Summer AC Problems : ఏంటి.. మీ AC కూలింగ్ సరిగా లేదా? టెక్నీషియన్ పిలిచే ముందు ఈ సింపుల్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

Summer AC Problems : మీ ఎయిర్ కండిషనర్ సరిగ్గా కూలింగ్ ఇవ్వడం లేదా? టెక్నీషియన్‌ను పిలిచే ముందు మీరు ఈజీగా ఫిక్స్ చేయగల కొన్ని సింపుల్ టిప్స్ ఓసారి ప్రయత్నించండి.

Summer AC Problems : ఏంటి.. మీ AC కూలింగ్ సరిగా లేదా? టెక్నీషియన్ పిలిచే ముందు ఈ సింపుల్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

Summer AC Problems

Updated On : April 20, 2025 / 11:03 AM IST

Summer AC Problems : బాబోయ్ ఎండలు మండిపోతున్నాయి.. కాసేపు కూడా ఇంట్లో ఏసీ లేదా కూలర్ ఆన్ చేయకుండా ఉండలేని పరిస్థితి. వేడిని తట్టుకునేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఏసీలు, కూలర్లపైనే ఆధారపడుతున్నారు. మీరు కూడా మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా? ఎండాకాలంలో కొన్ని ఏసీలు ఉన్నట్టుండి కూలింగ్ అందించవు.

Read Also : EPFO 3.0 Launch : ఉద్యోగులకు పండగే.. EPFO 3.0 కొత్త వెర్షన్ బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఇకపై అన్ని క్షణాల్లోనే..!

ఏసీకి ఏమైందో అర్థం కాదు. మీరు ఏసీ రిపేరింగ్ కోసం టెక్నీషియన్‌కు కాల్ చేసే ముందు.. అసలు ఆ సమస్య ఏంటో పరిష్కరించేందుకు మీరు ఇంట్లో ప్రయత్నించండి.. అందుకు కొన్ని టిప్స్ ట్రై చేస్తే చాలు.. అది చిన్న సమస్యే కావచ్చు. ఇలా చేయడం ద్వారా మీ సమయంతో పాటు డబ్బు రెండింటినీ ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సింపుల్ చెకింగ్ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీ గదిలో ఏసీ కూలింగ్ ఇవ్వడం లేదా? మీకు మీరే సమస్య ఏంటో గుర్తించేందుకు ప్రయత్నించండి. అప్పటికీ సమస్య అలానే ఉంటే టెక్నిషియన్ పిలిచి ఫిక్స్ చేయించుకోండి. ముందుగా మీరు మాత్రం ఇంట్లో ఈ సింపుల్ 7 టిప్స్ ఓసారి ప్రయత్నించి చూడండి.

1. థర్మోస్టాట్ సెట్టింగ్స్ చెక్ చేయండి :
ముందుగా థర్మోస్టాట్‌ను చెక్ చేయండి. అది ‘కూల్’ మోడ్‌కు (స్నోఫ్లేక్ సింబల్) సెట్ సరిగా లేదో చూడండి. ప్రస్తుత గది టెంపరేచర్ కన్నా తక్కువగా ఉండేలా చూడాలి. కొన్నిసార్లు, థర్మోస్టాట్ అనుకోకుండా ‘ఫ్యాన్’ మోడ్‌కి సెట్ చేస్తారు. ఇలా ఉంటే తగినంత కూలింగ్ అందించదు.

2. ఎయిర్ ఫిల్టర్‌ను క్లీనింగ్ లేదా రిప్లేస్ చేయండి :
మురికిగా లేదా మూసుకుపోయిన ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫ్లోను అడ్డుకుంటుంది. కూలింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. ఫిల్టర్ దుమ్ముతో నిండిపోయినట్లు కనిపిస్తే లేదా క్లీన్ చేయకపోతే.. కడగాలి లేదా కొత్తది వేయాలి. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేసుకోవడం బెటర్.

3. అవుట్‌డోర్ యూనిట్‌ను చెక్ చేయండి :
అవుట్‌డోర్ కండెన్సర్ యూనిట్ కూలింగ్‌లో కీ రోల్ అదే. దుమ్ము, ఆకులు లేదా ఏదైనా చెత్త  అడ్డుపడటం ద్వారా అది కొన్నిసార్లు మూసుకుపోతుంది. ఓసారి అది చెక్ చేయండి. దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని క్లీన్ చేయండి. ఏవైనా అడ్డంకులను ఉంటే తొలగించండి. ఎయిర్ ప్లో పెరుగుతుంది. కూలింగ్ కూడా పెరుగుతుంది.

4. తలుపులు, కిటికీలు క్లోజ్ చేయండి :
మీ గదిలోని అన్ని తలుపులు, కిటికీలు గట్టిగా క్లోజ్ చేయండి. బహిరంగ ప్రదేశాలు చల్లని గాలిని బయటకు పంపేందుకు వెచ్చని గాలి గదిలోకి రాకుండా ఉంటాయి. అప్పుడు ఏసీ ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా కూలింగ్ చాలా తక్కువగా ఉంటుంది.

5. ఐస్ పేరుకుపోయిందో లేదో చెక్ చేయండి
మీరు ఏసీ కాయిల్స్ లేదా పైపులపై ఐస్ పేరుకుపోయినట్లు గమనించినట్లయితే.. యూనిట్‌ను ఆఫ్ చేసి కొన్ని గంటలపాటు అది కరగనివ్వండి. ఎయిర్ ప్లో సరిగా లేకపోవడం లేదా లో రిఫ్రిజెరాంట్ లెవల్స్ కారణంగా ఇలా మంచులా పేరుకుపోవచ్చు. అప్పుడప్పుడూ చెక్ చేస్తూ ఉండండి.

6. సర్క్యూట్ బ్రేకర్‌ను రీసెట్ చేయండి :
కొన్నిసార్లు ట్రిప్డ్ సర్క్యూట్ బ్రేకర్ ఏసీ సరిగ్గా పనిచేయకుండా ఆపవచ్చు. ఎలక్ట్రికల్ ప్యానెల్‌ను చెక్ చేయండి. అవసరమైతే బ్రేకర్‌ను రీసెట్ చేయండి. అలాగే, పవర్ సప్లయ్ సరిగా ఉండేలా చూసుకోండి.

Read Also : Motorola Edge 60 Series : ఈ ఫోన్ రేంజే వేరబ్బా.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 కీలక ఫీచర్లు, డిజైన్ లీక్.. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు..!

7. గది లోపల వేడిని తగ్గించండి :
అనవసరమైన లైట్లు, అప్లియన్సెస్ ఆపివేయండి. ఇంట్లో ఎండ పడకుండా ఉండేలా కర్టెన్లను క్లోజ్ చేయండి. గదిలో వేడిని ఎంతగా తగ్గిస్తే ఏసీ అంత వేగంగా కూలింగ్ చేస్తుంది.

ఈ టిప్స్ మీరు ప్రయత్నించినా ఏసీ పని చేయకపోతే.. ప్రొఫెషనల్ టెక్నీషియన్‌ను పిలవడమే మంచిది. రెగ్యులర్ మెయింట్‌నెన్స్, సర్వీసింగ్ వెంటనే చేయడం వల్ల భవిష్యత్తులో కూలింగ్ ఇష్యూ రాకుండా ఆపొచ్చు.