PAN Card Misuse : లోన్ తీసుకోలేదా? అయినా డిఫాల్టర్ అవుతారు జాగ్రత్త.. పాన్ కార్డు ఉన్నవారు తప్పక తెలుసుకోండి

PAN Card Misuse : పాన్ కార్డు వాడుతున్నారా? మీకు తెలియకుండా మీ పేరుతో సైబర్ నేరగాళ్లు లోన్లు తీసుకుంటున్నారు.. బ్యాంకుల దృష్టిలో మీరు లోన్ చెల్లించని డిఫాల్టర్లు అవుతారు జాగ్రత్త.. ఎలా నివారించాలంటే?

PAN Card Misuse ( Image Credit : AI )

  • మీ పేరుతో ఫేక్ లోన్లు ఉన్నాయని మీకు తెలుసా?
  • పాన్ కార్డు వివరాలతో మీకు తెలియకుండా లోన్లు ఉండొచ్చు
  • క్రెడిట్ స్కోరు దెబ్బతినడమే కాదు.. బ్యాంకులు మీపై లీగల్ చర్యలు తీసుకోవచ్చు

PAN Card Misuse : మీ పాన్ కార్డు సేఫేనా? పాన్ కార్డుదారులు జర జాగ్రత్త.. పాన్ కార్డుల దుర్వినియోగంతో ఆర్థిక మోసాల కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మోసాలలో నేరగాళ్లు బాధితుల పేర్లతో ఫేక్ లోన్లు తీసుకుంటున్నారు.

తద్వారా వారి క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటోంది. అందుకే మీ సిబిల్ క్రెడిట్ స్కోర్‌ను రెగ్యులర్ (PAN Card Misuse) చెక్ చేసుకోవడం బెటర్. అలాగే అన్ నౌన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పర్సనల్ డాక్యుమెంట్లను షేర్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

నేటి డిజిటల్ యుగంలో మీ పాన్ కార్డ్ ఇకపై కేవలం టాక్స్ డాక్యుమెంట్ మాత్రమే కాదు.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి లోన్ తీసుకోవడం, పెట్టుబడి పెట్టడం వరకు ప్రతి ఆర్థిక లావాదేవీకి అత్యవసరం. కానీ, ఇదే పాన్ కార్డుతో అనేక సమస్యలకు దారితీస్తుందని మీకు తెలుసా? ఇటీవల పాన్ కార్డ్ మోసాల కేసులు ఎక్కువగా పెరిగాయి. చాలామంది ప్రజలు తమకు తెలియకుండానే అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు.

సైబర్ నేరగాళ్ల ట్రాప్ ఎలా ఉంటుంది? :
సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. తరచుగా డేటా లీక్‌లు, డేంజరస్ వెబ్‌సైట్‌లు లేదా ఫిషింగ్ లింక్‌ల ద్వారా మీ పాన్ నంబర్, ఇతర వ్యక్తిగత డేటాను దొంగిలిస్తారు. ఆ తర్వాత, మోసగాళ్లు మీ పాన్ నంబర్‌తో తక్కువ డాక్యుమెంటేషన్ అవసరమయ్యే ఆన్‌లైన్ లోన్ యాప్‌లు లేదా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి లోన్లు పొందుతారు.

అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ కేవైసీ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. నేరగాళ్లు ఫేక్ ఐడెంటిటీలను ఉపయోగించి ఈజీగా లోన్లు పొందుతారు. పాన్ కార్డుదారుడికి ఈ విషయం అసలు తెలియదు.

Read Also : Amazon Summer Sale 2026 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఈ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని డిస్కౌంట్లు.. ఆపిల్, డెల్ ఏదైనా కొనేయొచ్చు!

మీ క్రెడిట్ స్కోర్ తగ్గినప్పుడే తెలుస్తుంది :
పాన్ కార్డు మోసంలో అత్యంత డేంజరస్ అంశం ఇదే.. మీరు వెంటనే మోసాన్ని గుర్తించలేరు. బ్యాంకు మోసాల వల్ల తరచుగా ఇన్‌స్టంట్ నోటిఫికేషన్‌లు వస్తాయి. కానీ, పాన్ మోసాలు తరచుగా ఇలాంటి నేపథ్యంలోనే జరుగుతాయి. మోసగాళ్లు లోన్లు తీసుకుని ఈఎంఐలను తిరిగి చెల్లించకపోతే మీ సిబిల్ స్కోరు ఒక్కసారిగా పడిపోతుంది.

ఇలాంటి సందర్భాలలో మోసాలు బయటపడతాయి :
స్వయంగా లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకుంటే బ్యాంకు వారిని ‘డిఫాల్టర్లు’గా పేర్కొంటూ రిజెక్ట్ చేస్తుంది. క్రెడిట్ స్కోరు అకస్మాత్తుగా ఎలాంటి కారణం లేకుండా పడిపోతుంది. రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలవుతాయి.

ప్రొటెక్షన్ కోసం ఏం చేయాలి? :
మోసపోక ముందే అప్రమత్తంగా ఉండటం సురక్షితమని నిపుణులు అంటున్నారు. మీ పాన్ కార్డు సురక్షితంగా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి.

1. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను రెగ్యులర్ చెక్ చేయండి : మీరు తీసుకోని లోన్ అకౌంట్లు ఏవైనా ఉన్నాయేమో చూసేందుకు ప్రతి 3-4 నెలలకు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయండి.

2. డాక్యుమెంట్లను సేఫ్ గా పెట్టుకోండి : పాన్ కార్డ్ ఫొటోకాపీని ఎక్కడైనా ఇచ్చే ముందు (ఉదా.. XYZ బ్యాంక్‌లో KYC కోసం మాత్రమే) అని రాసి సైన్ చేయండి.

3. అన్ సేఫ్ యాప్‌లను వాడొద్దు : మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా డాక్యుమెంట్లను ఏ తెలియని యాప్‌లోనూ అప్‌లోడ్ చేయొద్దు.

మీరు మోసపోతే ఏం చేయాలి? :
మీ పేరు మీద మోసపూరిత రుణం తీసుకున్నట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు లేదా NBFCకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. అలాగే, CIBIL వంటి క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌లో ఆ వివరాలను రిపోర్టు చేయండి. అలాగే చట్టపరమైన రక్షణ కోసం నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930)లో కూడా కంప్లయింట్ చేయండి.