Baby Born Twice : మిరాకిల్ బేబీ : ఈ శిశువు ఒకసారి కాదు.. తల్లి గర్భం నుంచి రెండుసార్లు జన్మించింది.. వైద్యచరిత్రలోనే అద్భుతం..!
Baby Born Twice : యూకేలో అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక బిడ్డ ఒకసారి కాదు.. ఏకంగా రెండుసార్లు జన్మించింది. ఆ పిల్లవాడి తల్లి ఆక్స్‌ఫర్డ్‌లో టీచర్. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు.

Baby Born Twice
Baby Born Twice : ఒక్కటే జననం.. ఒక్కటే మరణం.. అంటారు.. కానీ, వైద్య చరిత్రలోనే ఇప్పుడు ఇదో మిరాకిల్.. ఒక శిశువు ఒకసారి మాత్రమే జన్మిస్తుంది. కానీ, అదే శిశువు రెండుసార్లు జన్మించింది. ఇది వింతగా అనిపించినా పచ్చి నిజం. అరుదైన ఈ ఘటన యూకేలో వెలుగుచూసింది. అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
20 వారాల గర్భవతి అయిన ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన టీచర్ లూసీ ఐజాక్ అండాశయ క్యాన్సర్‌ను తొలగించుకునేందుకు 5 గంటల ఆపరేషన్ చేయించుకుంది. ఈ సమయంలో సర్జన్లు ఆమె గర్భాన్ని తాత్కాలికంగా తొలగించారు. లూసీ ఐజాక్, ఆమె భర్త ఆడమ్ ఐజాక్‌లకు అయితే, లిటిల్ బ్రాఫెర్టీ ఐజాక్ జన్మించాడు.
కానీ, ఈ బుడ్డి బాఫెర్టీ ప్రపంచంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. తల్లి గర్భం నుంచి రెండోసారి అదే ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో 32 ఏళ్ల ఐజాక్.. 3 నెలల గర్భవతి అని బ్రిటన్‌కు చెందిన డైలీ మెయిల్ నివేదించింది. అల్ట్రాసౌండ్ ఆమె అండాశయాలలో క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడించింది.
జాన్ బ్రాడ్‌క్లిఫ్ హాస్పిటల్ వైద్యులు ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడలేదు. లూసీకి వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయడమే బెటర్ అని భావించారు. బిడ్డ పుట్టే వరకు వేచి ఉండటం వల్ల క్యాన్సర్ వ్యాపిస్తుందని ఆందోళన చెందారు. అప్పటికే లూసీ 3 నెలల గర్భవతి కావడంతో కీహోల్ సర్జరీ సాధ్యం పడలేదు.
క్యాన్సర్ సర్జరీ ఎలా జరిగిందంటే? :
కానీ, డాక్టర్ సోలేమాని మజ్ద్ నేతృత్వంలోని వైద్యబృందం శస్త్రచికిత్స సమయంలో పుట్టబోయే బిడ్డ రాఫెర్టీని గర్భంలోనే ఉంచి క్యాన్సర్ కణాలను తొలగించాలని నిర్ణయించింది. శిశువు గర్భాశయంలో ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేయాలన్నారు. ఈ సర్జరీలో భాగంగా లూసీ శరీరం నుంచి ముందుగా గర్భాశయాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత క్యాన్సర్ కణాలను తొలగించి తిరిగి అదే గర్భశయాన్ని లూసీ శరీరంలోకి మార్పిడి చేశారు అనమాట..
ఈ రకమైన శస్త్రచికిత్స ప్రపంచంలో కొన్ని సార్లు మాత్రమే జరిగింది. కానీ, కొడుకు, తల్లి భవిష్యత్తు గురించి ఆలోచించి లూసీ కుటుంబం డాక్టర్ ప్రతిపాదనకు అంగీకరించింది. గత అక్టోబర్ సమయంలో 20 వారాల గర్భవతిగా ఉన్న లూసీని శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. 15 మంది వైద్య నిపుణుల బృందంతో మొత్తం మీద శస్త్రచికిత్స 5 గంటలకు పైగా కొనసాగింది.
లూసీ గర్భాన్ని తాత్కాలికంగా తొలగించిన వైద్యులు.. కీలకమైన రక్త నాళాలు, కణజాలాలకు అనుసంధానించి ఉంచారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆ తర్వాత జనవరి నెలాఖరులో లూసీ తన కొడుకు బ్రాఫెర్టీకి జన్మనిచ్చింది.
శిశువును చూడగానే డాక్టర్ భావోద్వేగం :
లూసీ, ఆడమ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆడమ్‌కు 2022లో కిడ్నీ మార్పిడి జరిగింది. లూసీ క్యాన్సర్‌ను జయించి తిరిగి వచ్చింది. తన కొడుకును చేతుల్లో పట్టుకోవడం తమ జీవితాల్లోనే అద్భుతమని ఆడమ్ అన్నారు. పుట్టిన కొన్ని వారాల తర్వాత లూసీ, ఆడమ్ బ్రాఫెర్టీతో కలిసి డాక్టర్ సోలేమానీని కలిశారు. శస్త్రచికిత్స చేసిన వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. బుడ్డోడు బ్రాఫెర్టీని చూసిన డాక్టర్ సోలేమానీ సైతం భావోద్వేగానికి గురయ్యారు.
శస్త్రచికిత్స సమయంలో రాఫెర్టీ ఉన్న లూసీ గర్భసంచిని సురక్షితమైన ఉష్ణోగ్రతలో వెచ్చని సెలైన్ ప్యాక్‌లో జాగ్రత్తగా చుట్టి, ఇద్దరు వైద్యులు నిశితంగా పర్యవేక్షించారు. రాఫెర్టీ ఉష్ణోగ్రత తగ్గకుండా ప్రతి 20 నిమిషాలకు ప్యాక్‌ను మార్చారు. వైద్య బృందం పరీక్ష కోసం కణితిని తొలగించింది.
పిండంగా ఒకసారి.. జన్మించాక ఒకసారి :
ఇది గ్రేడ్ టూ క్యాన్సర్‌గా వెల్లడించింది. క్యాన్సర్ కణజాలాన్ని తొలగించిన తర్వాత గర్భసంచిని తిరిగి అదే స్థానంలో అమర్చారు. మొత్తం మీద, బార్ఫార్టీ పిండంగా దాదాపు రెండు గంటల పాటు తల్లి గర్భం వెలుపల ఉంది. కాబట్టి వైద్యుల ప్రకారం.. రెండుసార్లు జన్మించినట్టే..
వాస్తవానికి, తనకు క్యాన్సర్ లక్షణాలు లేవని లూసీ చెప్పింది. అయినప్పటికీ, క్యాన్సర్‌ను గుర్తించిన వైద్యులకు ఆమె కృతజ్ఞుతలు తెలిపింది. బ్రిటన్‌లో ప్రతి ఏడాది 7వేల కన్నా ఎక్కువ మంది మహిళలు అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వారిలో మూడింట రెండు వంతుల మంది చివరి దశలో నిర్ధారణ అవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటన్‌లో ప్రతి ఏడాదిలో 4వేల మంది అండాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.