ల ధరల సవరించిన కంపెనీ
- హ్యుందాయ్ అసలు ధర రూ. 9.55 లక్షలు
Hyundai Venue : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు హ్యుందాయ్ వెన్యూ కారు కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. ఈ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర పెరిగింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, వెన్యూలోని కొన్ని వేరియంట్ల ధరలను సవరించింది. ఈ పెరుగుదల రూ. 5,000 నుంచి రూ. 20,000 వరకు ఉంది.
హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్, డీజిల్ వెర్షన్లు రెండింటి ధరలు పెరిగాయి. కానీ, ఇతర వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్చలేదు. HX5 1.2-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లో మాత్రమే అత్యధికంగా ధర పెరిగింది. దాంతో ఇప్పడు ఈ కారు వేరియంట్ ధర ఏకంగా రూ.20,000 పెరిగింది. ఫైనల్ పూర్తి ధర రూ.9.55 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
HX2 వేరియంట్ అంతకన్నా ఎక్కువ ట్రిమ్‌లు, అదే ఇంజన్‌తో ఇతర పెట్రోల్ వేరియంట్‌లలో ఎలాంటి మార్పు లేదు. మీరు టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ తీసుకుంటే ధరలో స్వల్ప పెంపు ఉంది. 1.0-లీటర్ టర్బో DCT వేరియంట్లు (HX5, HX6) ఇప్పుడు రూ. 9,000 ఎక్కువ ఉంటే టాప్-స్పెక్ HX8 డీసీటీ ధర స్వల్పంగా రూ. 5,000 పెరిగింది.
డీజిల్ వేరియంట్ల విషయానికొస్తే.. హ్యుందాయ్ HX2, HX5, HX5 AT, HX7 వంటి ఎంపిక చేసిన ట్రిమ్‌ల ధరలను రూ.8,000 పెంచింది. అయితే, హై రేంజ్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్లు మాత్రం అదే ధరకు కొనసాగుతున్నాయి.
అదే రేంజ్ ధరలో :
హ్యుందాయ్ వెన్యూ మొత్తం ధరల రేంజ్ ఎలాంటి మార్పు లేదు. ఈ కారు ధర ఇప్పటికీ రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.15.69 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. హ్యుందాయ్ మొత్తం రేంజ్ ధరలను పైకి పెంచలేదు.
కేవలం లైనప్‌లోని ధరలను మాత్రమే మార్పులు చేసింది. ఈ ధరల మార్పుతో ఎలాంటి మెకానికల్, ఫీచర్ అప్‌డేట్‌లు లేవు. ఇంజన్ ఆప్షన్‌లు, ఫీచర్లు, మొత్తం ప్యాకేజీ యథాతథంగానే ఉన్నాయి.
మీరు అదనంగా చెల్లించేది అప్‌గ్రేడ్ కోసం కాదు కేవలం మార్కెట్ ఆధారిత సర్దుబాటు మాత్రమేనని గమనించాలి. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, ద్రవ్యోల్బణం, నియంత్రణల మార్పులుతో వాహన తయారీదారులు ధరలను పెంచుతుంటారు. మీరు HX5 పెట్రోల్ వేరియంట్‌ను కొనాలని అనుకుంటే మీ బడ్జెట్‌పై ఎఫెక్ట్ పడుతుంది. మరో వేరియంట్ చూస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
