Moto Book 60 Pad Pro : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? మోటోరోలా బుక్ 60, మోటో ప్యాడ్ 60 ప్రో వచ్చేశాయి.. ధర, ఫీచర్లు, ఆఫర్లు ఇవే!

Moto Book 60 Pad Pro : భారత మార్కెట్లోకి మోటో బుక్ 60 ల్యాప్‌టాప్, మోటో ప్యాడ్ 60 ప్రో టాబ్లెట్ లాంచ్ అయ్యాయి. ఈ రెండు డివైజ్‌ల ధర, స్పెషిఫికేషన్లు, లభ్యత, ఆఫర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Moto Book 60 Pad Pro : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? మోటోరోలా బుక్ 60, మోటో ప్యాడ్ 60 ప్రో వచ్చేశాయి.. ధర, ఫీచర్లు, ఆఫర్లు ఇవే!

Moto Book 60 Pad Pro

Updated On : April 17, 2025 / 10:47 PM IST

Moto Book 60 Pad Pro : కొత్త ల్యాప్‌టాప్, టాబ్లెట్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా నుంచి ల్యాప్‌టాప్ మార్కెట్లోకి కొత్త ప్రీమియం టాబ్లెట్ ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లో మొట్టమొదటి స్టైలస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన తర్వాత మోటోరోలా పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది.

ఇందులో భాగంగా మోటో బుక్ 60 ల్యాప్‌టాప్, మోటో ప్యాడ్ 60 ప్రో టాబ్లెట్ రిలీజ్ చేసింది. ఈ బ్రాండ్ మోటో బుక్ 60, మోటో ప్యాడ్ 60 ప్రోలను ఆవిష్కరించింది. ఈ రెండూ క్రాస్-డివైస్ కనెక్టివిటీ, ఏఐ ఆధారిత ఫీచర్లు, ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Realme 14T 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇవే..!

ఈ రెండు డివైజ్‌లు ఏప్రిల్ 23, 2025 నుంచి Flipkart, Motorola.in, ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. మోటో బుక్ 60, మోటో ప్యాడ్ 60 ప్రో ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మోటో బుక్ 60 స్పెసిఫికేషన్లు :
మోటరోలా ఫస్ట్ ల్యాప్‌టాప్ 14-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశంతో 500 నిట్స్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ లైయిట్ ఆల్-మెటల్ డిజైన్‌ను కలిగి ఉంది. మిలిటరీ-గ్రేడ్ ఆప్షన్ అందిస్తుంది. మోటో బుక్ 60 ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్, 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీని కలిగి ఉంది.

ఈ మోటో బుక్ 60Wh బ్యాటరీని కలిగి ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ మోటో ల్యాప్‌టాప్ డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ క్లిప్‌బోర్డ్, స్వైప్ టు షేర్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ వంటి స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లు, అలాగే ఇతర మోటోరోలా డివైజ్‌లతో స్మార్ట్ ఇంటిగ్రేషన్ కూడా పొందవచ్చు.

భారత్‌లో మోటో బుక్ 60 ధర :
మోటో బుక్ 60 ల్యాప్‌టాప్ ధర 16GB+ 512GB ఇంటెల్ కోర్ 5 వేరియంట్ ధర రూ.66,990 నుంచి ప్రారంభమవుతుంది. 16GB+ 512GB ఇంటెల్ కోర్ 7 వేరియంట్ ధర రూ.74,990కు లభిస్తోంది. ఇంటెల్ కోర్ 7తో టాప్-ఎండ్ 16GB+1TB వేరియంట్ ధర రూ.78,990కు పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో వినియోగదారులు రూ.5వేలు తగ్గింపు పొందవచ్చు.

మోటో ప్యాడ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటో ప్యాడ్ 60 ప్రో 12.7-అంగుళాల 3K LTPS డిస్‌ప్లేను 144Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ ప్యాడ్ 8GB ర్యామ్ +128GB స్టోరేజ్, హై-ఎండ్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్ అనే రెండు వేరియంట్‌లలో లభ్యమవుతుంది.

మీడియాటెక్ డైమన్షిటీ 8300 ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ ARM G615 MC5 గ్రాఫిక్స్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB మోడల్ UFS 3.1 స్టోరేజ్‌ను ఉపయోగిస్తుంది. అయితే, 12GB మోడల్ స్పీడ్ UFS 4.0కి అప్‌గ్రేడ్ అవుతుంది. రెండూ 1TB వరకు మైక్రో SD కార్డ్‌లను సపోర్ట్ చేస్తాయి.

మోటో ప్యాడ్ 60 ప్రో ఆండ్రాయిడ్ 14 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో రన్ అవుతుంది. ఈ ప్యాడ్ అనేక స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది. 10,200mAh బ్యాటరీతో వస్తుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

స్టైలస్ ఇన్‌పుట్ కోసం మోటో పెన్ ప్రో, పవర్ బటన్‌లో ఇంటర్నల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, పాంటోన్ బ్రాంజ్ గ్రీన్ మెటల్ బాడీలో మిలిటరీ-గ్రేడ్ బిల్డ్ క్వాలిటీని కూడా కలిగి ఉంది. ఈ మోటో బుక్ 13MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Read Also : iPhone 16 Price : భలే డిస్కౌంట్ బ్రో.. అమెజాన్‌లో ఐఫోన్ 16పై భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఐఫోన్ అసలే దొరకదు..!

భారత్‌లో మోటో ప్యాడ్ 60 ప్రో ధర ఎంతంటే? :
మోటో ప్యాడ్ 60 ప్రో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999కు కొనేసుకోవచ్చు.