Diesel isobutanol : E20 అయిపోయింది.. ఇప్పుడు మళ్లీ ఇంకోటి వచ్చింది.. ఇప్పుడు డీజిల్లో కలుపుతారట.. అదేంటంటే..!
Diesel isobutanol : ఇథనాల్ డీజిల్‌తో కలవదు.. అందుకే ఐసోబుటానాల్‌గా మారుస్తోంది.. ఇథనాల్‌ను డీజిల్‌తో నేరుగా కలపలేం.. అందుకే ఇథనాల్ నుంచి ఐసోబుటానాల్‌ను జనరేట్ చేస్తున్నామంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
- Sreehari A
- Updated on- July 4, 2026 / 06:46 PM IST
Diesel isobutanol
- భారత్ ఇంధన రంగంలో మరో కొత్త అడుగు
- పెట్రోల్‌కు ఇథనాల్, డీజిల్‌కు ఐసోబుటానోల్
- డీజిల్‌లో ఐసోబుటానోల్ ఎందుకు?
Diesel isobutanol : వార్నీ.. ఇన్నాళ్లూ E20 ఇథనాల్ పెట్రోల్‌లో కలుపుతామన్నారు.. ఇప్పుడు కొత్తగా డీజిల్లో కూడా ఏదో కొత్త ఇంధనాన్ని కలుపుతారట. పెట్రోల్, డీజిల్ రెండింటిలో ఒకే ఇంధనం కలపకూడదా? అందుకే ఐసోబుటానోల్ అనే ఇంధనాన్ని కలపాలని కేంద్రం భావిస్తోందా? అసలు ఇదేంటి? రెండింట్లో వేర్వేరుగా ఎందుకు కలపాలి? వీటితో ప్రయోజనం ఏంటి?
అసలు ఈ20 ఇథనాల్ డీజిల్‌లో ఎందుకు కలపకూడదు? ఐసోబుటానోల్ మాత్రమే ఎందుకు కలపాలి? కేంద్రం ఈ దిశగా ఎందుకు అడుగులు వేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పెట్రోల్‌లో E20 (20 శాతం ఇథనాల్) అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్ కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి (Diesel isobutanol) డీజిల్‌లో 15 శాతం వరకు ఐసోబుటానోల్ కలిపే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
దిగుమతి ముడి చమురుపై పూర్తిగా ఆధారపడకుండా దేశీయంగా తయారయ్యే జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు.
అయితే, అందరిలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది.. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపినట్టే డీజిల్‌లో కూడా ఎందుకు కలపకూడదు? దీనికి కారణం శాస్త్రీయంగా ఇథనాల్ డీజిల్‌తో సహజంగా కలవదు. ఈ రెండింటి రసాయన లక్షణాలు భిన్నంగా ఉంటాయి. అందుకే ఇథనాల్‌ను ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఐసోబుటానోల్‌గా మార్చేసి దాన్ని డీజిల్‌కు ప్రత్యామ్నాయ జీవ ఇంధనంగా వాడాలని కేంద్రం భావిస్తోంది.
Read Also : Flipkart Goat Sale : ఐఫోన్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఐఫోన్ 17 ప్రోపై ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్..!
గడ్కరీ ఏమన్నారంటే? :
మంత్రి గడ్కరీ ప్రకారం.. వంద శాతం ఇథనాల్, వంద శాతం ఐసోబుటానోల్‌తో పైలట్ పరీక్షలు జరిగాయి. ఇందులో జనరేటర్ సెట్లు విజయవంతంగా పూర్తయ్యాయి. దాంతో ఈ ఇంధనాలతో పనిచేసే ఇంజిన్లను డెవలప్ చేయడం సాధ్యమేనని కేంద్రం భావిస్తోంది. భవిష్యత్తులో డీజిల్‌లో 15 శాతం వరకు ఐసోబుటానోల్ మిశ్రమాన్ని కలపడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఐసోబుటానోల్ అంటే ఏంటి? :
ఐసోబుటానోల్ అనేది నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయల్‌గా చెబుతున్నారు. ఇది డీజిల్‌తో ఈజీగా కలిసిపోతుంది. హై ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది. అలాగే కార్బన్ ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం కూడా ఇందులో ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఇంధన భద్రతకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సైతం భావిస్తున్నారు.
ఇక E20 ఇథనాల్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇథనాల్ కారణంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని, వారెంటీలు రద్దవుతాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందనే ప్రచారంపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని డిసెంబర్ 2025 నాటికే సాధించగా, ఈ కార్యక్రమంతో రూ.1.9 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా, ముడి చమురు దిగుమతులు తగ్గడం, కార్బన్ ఉద్గారాల నియంత్రణ, రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు వంటి ప్రయోజనాలు లభించాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని డీజిల్ రంగంలో కూడా అమలు చేయాలని చూస్తోంది. తద్వారా దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని మరింత తగ్గించడమే కేంద్రం తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది.
