Realme 14T 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇవే..!

Realme 14T 5G : కొత్త రియల్‌మి 5G ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ ముందుగానే కంపెనీ ధృవీకరించింది. రియల్‌మి 14T 5G ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.

Realme 14T 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇవే..!

Realme 14T 5G

Updated On : April 17, 2025 / 9:30 PM IST

Realme 14T 5G : కొత్త రియల్‌‌మి ఫోన్ కావాలా? చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి 14T లాంచ్‌ను వచ్చే వారం అధికారికంగా లాంచ్ చేయనుంది. లాంచ్ తేదీని కంపెనీ ముందుగానే ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రియల్‌మి 14 సిరీస్ లైనప్‌లో చేరనుంది.

Read Also : GPS Toll System : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై FASTag లేదు, స్టాప్‌లు లేవు.. మే 1 నుంచి కొత్త GPS విధానం.. ఎలా పనిచేస్తుందంటే?

ఇందులో రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్, రియల్‌మి 14x, రియల్‌మి 14 ప్రో లైట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. సెగ్మెంట్ ఆకర్షణీయమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. చాలా స్పెసిఫికేషన్లు రివీల్ చేయనప్పటికీ, లీక్‌లను పరిశీలిస్తే.. ధరతో పాటు మరిన్ని ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌లో రియల్‌మి 14T 5G లాంచ్ తేదీ :
రియల్‌మి 14T 5G ఫోన్ ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ శాటిన్ ఆధారిత డిజైన్‌తో లాంచ్ అవుతుంది. సిల్కెన్ గ్రీన్, వైలెట్ గ్రేస్, శాటిన్ ఇంక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో కూడా వస్తుందని కంపెనీ ధృవీకరించింది.

రియల్‌మి 14T 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 14T 5G ఫోన్ 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 SoC ద్వారా పవర్ పొందవచ్చు. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో రావొచ్చు.

Read Also : Motorola Edge 50 Pro : వావ్.. వండర్‌ఫుల్ ఆఫర్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐతో రన్ కావచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 దుమ్ము, నీటి నిరోధకతను కూడా కలిగి ఉండవచ్చు. కెమెరా విషయానికొస్తే.. కంపెనీ ఏఐ అప్‌గ్రేడ్‌తో 50MP ప్రైమరీ షూటర్, 2MP సెకండరీ లెన్స్‌ను అందించవచ్చు. ఫ్రంట్ సైడ్ ఫోన్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది.

రియల్‌మి 14T 5G ధర (అంచనా) :
రియల్‌మి 14T 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB వేరియంట్ ధర రూ. 17,999 ఉంటుందని అంచనా. 8GB, 256GB వేరియంట్ ధర రూ. 19,999 ఉండవచ్చని నివేదిక పేర్కొంది.