దేశంలో మొబైల్ తయారీ సంస్థలకు భారత్ ప్రోత్సాహాకాలను అందించాలని యోచిస్తోంది. దేశంలో మొబైల్ ఫ్యాక్టరీలను స్థాపించేలా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులకు సబ్సిడీ రుణాలు అందించే ప్రణాళికను పరిశీలిస్తోంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్. ఇంక్, సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కోడాట్ ఉత్పత్పిదారులకు ఇండియాలో మ్యానిఫ్యాక్చర్ ఫ్యాక్టరీలను ఓపెన్ చేసేలా ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన రాయితీలు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న ఫెడరల్ బడ్జెట్ లో భాగంగా మొబైల్ తయారీ సంస్థల రుణాలపై వడ్డీ రాయితీలను ఆఫర్ చేసే అవకాశం ఉందని పేరు చెప్పేందుకు అంగీకరించని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అంతేకాదు.. రోడ్లు, విద్యుత్ నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలతో పాటు, పన్నువిధించడం, కస్టమ్స్ క్లియరెన్స్‌తో కూడిన పారిశ్రామిక జోన్ల ఏర్పాటు కూడా ఇందులో ఉందని ఆయన చెప్పారు.
ఇప్పుడు, 24 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 190 బిలియన్ల విలువైన మొబైల్ ఫోన్లను తయారు చేయాలని భారత్ యోచిస్తున్నట్టు తెలిపారు. అతిపెద్ద అసెంబ్లర్ అపిల్ హ్యాండ్ సెట్స్ ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపు ఇండియాలో ఐఫోన్ల తయారీలో దూసుకెళ్తోంది. ఇప్పటికే దక్షణ భారతీయ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రెండు ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీలను రన్ చేస్తోంది. అదే ఫ్యాక్టరీ నుంచి చైనా దిగ్గజం షియోమీ, నోకియా హ్యాండ్ సెట్ల తయారీ కూడా జరుగుతోంది.
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడింగ్ ఉద్రిక్తతల మధ్య ఫాక్స్‌కాన్, ఆపిల్ కంపెనీలకు ఇండియాలో మరింత మొబైల్ ఉత్పత్తులకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. మొబైల్ తయారీ ఫ్యాక్టరీల స్థాపనకు ఇచ్చే రుణాల రాయితీలపై ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించగా, ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని అధికారి స్పష్టం చేశారు. ఆపిల్, శాంసంగ్ హైఎండ్ మొబైల్ హ్యాండ్ సెట్లను తయారు చేసి వాటిని యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి చేయాలని భారత్ యోచిస్తున్నట్టు తెలిపారు.