Home Loans EMI : మీరు హోం లోన్ తీసుకున్నారా? దిగొస్తున్న వడ్డీ రేట్లు.. ఈఎంఐల భారం ఇలా తగ్గించుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

Home Loans EMI : ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత అనేక బ్యాంకులు రుణ రేట్లను తగ్గిస్తున్నారు. హోం లోన్ తీసుకున్న వాళ్లు నెలవారీ ఈఎంఐలపై వడ్డీ రేట్ల భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకుందాం..

Home Loans EMI : మీరు హోం లోన్ తీసుకున్నారా? దిగొస్తున్న వడ్డీ రేట్లు.. ఈఎంఐల భారం ఇలా తగ్గించుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

Home Loans EMI

Updated On : April 20, 2025 / 2:19 PM IST

Home Loans EMI : హోం లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటు 0.25 శాతం తగ్గించి 6 శాతానికి కుదించింది. దాంతో అన్ని బ్యాంకులు హోం లోన్ ఆధారిత పలు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. 2025 ఏడాది ఆఖరిలోగా రెపో రేటు మరింత తగ్గే అవకాశం ఉంది.

Read Also : Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, వన్‌ప్లస్ ఏదైనా కొనేసుకోండి!

అదే జరిగితే హోం లోన్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గిన వడ్డీ రేట్లతో హోం లోన్ తీసుకున్నవాళ్లు నెలవారీ ఈఎంఐల భారాన్ని తగ్గించుకోవచ్చు. దాంతో నెలవారీ ఈఎంఐల భారం తగ్గనుంది. ఇంతకీ వడ్డీరేట్ల తగ్గింపుతో హోం లోన్ తీసుకున్నవారికి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కొద్ది మొత్తంలో చెల్లింపు :
మీ దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నాయా? హోం లోన్ మొత్తంలో ముందే కొద్ది పేమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ నెలవారీ బడ్జెట్‌కు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈఎంఐ భారం తగ్గడమే కాదు.. లోన్ పేమెంట్ కాల పరిమితి కూడా తొందరగా అయిపోతుంది.

ఈఎంఐ చెల్లింపు ఇలా :
వడ్డీ రేటు తగ్గితే ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. అలా అని ఈఎంఐ పరిమితిని తగ్గించుకోవద్దు. గతంలో డెబ్ట్ మాదిరిగానే ఈఎంఐ చెల్లింపులు చేయండి. దాంతో అదనంగా చెల్లించాల్సిన ఈఎంఐ అసలు మొత్తంపై క్రెడిట్ అవుతుంది. దాంతో లోన్ పేమెంట్ టర్మ్ కూడా క్రమంగా తగ్గుతుంది.

వడ్డీ రేటు తగ్గాలంటే? :
హోం లోన్ కోసం చర వడ్డీ రేటు తప్పనిసరి. ఎందుకంటే.. సమయానికి దగ్గర డబ్బులు లేనప్పుడు కొంత మొత్తాన్ని ముందే పేమెంట్ చేయొచ్చు. దీనిపై బ్యాంకులు పెనాల్టీ చార్జీలు వేయవు. ప్రతి ఏడాది ఇలా 2 నుంచి 3 చెల్లింపులు చేసినా కొద్ది మొత్తంలోనైనా వడ్డీ భారం తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటుతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తాయి.

మీరు హోం లోన్ తీసుకున్న బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకపోతే.. మీ హోం లోన్ తక్కువ వడ్డీ రేటు అందంచే మరో బ్యాంకుకు మార్చుకోవచ్చు. మిగిలిన లోన్ మొత్తంపై ఒక శాతం వరకు చెల్లించాల్సి వస్తుంది. లీగల్, టెక్నికల్ చార్జీల కింద రూ.5వేలు నుంచి రూ.15వేలు, అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కింద రూ. వెయ్యి నుంచి రూ.5వేలు చెల్లించాల్సి రావచ్చు. మీరు ఆయా బ్యాంకులను అభ్యర్థిస్తే ఈ అదనపు చార్జీలను తగ్గించే అవకాశం ఉంటుంది.

పన్ను ప్రయోజనాలివే :
మీరు తీసుకున్న అప్పు ముందే పేమెంట్ చేసినా కూడా పన్ను బెనిఫిట్స్ అలానే ఉంటాయి. పాత పన్ను విధానంలో సెక్షన్ 80C కింద ఏటా రూ.15 లక్షల అసలు, సెక్షన్ 21 (B) కింద రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఒకేసారి ముందస్తు పేమెంట్లు చేయకండి.

Read Also : PhonePe UPI Circle : ఫోన్‌పేలో UPI సర్కిల్ ఫీచర్.. మీరే కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇదే వాడొచ్చు.. బ్యాంకు అకౌంట్లతో పనిలేదు..!

ప్రతి సంవత్సరం పన్ను భారం తగ్గించుకునేలా ముందుగా పేమెంట్లు చేయడం బెటర్. వడ్డీ రేట్లు తగ్గితే మీ నెలవారీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. హోం లోన్ ఉంటే ఆ భారాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకానీ, ఈఎంఐల భారాన్ని ఇతర ఖర్చులపై పెట్టకూడదని గమనించాలి.