Motorola Edge 60 Series : ఈ ఫోన్ రేంజే వేరబ్బా.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 కీలక ఫీచర్లు, డిజైన్ లీక్.. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు..!
Motorola Edge 60 Series : మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ మోటోరోలా రేజర్ 60 సిరీస్, మోటరోలా ఎడ్జ్ 60 ప్రోతో పాటు వచ్చే వారం లాంచ్ కానుంది. లీకైన డేటా ప్రకారం.. అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ రానుంది.

Motorola Edge 60 Series
Motorola Edge 60 Series : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే వార్త.. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 24న జరిగే కంపెనీ నెక్స్ట్ లాంచ్ ఈవెంట్‌లో మోటోరోలా రేజర్ 60 సిరీస్, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
టిప్‌స్టర్ రాబోయే మోటోరోలా ఎడ్జ్ 60 కీలక స్పెసిఫికేషన్‌లను మార్కెటింగ్ మెటీరియల్‌లతో పాటు లీక్ చేశారు. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED స్క్రీన్‌ను కలిగి ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుందని అంచనా. 50MP బ్యాక్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 5,200mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
మోటోరోలా ఎడ్జ్ 60 స్పెసిఫికేషన్లు (అంచనా) :
టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ (@evleaks) పోస్ట్ చేసిన లీక్ ఫొటోలను పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ గత మోటోరోలా ఎడ్జ్ 50తో దగ్గరి పోలికను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో బ్యాక్ ప్యానెల్‌లోని ఎత్తైన ఐలెండ్ కెమెరా మాడ్యూల్స్ ఒకే సైజు కలిగి ఉంటాయి.
లీకైన ఫొటోల ప్రకారం.. :
మోటోరోలా ఫోన్ 68W ఛార్జర్, USB కేబుల్, బాక్స్‌లో ఫోన్ కవర్‌తో రావొచ్చు. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లను సూచిస్తుంది. మే 2024లో మీడియాటెక్ ద్వారా ప్రవేశపెట్టిన డైమెన్సిటీ 7300 SoCతో వస్తుందని భావిస్తున్నారు. దాంతో పాటు 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ ఉంటుంది.
ఫోన్ లాంచ్ అయ్యే ప్రాంతం ఆధారంగా ఈ కాన్ఫిగరేషన్‌లు మారవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K (2,712×1,220 పిక్సెల్స్) pOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని అంచనా. టిప్‌స్టర్ రెండర్‌లను పరిశీలిస్తే.. ఈ హ్యాండ్‌సెట్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుందని భావిస్తున్నారు.
కెమెరా ఫీచర్లు (అంచనా) :
లేటెస్ట్ లీక్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 60లో 50MP బ్యాక్ కెమెరా, సోనీ లైటియా 700C సెన్సార్‌తో వస్తుందని వెల్లడైంది. ఇతర బ్యాక్ కెమెరాల గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ, మోటోరోలా ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు. మోటోరోలా రాబోయే ఎడ్జ్ 60 హ్యాండ్‌సెట్‌ను 5,200mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈ ఫోన్ 68W ఛార్జర్‌తో రానుంది.
లీకైన ఫోటోలను పరిశీలిస్తే.. MIL-STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 60 ఏప్రిల్ 24న మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, మోటరోలా రేజర్ 60 సిరీస్‌లతో పాటు వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.