×
Ad

iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16పై ఖతర్నాక్ డిస్కౌంట్.. అద్భుతమైన డీల్ మీకోసం..!

iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16 ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ మరికొద్దిగంటల్లో ముగియనుంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..

1/7
iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ఈ రాత్రికి ముగియనుంది. ఆపిల్ అభిమానులు ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. A18 చిప్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఐఫోన్ 16 సేల్ చివరి రోజున భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. లేటెస్ట్ ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇదే బెస్ట్ టైమ్. మొత్తం రూ. 17వేల కన్నా ఎక్కువ సేవింగ్ పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో ఐఫోన్ 16 డీల్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
2/7
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై భారీ ధర తగ్గింపు : ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ రూ.79,900 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.68,900కి అందుబాటులో ఉంది. ఇప్పటికే రూ.11 వేలు డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది.
3/7
కానీ, ఫ్లిప్‌కార్ట్ పండుగ ఆఫర్లతో ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లు అదనంగా రూ.6,533 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు. తద్వారా ధర రూ.63,367కి తగ్గుతుంది. రూ.17,500 కన్నా ఎక్కువ సేవ్ అవుతుంది.
4/7
ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ చూస్తున్న ఎవరికైనా అద్భుతమైన డీల్‌గా చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడింగ్ ద్వారా ధర మరింత తగ్గించుకోవచ్చు. కొత్త ఐఫోన్ మోడల్, కండిషన్‌ బట్టి ధర తగ్గింపు పొందవచ్చు.
5/7
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. హుడ్ కింద A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 18పై రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ కూడా సపోర్టు అందిస్తుంది. ఆపిల్ కొత్త ఆన్-డివైస్ ఏఐ టూల్స్ సూట్, బేస్ మోడల్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది.
6/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 48MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. అయితే, 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ అందిస్తుంది.
7/7
ఈ ఫోన్ 3561mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డిజైన్ విషయానికొస్తే.. ఐఫోన్ 16 మోడల్ మొత్తం బ్లాక్, వైట్, రోజ్, టీల్, అల్ట్రామెరైన్ అనే 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది.