PhonePe UPI Circle : ఫోన్‌పేలో UPI సర్కిల్ ఫీచర్.. మీరే కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇదే వాడొచ్చు.. బ్యాంకు అకౌంట్లతో పనిలేదు..!
PhonePe UPI Circle : ఫోన్‌పేలో యూపీఐతో ప్రైమరీ యూజర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సర్కిల్‌లో యూపీఐ ఐడీ లేదా QR కోడ్‌తో సర్కిల్‌లో యాడ్ చేయొచ్చు. సెకండరీ యూజర్లు ఈజీగా పేమెంట్లు చేయొచ్చు.

PhonePe UPI Circle
PhonePe UPI Circle : ప్రస్తుత రోజుల్లో డిజిటల్ పేమెంట్లు రోజురోజుకూ సర్వసాధారణంగా మారాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే (PhonePe) ఇప్పుడు గ్రూపుల మధ్య లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు స్పెషల్ ఫీచర్ ప్రవేశపెట్టింది.
అదే.. ఫోన్‌పే యూపీఐ సర్కిల్ ఫీచర్. వినియోగదారులు ఇతరుల తరపున పేమెంట్లను అనుమతిస్తుంది. అనేక బ్యాంకు అకౌంట్లు లేదా UPI IDల అవసరం ఉండదు. ఫ్యామిలీ మెంబర్ల నుంచి సన్నిహిత వ్యక్తుల గ్రూపుల వరకు అందరూ పేమెంట్లను ఈ సర్కిల్ ఫీచర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇందులో పేమెంట్స్ చాలా సురక్షితంగా ఉంటాయి.
ఫోన్‌పేలో UPI సర్కిల్ ఏంటి? :
పాపులర్ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే ఇటీవలే UPI సర్కిల్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్‌లు ఒక సభ్యుడిని ప్రైమరీ యూజర్‌గా గ్రూప్‌ను క్రియేట్ చేయొచ్చు. ఈ గ్రూప్‌లోని సెకండరీ యూజర్లు చేసే అన్ని పేమెంట్లపై ప్రైమరీ యూజర్ కంట్రోల్ చేస్తారు.
సర్కిల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రైమరీ యూజర్ ఫ్యామిలీ లేదా స్నేహితుల కోసం పేమెంట్ల కోసం కంట్రోల్ ఇవ్వవచ్చు. అలాంటి సభ్యులకు బ్యాంక్ అకౌంట్ లేదా లింక్ చేసినా UPI ID లేకపోయినా పేమెంట్లు ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు.
UPI సర్కిల్ ఎలా వర్క్ అవుతుందంటే? :
సెకండరీ యూజర్లు సొంత యూపీఐ ఐడీల ద్వారా పేమెంట్లు చేయవచ్చు. కానీ, అన్ని లావాదేవీలకు ప్రైమరీ యూజర్ నుంచి అప్రూవల్ అవసరం. ప్రైమరీ యూజర్ పేమెంట్ రిక్వెస్ట్ ఆమోదించడం లేదా రిజెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు చేయవచ్చో ఆప్షన్ కూడా పొందవచ్చు.
వినియోగదారుడు పేమెంట్ హిస్టరీని ట్రాక్ చేయవచ్చు. స్పెండింగ్ లిమిట్స్ కూడా సెట్ చేయవచ్చు. ఎంతమంది అయినా మెంబర్లను ఇందులో యాడ్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. ఒకే ప్రైమరీ యూజర్ కోసం గరిష్టంగా 5 సెకండరీ యూజర్లను యాడ్ చేసుకోవచ్చు. చిన్న గ్రూపులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
యూపీఐ సర్కిల్‌ను సెటప్ చేయాలంటే? :
- యూపీఐ సర్కిల్‌ను యాక్టివేట్ చేసేందుకు యూజర్లు PhonePe యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయాలి.
- హోమ్ స్క్రీన్‌లో ఈ ఫీచర్‌ను చూడొచ్చు.
- ‘UPI సర్కిల్’పై ట్యాప్ చేశాక UPI ID ఇన్‌పుట్ చేయాలి. QR కోడ్‌లను స్కాన్ చేయాలి
- స్నేహితులు లేదా బంధువులను ఈ సర్కిల్ ఫీచర్‌తో యాడ్ చేయొచ్చు.
- స్పెండింగ్ లిమిట్స్, పర్మిట్స్ (పూర్తి లేదా పాక్షికం) వ్యాలిడిటీతో పాటు సెట్ చేయవచ్చు.
- సెటప్‌ను పూర్తి చేసే ముందు UPI పిన్‌ను సెట్ చేయాలి.
- సరిగ్గా 30 నిమిషాల్లో ఈ సర్కిల్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
- సెకండరీ యూజర్లకు పేమెంట్లు చేసే ముందు బయోమెట్రిక్ లేదా పాస్‌కోడ్ అథెంటికేషన్ అవసరం.
యూపీఐ సర్కిల్ ఎందుకు గేమ్ ఛేంజర్ :
ఈ కొత్త ఫీచర్ ముఖ్యంగా కుటుంబాలకు లేదా పిల్లల కోసం ఖర్చు చేసే తల్లిదండ్రులకు సౌకర్యవంతంగా ఉంటుంది. డిజిటల్ పేమెంట్లు చేయడంలో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు కూడా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. యూపీఐ సర్కిల్‌తో భద్రత, నియంత్రణ పొందవచ్చు.
సెక్యూరిటీ, లిమిటేషన్స్ :
యూపీఐ సర్కిల్‌లో అథెంటికేషన్ కోసం ఫైనల్ పేమెంట్లను ప్రైమరీ యూజర్లు యాక్సస్ చేయగలరు. సెకండరీ యూజర్లు బయోమెట్రిక్స్ లేదా పాస్‌వర్డ్ ద్వారా అథెంటికేషన్ చేయించుకోవాలి. యూపీఐ సర్కిల్‌లో ఒకేసారి గరిష్టంగా 5 సెకండరీ యూజర్లు ఉండవచ్చు. తద్వారా ఈ ఫీచర్ కంట్రోలింగ్, సేఫ్‌గా ఉంటుంది.