×
Ad

UTS App : బిగ్ అలర్ట్.. మార్చి 1 నుంచి రైల్వే UTS యాప్ పనిచేయదు, కొత్త ‘రైల్‌వన్’ టికెట్ బుకింగ్‌పై 3శాతం డిస్కౌంట్!

Indian Railways Alert: మార్చి 1, 2026 నుంచి UTS యాప్ పనిచేయదు. ఇకపై రైల్వే ప్రయాణీకులు RailOne యాప్ ద్వారా మాత్రమే అన్ రిజర్వ్డ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, సీజన్ టిక్కెట్లను బుక్ చేసుకోగలరు.

  • Published On : February 28, 2026 / 05:24 PM IST

Indian Railways Alert

  • మార్చి 1 నుంచి రైల్వే UTS యాప్ సర్వీసులు బంద్
  • రైల్ వన్ కొత్త యాప్ సర్వీసులు అందుబాటులోకి
  • అన్ రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, అన్ని బుకింగ్స్ రైల్‌వన్ యాప్

Indian Railways Alert: రైల్వే ప్రయాణికులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. మార్చి 1 నుంచి అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) యాప్‌ నిలిచిపోనుంది. ప్రస్తుతం, అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, సీజన్ టిక్కెట్లను మాత్రమే బుకింగ్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ యూటీఎస్ యాప్ స్థానంలో అన్ని రకాల రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు కొత్త సూపర్ యాప్ రైల్‌వన్ రాబోతుంది.

మార్చి 1 నుంచి భారత రైల్వేలు UTS యాప్‌ను నిలిపివేస్తాయి. దాంతో ప్రయాణికులు అన్ రిజర్వ్డ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, సీజన్ టిక్కెట్లను బుక్ చేసుకోలేరు. ఇప్పటినుంచి అన్ని రైలు టికెట్ బుకింగ్‌లను రైల్‌వన్ యాప్‌ ద్వారానే చేయాల్సి ఉంటుంది.

ఈ రైల్ వన్ యాప్‌ను రైల్వేలు ఇప్పటికే ప్రారంభించాయి. రైల్‌వన్ యాప్‌ను వాడేందుకు ప్రయాణీకులు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పనిలేదు. ఆసక్తిగల వినియోగదారులు ప్రస్తుత UTS, IRCTC లాగిన్‌ ద్వారా సైన్ అప్ అవ్వొచ్చు.

Read Also : Oppo Holi Offer : ఒప్పో హోలీ ధమాకా! టాప్ OPPO ఫోన్లపై ఖతర్నాక్ ఆఫర్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI

ఆండ్రాయిడ్, iOSలో రైల్‌వన్ యాప్ :
రైల్‌వన్ యాప్ ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ యాప్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త యాప్ అప్పుడప్పుడు రైళ్లలో ప్రయాణించేవారికి బెస్ట్. రిజర్వేషన్లు లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకునే రోజువారీ ప్రయాణికులు కూడా కొత్త ప్లాట్‌ఫామ్ నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. గతంలో యూటీఎస్ ఇంటర్‌ఫేస్ మునుపటి ప్లాట్‌ఫామ్ కన్నా చాలా ఈజీగా ఉంటుంది.

అన్ రిజర్వ్డ్ టిక్కెట్లపై 3శాతం తగ్గింపు :
క్యాష్ లెస్ ట్రావెలింగ్ ప్రోత్సహించేందుకు ప్రయాణీకులు కొత్త ప్లాట్‌ఫామ్‌కు మారేలా ప్రొత్సహించేందుకు భారతీయ రైల్వేలు రైల్ వన్ ద్వారా బుక్ చేసుకున్న అన్ రిజర్వ్ టిక్కెట్లపై 3శాతం తగ్గింపు అందిస్తోంది.

ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జూలై 14 వరకు లిమిట్ టైమ్ ఉంటుంది. డిస్కౌంట్ కోసం రైల్వే ప్రయాణీకులు యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ వ్యాలెట్లను వాడొచ్చు. రైల్‌వన్ ద్వారా నేరుగా చేసే బుకింగ్‌లకు మాత్రమే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఇతర ప్లాట్‌ఫామ్‌లకు ఈ ఆఫర్ వర్తించదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.