EPFO Aadhaar UAN : ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. EPFO కొత్త రూల్.. ఇకపై ఆధార్, UAN లింక్, క్లెయిమ్ సెటిల్మెంట్స్ వెరీ ఈజీ..!

EPFO Aadhaar UAN : యూఐడీఏఐ సెంటర్ల వద్ద లాంగ్ క్యూలతో పనిలేదు. మీ ఆధార్ UANతో లింక్ చేసేందుకు ఈపీఎఫ్ఓ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.

EPFO Aadhaar UAN : ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. EPFO కొత్త రూల్.. ఇకపై ఆధార్, UAN లింక్, క్లెయిమ్ సెటిల్మెంట్స్ వెరీ ఈజీ..!

EPFO Aadhaar UAN

Updated On : August 16, 2025 / 5:51 PM IST

EPFO Aadhaar UAN : పీఎం ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధార్ సీడింగ్, UAN కరెక్షన్, క్లెయిమ్ సెటిల్మెంట్ వంటి ఇతర (EPFO Aadhaar UAN) నిబంధనలను సులభతరం చేస్తూ తన లేటెస్ట్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడం గతంలో కన్నా ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది.

గతంలో UIDAI సెంటర్ వద్ద భారీ క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సౌకర్యంతో మీరు ఇంట్లో కూర్చొని మీ ఆధార్ వివరాలను UANకి లింక్ చేయవచ్చు. మీ ఆధార్ వివరాలలో ఏదైనా లోపం ఉంటే.. సులభంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ప్రక్రియ చాలా వేగంగా పూర్తి అవుతుంది. తద్వారా మీరు ఈపీఎఫ్ఓ నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

ఆధార్‌ UANతో లింక్ ప్రాసెస్ :

ఈపీఎఫ్ఓ ఇటీవలే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పుడు ఆధార్‌ను యూఏఎన్‌తో లింక్ చేయడం చాలా సులభం. అలాగే, తప్పుగా పడిన వివరాలను కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీ UANలో రిజిస్టర్ అయిన పేరు, పుట్టిన తేదీ లేదా లింగం సరిగ్గా లేకుంటే.. ఆధార్‌ను UANతో లింక్ చేసే ప్రక్రియ సులభతరం చేసింది.

ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా సరిపోలితే.. ఎంప్లాయిర్ మీ ఆధార్‌ను యూఏఎన్‌తో లింక్ చేయమని అడగవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోని నో యువర్ కస్టమర్ ( KYC) ఫంక్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.

Read Also : Jio Cheapest Plan : జియో చీపెస్ట్ ప్లాన్ ఇదిగో.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్.. అన్‌లిమిటెడ్ కాల్స్, మరెన్నో బెనిఫిట్స్..!

యూఏఎన్, ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ లేదా లింగంలో తేడా ఉండటం కామన్. చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురువుతుంది. గతంలో ఈ ఇలా తప్పుగా పడితే సరిదిద్దడానికి UIDAI సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది.

కానీ, ఇప్పుడు అలా కాదు.. ఈపీఎఫ్ఓ ఇందుకోసం కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అదే.. జాయింట్ డిక్లరేషన్.. జేడీ ఫంక్షనాలిటీగా పిలుస్తారు. మీరు పనిచేసే కంపెనీకి ఆన్‌లైన్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసి తప్పుగా ఉన్న వివరాలను సరిదిద్దవచ్చు. ఈ సౌకర్యంతో చాలా సందర్భాలలో మాన్యువల్ ప్రాసెస్ ఉండదు. అంటే.. మీరు మళ్లీ మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

UANతో రాంగ్ ఆధార్ లింక్ చేస్తే ఎలా? :

కొన్నిసార్లు రాంగ్ ఆధార్ నంబర్ పొరపాటున UANతో లింక్ అవుతుంది. గతంలో ఈ మిస్టేక్ ఎడిట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎంప్లాయిర్ జేడీ ఫంక్షనాలిటీ ద్వారా సరైన ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

ఆ తర్వాత, రిక్వెస్ట్ అప్రూవల్ కోసం EPFO రీజినల్ ఆఫీసుకు వెళ్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. మీ పని త్వరగా పూర్తవుతుంది. EPFO ఆధార్ సీడింగ్ అనేది 2014లో ప్రారంభమైంది. తద్వారా సభ్యులు తమ బెనిఫిట్స్ నేరుగా పొందవచ్చు. కంపెనీ ఎంప్లాయిర్‌పై ఆధారపడనక్కర్లేదు.

ఈ కొత్త సౌకర్యం ఈపీఎఫ్ఓ సభ్యులకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది. ఇప్పుడు మీరు UIDAI సెంటర్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. పేపర్ వర్క్ గురించి కూడా ఆందోళన అవసరం లేదు.

మీ కంపెనీ ఎంప్లాయర్‌ను సంప్రదించి మీ ఆధార్ వివరాలను UANకి లింక్ చేయండి. తద్వారా మీ PF, ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు. ఆలస్యం చేయొద్దు.. ఈరోజే మీ వివరాలను చెక్ చేయండి. అవసరమైతే వెంటనే ఆయా వివరాలను అప్‌డేట్ చేసుకోండి.