iPhone 15 : ఆఫర్ అదిరింది బ్రో.. మీ శాంసంగ్ ఫోన్‌తో తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు.. ఈ బంపర్ డిస్కౌంట్ మళ్లీ రాదు!
iPhone 15 : మీరు శాంసంగ్ ఫోన్ యూజర్ అయితే ఈ బంపర్ డిస్కౌంట్ మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుత అవకాశం.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 15
iPhone 15 : ఆపిల్ ఐఫోన్ క్రేజే వేరు.. ప్రతిఒక్కరూ ఆపిల్ ఐఫోన్ కొనాలని ఉంటుంది. కానీ, అంత బడ్జెట్ పెట్టే ధైర్యం చేయలేరు. అదే ఖరీదైన ఐఫోన్ అతి తక్కువ ధరకే వస్తుందంటే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి.. ఎగిరి గంతేస్తారు. ఎలాగైనా ఆ ఐఫోన్ సొంతం చేసుకోవాలని అనుకుంటారు.
ఐఫోన్ 15 సిరీస్‌లోని అన్ని వేరియంట్ల ధరలు ఇటీవలే భారీగా తగ్గాయి. మీరు కూడా ఐఫోన్ 15 తక్కువ ధరకే కొనాలని భావిస్తే ఇదే సరైన అవకాశం. మీరు చేయాల్సిందిల్లా.. ఇప్పుడే కొనుగోలు చేయడమే. అది ఎలా అంటారా? మీ దగ్గర శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్ ఉంటే చాలు.. ఐఫోన్ 15పై రూ. 16వేల వరకు స్పెషల్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ లక్షలాది మంది కస్టమర్ల కోసం ఐఫోన్ 15 (128GB) వేరియంట్‌పై అద్భుతమైన డీల్స్ అందిస్తున్నాయి. అమెజాన్ ఈ హై-ఎండ్ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్లను అందిస్తోంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ప్రమోషన్‌లను కూడా అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను పూర్తిగా వినియోగిస్తే.. మీరు రూ.45,500 కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 15ను పొందవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 15పై డిస్కౌంట్లు :
ఐఫోన్ 15 128GB వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.79,900 వద్ద లిస్టు అయింది. ప్రస్తుతం, కంపెనీ 23 శాతం తగ్గింపును అందిస్తోంది. తద్వారా మీరు రూ.61,390కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అదనంగా, అమెజాన్ ఐఫోన్ 15 128GB కోసం ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది.
ఇదే ధరపై రూ.27,350 వరకు తగ్గింపును అందిస్తుంది. మీ శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్ మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉంటే మాత్రం.. ఈ ప్రీమియం ఫోన్‌ను దాదాపు రూ.45,500కి కొనుగోలు చేయొచ్చు. వాస్తవ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఐఫోన్ 15 (128GB) స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15 గ్లాస్ రియర్ ప్యానెల్‌తో కూడిన అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో ఈ ఫోన్ డస్ట్, వాటర్ ఎక్స్‌పోజర్ రెండింటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అద్భుతమైన వ్యూ కోసం డాల్బీ విజన్‌కు సపోర్టు ఇచ్చే 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది.
ప్రొటెక్షన్ కోసం ఫోన్ సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. ఐఫోన్ iOS 17పై రన్ అవుతుంది. అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆపిల్ 6GB వరకు ర్యామ్‌తో అందిస్తుంది. 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. బ్యాక్ సైడ్ 48MP, 12MP లెన్స్‌లతో మల్టీఫేస్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అయితే, 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పవర్ అందించే 3349mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.