Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, వన్‌ప్లస్ ఏదైనా కొనేసుకోండి!

Best Camera Phones : కొత్త ఫోన్ కావాలా? శాంసంగ్ నుంచి వివో, వన్‌ప్లస్ ఫోన్ల వరకు అదిరిపోయే కెమెరా ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. మీకు ఏ ఫోన్ కావాలో ఓసారి లుక్కేయండి.

Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, వన్‌ప్లస్ ఏదైనా కొనేసుకోండి!

Best Camera Phones

Updated On : April 20, 2025 / 12:47 PM IST

Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అనేక కొత్త మోడల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ఫోన్ కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? మీకు ఏ ఫోన్ బ్రాండ్ కావాలో డిసైడ్ చేసుకోండి.

తక్కువ ఖర్చుతో హై క్వాలిటీ ఫొటోలు అందించే ఫోన్లు కావాలా? అయితే, ఇది మీకోసమే.. రూ. 20వేల లోపు అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే కెమెరా ఫీచర్లను అందిస్తాయి. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు, పర్ఫార్మెన్స్ డిజైన్, ధర పరంగా బెస్ట్ కెమెరా ఫోన్లను అందిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఏదో ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.

Read Also : Summer AC Problems : ఏంటి.. మీ AC కూలింగ్ సరిగా లేదా? టెక్నీషియన్ పిలిచే ముందు ఈ సింపుల్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

శామ్సంగ్ గెలాక్సీ M55 5G ధర : రూ. 17,999
శాంసంగ్ గెలాక్సీ M55 5G పవర్‌ఫుల్ డిస్‌ప్లేతో కూడిన ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. మల్టీమీడియా ప్రియులకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. కెమెరా సెటప్ డేటైమ్ బాగుంటుంది. క్లియర్ షాట్‌లను క్యాప్చర్ చేయొచ్చు. మల్టీమీడియా పవర్‌హౌస్ అని చెప్పవచ్చు.

Pros :

ఆకర్షణీయమైన డిజైన్
గుడ్ డిస్‌ప్లే క్వాలిటీ
కెమెరా పర్ఫార్మెన్స్
బ్యాటరీ లైఫ్

Cons :
పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ ఆప్షన్
ఛార్జర్ బాక్స్‌లో ఉండదు.

కీలక ఫీచర్లు :
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1
ర్యామ్ : 8GB
డిస్‌ప్లే : 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ ప్లస్, 120Hz
కెమెరాలు : 50MP + 8MP + 2MP రియర్, 50MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ : 5000mAh, ఫాస్ట్ ఛార్జింగ్

వివో T3 5G ధర రూ. 18,499 :
ఈ సిగ్మెంట్‌లో వివో T3 5G ఫోన్ అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ కలిగిన మోడల్. బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ పెద్దగా అవసరం లేకపోవచ్చు. పవర్, పర్ఫార్మెన్స్ రెండింటికి ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు.

Pros :
స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్
ఆకర్షణీయమైన డిజైన్
బ్యాటరీ లైఫ్

Cons :
రెండు మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ పరిమితం
ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లు అధికంగా ఉండొచ్చు.

కీలక ఫీచర్లు :
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7200
ర్యామ్ : 8GB
డిస్‌ప్లే : 6.67-అంగుళాల FHD+ AMOLED, 120Hz
కెమెరాలు : 50MP + 2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ : 5000mAh, ఫాస్ట్ ఛార్జింగ్

రెడ్‌మి నోట్ 14 5G ధర రూ. 17,998 :
ప్రైమరీ సెన్సార్‌లోని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కారణంగా రెడ్‌మి నోట్ 14 అద్భుతమైన కెమెరాను అందిస్తుంది. అమోల్డ్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోటోగ్రఫీని అందిస్తుంది.

Pros :
బ్రైట్ అమోల్డ్ డిస్‌ప్లే
OISతో ప్రైమరీ కెమెరా
స్ట్రాంగ్ బ్యాటరీ బ్యాకప్

Cons :
కొన్ని ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్
థర్మల్ ఎఫిసియెన్సీ

కీలక ఫీచర్లు :
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా
ర్యామ్ : 6GB
డిస్‌ప్లే : 6.67-అంగుళాల FHD+ AMOLED, 120Hz
కెమెరాలు : 50MP + 8MP + 2MP బ్యాక్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ : 5110mAh, ఫాస్ట్ ఛార్జింగ్

రియల్‌మి P2 ప్రో ధర రూ. 18,290 :
రియల్‌మి P2 ప్రో స్పీడ్ ఛార్జింగ్‌తో స్టైలిష్ ఫోన్‌ను కోరుకునే యూజర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే, ఈ ఫోన్ కెమెరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది.

Pros :
అద్భుతమైన డిజైన్
డిస్‌ప్లే క్వాలిటీ
అద్భుతమైన పర్ఫార్మెన్స్
స్పీడ్ ఛార్జింగ్

Cons :
కెమెరా క్వాలిటీ
ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లు

కీలక ఫీచర్లు :
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2
ర్యామ్ : 8GB
డిస్‌ప్లే : 6.7-అంగుళాల FHD+ OLED, 120Hz
కెమెరాలు : 50MP + 8MP బ్యాక్, 32MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ : 5200mAh, సూపర్ VOOC ఛార్జింగ్ 4.0

వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G ధర : రూ. 17,998
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఫోన్ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. డేలైట్ ఫొటోగ్రఫీ, అద్భుతమైన బ్యాటరీతో తక్కువ కాంతిలో కూడా ఆకర్షణీయమైన ఫొటోలను తీయొచ్చు. సాలిడ్ డిస్‌ప్లేతో బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం మన్నికను అందిస్తుంది.

Pros :
అద్భుతమైన డిజైన్
డేలైట్ ఫోటోగ్రఫీ
బ్యాటరీ సామర్థ్యం
వైబ్రండ్ డిస్‌‌ప్లే

Cons :
తక్కువ-కాంతిలో అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్
పాత ప్రాసెసర్

కీలక ఫీచర్లు :
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 695
ర్యామ్ : 8GB
డిస్‌ప్లే : 6.67-అంగుళాల FHD+ అమోల్డ్, 120Hz
కెమెరాలు : 50MP + 2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ : 5500mAh, సూపర్ VOOC ఛార్జింగ్

Read Also : Redmi Turbo 4 Pro : కొత్త రెడ్‌‌మి టర్బో 4 ప్రో వచ్చేస్తోందోచ్.. వచ్చేవారమే లాంచ్.. ఫీచర్లు కోసమైన కొనాల్సిందే.. ఫుల్ డిటెయిల్స్!

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనేసుకోవచ్చు. శాంసంగ్ నుంచి వివో, రెడ్‌మి, రియల్‌మి, వన్‌ప్లస్ వీటిలో ఏదైనా కావొచ్చు. కెమెరా ఫీచర్ల పరంగా అన్ని అద్భుతమైన ఫోన్లనే చెప్పాలి. ఫాస్ట్ ఛార్జింగ్, డిజైన్‌ పరంగా అన్ని బెటరే.. మీ బడ్జెట్ ధరలో కేవలం రూ. 20వేల లోపు ధరలో మంచి కెమెరా ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.