iPhone 16e Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 16e కొనేసుకోండి.. డోంట్ మిస్!
iPhone 16e Sale : అమెజాన్‌లో ఐఫోన్ 16e రూ.7,110 వరకు భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఐఫోన్ 16 మోడల్ ధర రూ.53వేల కన్నా తక్కువకే కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

iPhone 16e
iPhone 16e Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే కొనేసుకోండి. ఆపిల్ అందించే ఐఫోన్ 16 సిరీస్ లైనప్‌లో ఇదే అత్యంత సరసమైన మోడల్. ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన ఐఫోన్ 16e మోడల్ ఫిబ్రవరి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16e ఇప్పటికే ఆన్‌లైన్‌లో డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 56,790కి లిస్టు అయింది. కానీ, ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు. మీరు ధరను కొంచెం తగ్గించాలంటే మరిన్ని డిస్కౌంట్‌లతో ధర రూ. 53వేల కన్నా తక్కువగా ఉండవచ్చు.
ఐఫోన్ 16e డీల్ ఎలా పొందాలంటే? :
మీరు ఐఫోన్ 16e కొనాలని ప్లాన్ చేస్తుంటే.. వాస్తవానికి, ఐఫోన్ 16e రూ. 59,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్ ప్రస్తుతం ఈ ఐఫోన్ మోడల్‌పై అత్యుత్తమ డీల్స్ అందిస్తోంది. ఈ ఐఫోన్ రూ. 56,790 ధరకు లభిస్తుంది.
అయితే, మీరు ICICI బ్యాంక్ (అమెజాన్ పే మినహా), యాక్సిస్ బ్యాంక్ లేదా కోటక్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా ఐఫోన్ 16e ధర రూ. 52,790కి తగ్గుతుంది. రూ. 7,110 నేరుగా తగ్గింపు పొందవచ్చు.
మీరు అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఐఫోన్ 16e ధరను మరింత తగ్గించవచ్చు. మీరు ట్రేడ్ చేసే ఫోన్‌ని బట్టి భారీ తగ్గింపును పొందవచ్చు. ఆపిల్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 53,950 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే, మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి ధర తగ్గింపు ఉంటుంది.
ఉదాహరణకు.. మీరు మంచి కండిషన్‌లో ఉన్న ఐఫోన్ 11తో ట్రేడింగ్ చేస్తుంటే.. మీరు రూ. 14వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ ఐఫోన్ 16e ధర దాదాపు రూ. 38,790కి తగ్గుతుంది. అదేవిధంగా, ఐఫోన్ SE 3ని ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 9,790 తగ్గింపు పొందవచ్చు. దాదాపు రూ. 43వేలకు తగ్గుతుంది. మీ ఎక్స్ఛేంజ్ వాల్యూను చెక్ చేసేందుకు అమెజాన్‌లో ఐఫోన్ 16e వేరియంట్‌ను ఎంచుకోండి. మీ ప్రస్తుత ఫోన్ వివరాలను ఇచ్చి ఎంతవరకు ఎక్స్ఛేంజ్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు.
ఐఫోన్ 16e ధర ఎంతంటే? :
ఎక్స్ఛేంజ్ లేకుండా బ్యాంక్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 16e రూ. 52,790కి కొనుగోలు చేయొచ్చు. మీ బడ్జెట్ రూ. 50వేల నుంచి రూ. 55వేల వరకు ఉంటే.. ఐఫోన్ 16e కొనేసుకోవడం బెటర్. ఐఫోన్ 16 మరిన్ని ఫీచర్లతో వస్తుంది. కానీ, చాలా ఖరీదైనది.
అదే ఐఫోన్ 16e అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫ్యూచర్-ప్రూఫింగ్ ఆప్షన్ అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16e మ్యాగ్‌సేఫ్, అల్ట్రా-వైడ్ కెమెరా వంటి కొన్ని ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. ఆకర్షణీయమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లే, కొత్త యాక్షన్ బటన్, ఆపిల్ C1 మోడెమ్, పవర్‌ఫుల్ A18 చిప్, 8GB ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు ఇస్తుంది.
ఐఫోన్ 14, ఐఫోన్ 15 వంటి పాత మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 దాదాపు రూ.61వేల ధర ఉండగా పాత A16 బయోనిక్ చిప్ కారణంగా ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు ఇవ్వదు. ఐఫోన్ 16e పవర్, స్మార్ట్ ఫీచర్లు, ఫ్రెషర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన ధర వద్ద కొనుగోలు చేయొచ్చు. మీ బడ్జెట్‌లోనే ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఐఫోన్ 16e బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.