×
Ad

Income Tax Rules : ఇన్‌కమ్ టాక్స్ రూల్స్.. భర్త డబ్బులను భార్య SIPలో ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే రాబడిపై టాక్స్ ఎవరు కట్టాలి? ITRలో చూపించాలా?

Income Tax Rules : ఒక భర్త తన భార్యకు డబ్బు గిఫ్ట్ గా ఇస్తే ఆమె ఆ మొత్తాన్ని SIP వంటి పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ పెట్టుబడి నుంచి వచ్చే రాబడిపై పన్ను ఉంటుందా? లేదా పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

Income Tax Rules ( Image Credit : Google Gemini AI )

  • భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన డబ్బులపై భర్త టాక్స్ చెల్లించాలా?
  • భర్త డబ్బులను SIPలో పెట్టుబడి పెడితే భార్య కూడా పన్ను చెల్లించాలా?
  • పెట్టుబడిపై వచ్చే రాబడిపై ఎవరు టాక్స్ కట్టాలి?
  • SIPలో పెట్టుబడిపై వచ్చే రాబడిని ఐటీఆర్ లో చూపించాలా?

Income Tax Rules : ప్రస్తుత రోజుల్లో వచ్చే ఆదాయంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడిదారుల డిమాండ్ తగినట్టుగానే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే, కొంతమందికి ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువగా రాబడి వస్తుందా అని చూస్తుంటారు.

ఈ క్రమంలోనే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP)లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ ఎస్ఐపీలో పెట్టుబడితే లాంగ్ టర్మ్ భారీగా డబ్బలు సంపాందించుకోవచ్చునని భావిస్తుంటారు. అయితే, పెట్టుబడులపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందని అందరికి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది. అసలు డౌట్ ఇక్కడే మొదలవుతుంది.

సాధారణంగా భర్తలు సంపాదిస్తుంటారు. భార్యలు ఖర్చు పెడుతుంటారు. ఇంటి అవసరాలకో లేదా వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికో వాడుతుంటారు. అదే భర్త తన భార్యకు రూ. 10,000 ఇస్తే.. ఆమె ఆ డబ్బులను తెలివిగా పెట్టుబడి కోసం SIPగా మారిస్తే దానిపై వచ్చే రాబడిపై పన్ను పడుతుందా? మీకు కూడా ఇలాంటి సందేహమే వచ్చిందా?

పన్ను పడుతుందా? ఎవరిది బాధ్యత? :
వాస్తవానికి చాలామందికి దీనిపై పెద్దగా అవగాహన ఉండదు. మీరు కూడా దీనికి సమాధానం కోసం వెతుకుతుంటే ఇది మీకోసమే.. ఒకవేళ భార్య పెట్టుబడిపై పన్ను పడితే అది ఎవరికి వర్తిస్తుంది? ఖర్చు పెట్టినవారికా? లేదా డబ్బులు ఇచ్చిన వాళ్లకా? ఎవరు బాధ్యత వహిస్తారు? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : New Rental Rules : అద్దెదారులకు బిగ్ రిలీఫ్.. ‘కొత్త అద్దె చట్టం’తో ఇంటి ఓనర్లు జాగ్రత్త.. ఈ 7 రూల్స్ తెలియకపోతే భారీగా నష్టపోతారు!

దంపతుల్లో చాలామంది భర్తలు తరచుగా తమ భార్యలకు ఇచ్చే డబ్బు గిఫ్ట్ అని, పన్ను మినహాయింపుగా భావిస్తారు. అయితే, ఇందులో కొద్దిగా మాత్రమే నిజం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(vii) ప్రకారం.. వారి భార్యలకు ఇచ్చే బహుమతులు వారి ఆదాయపు పన్ను రిటర్న్‌లపై (ITR) పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి.

అయితే, భార్య ఆ డబ్బును వేరే చోట పెట్టుబడి పెడితే.. ఆ పెట్టుబడిపై వచ్చే రాబడిపై పన్ను పడుతుంది. ఆదాయపు పన్ను శాఖ ఆ రాబడిని భర్త ఆదాయంలో భాగంగా పరిగణిస్తుంది. సెక్షన్ 64(1)(iv) ప్రకారం అది భర్త ఆదాయంలోకే వస్తుంది. భర్త ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది.

భార్యాభర్తలు ఎప్పుడు పన్నులు ఏయే సందర్భాల్లో చెల్లించాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం..

పేమెంట్ విధానం క్లబ్బింగ్ రూల్ కీలక వివరాలు
క్యాష్ గిఫ్ట్ పన్ను లేదు భర్త తన భార్యకు ఎంత మొత్తమైనా బహుమతిగా ఇవ్వవచ్చు. దానిపై ‘గిఫ్ట్ టాక్స్’ ఉండదు.
గిఫ్ట్ డబ్బును పెట్టుబడిగా పెడితే క్లబ్బింగ్ రూల్ వర్తిస్తుంది భార్య గిఫ్ట్ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టి వడ్డీని సంపాదిస్తే ఆ వడ్డీ భర్త ఆదాయానికి వర్తిస్తుంది. 
ప్రాపర్టీ  ట్రాన్స్ ఫర్ (పేమెంట్ కుండా) క్లబ్బింగ్ రూల్ వర్తిస్తుంది భర్త తన భార్య పేరు మీద ఇల్లు లేదా వాటాలను బదిలీ చేస్తే దానిపై వచ్చే అద్దె లేదా డివిడెండ్‌ను భర్త ఆదాయంగా పరిగణిస్తారు.
స్త్రీధన్ / పిన్ మనీ పన్ను లేదు ఇంటి ఖర్చుల నుంచి ఆదా చేసిన డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడిని భార్య సొంత ఆదాయంగా పరిగణిస్తారు.
ప్రొఫెషనల్ శాలరీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది భార్య భర్త కంపెనీలో పనిచేస్తుంటే.. ఆమెకు ఆ పనిలో అనుభవం ఉంటేనే ఆ జీతంపై టాక్స్ ఉంటుంది. 
క్యాపిటల్ గెయిన్స్ క్లబ్బింగ్ వర్తిస్తుంది  భర్త బహుమతిగా ఇచ్చిన ఆస్తిని అమ్మడం ద్వారా భార్య లాభం పొందితే, ఆ లాభం భర్త పన్ను రిటర్న్‌లో చూపించాలి. 
ఆదాయం మీద ఆదాయం క్లబ్బింగ్ వర్తించదు పెట్టుబడి నుంచి వచ్చిన వడ్డీని వేరే చోట తిరిగి పెట్టుబడి పెడితే, ఆ రెండో పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయం భార్య సొంత ఆదాయంగా పరిగణిస్తారు.

భార్య కూడా పన్ను చెల్లించాలా? :

భర్త తన భార్యకు డబ్బు ఇస్తే.. అది గిఫ్ట్ లేదా ఇంటి ఖర్చుల కోసం పరిగణిస్తారు. అయితే అలాంటి డబ్బుపై ఎలాంటి పన్ను పడదు. కానీ, ఆ డబ్బును పెట్టుబడి పెట్టి క్యాపిటల్ గెయిన్స్ పొందితే అది భర్త ఆదాయానికి యాడ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో భార్య ప్రత్యేక పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) నుంచి వచ్చే రాబడిపై మూలధన లాభాల పన్ను విధిస్తారు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి ఒక ఏడాదికి ముందు డబ్బు విత్ డ్రా చేస్తే స్వల్పకాలిక మూలధన లాభాలు (STCG) కింద 15శాతం పన్ను పడుతుంది. అయితే, పెట్టుబడిని ఒక ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉంచితే దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG) కింద రూ. లక్ష వరకు లాభాలు పన్ను రహితంగా ఉంటాయి. అంతకు మించి ఉంటే 10శాతం పన్ను పడుతుంది.