GPS Toll System : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై FASTag లేదు, స్టాప్‌లు లేవు.. మే 1 నుంచి కొత్త GPS విధానం.. ఎలా పనిచేస్తుందంటే?

GPS Toll System
GPS Toll System : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫాస్టాగ్ అవసరం లేదు. టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. మే 1 నుంచి సరికొత్త GPS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అమల్లోకి రానుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ టోల్ విధానాన్ని తీసుకొస్తోంది.
ఈ కొత్త టోల్ విధానంతో పారదర్శకంగా టోల్ వసూళ్లు చేయనున్నారు. అయితే, ప్రస్తుత ఫాస్టాగ్కంటిన్యూ అవుతుందా? లేదా ఎత్తే్స్తారా? కొత్త టోల్ జీపీఎస్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కొత్త జీపీఎస్ ఆధారిత టోల్ విధానాన్ని మరో 15రోజుల్లోగా ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వచ్చే మే నెలలో ఈ కొత్త టోల్ సిస్టమ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఫాస్టాగ్ బదులుగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(GNSS) ప్రవేశపెడతామని గడ్కరీ ప్రకటించారు.
GNSS అంటే ఏంటి? :
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) టెక్నాలజీతో వాహనాలు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలను ఆటోమేటిక్ ఛార్జ్ చేస్తారు. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ రద్దీ కూడా ఉండదు.
2016లో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ బదులుగా ఈ GNSS టోల్ GPS సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ఫాస్టాగ్‌తో టోల్ ప్లాజాల వద్ద సాంకేతిక లోపాలు తలెత్తేవి. దాంతో టోల్ ఫీజు ఆలస్యం అవుతున్నాయి. దాంతో హైవేపై వాహనాలు బారులు తీరాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య ఉండదు.
అయితే, రద్దీగా ఉండే టోల్ బూత్‌ల వద్ద క్యూలైన్లు, సిస్టమ్ సమస్యలు, ట్యాగ్ దుర్వినియోగం వంటి సమస్యలు ఉండవు. రాబోయే GPS-ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ వాహనాలను మానిటరింగ్ చేయడమే కాదు.. జాతీయ రహదారులపై ప్రయాణించిన వాస్తవ దూరం ఆధారంగా టోల్ ఫీజులను లెక్కించేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ విధానంతో డ్రైవర్లు ప్రయాణించే దూరానికి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. టోల్ ఛార్జీలలో పారదర్శకతను కలిగి ఉంటుంది.
కొత్త GPS సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? :
కొత్త నావిగేషన్ సిస్టమ్ కింద వాహనాలు ఆన్-బోర్డ్ యూనిట్లు (OBUs) కలిగి ఉంటాయి. GNSS టెక్నాలజీని ఉపయోగించి రోడ్డు మార్గాల్లో మూమెంట్స్ ట్రాక్ చేస్తాయి. నడిచే దూరం ఆధారంగా కారు నడుపుతున్నప్పుడు ఈ సిస్టమ్ టోల్‌ను నిర్ణయిస్తుంది. ఆ తర్వాత తగిన పేమెంట్ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ లేదా కనెక్ట్ అయిన డిజిటల్ వ్యాలెట్ నుంచి ఆటోమాటిక్‌గా పేమెంట్ అవుతుంది. ఫిజికల్ టోల్ బూత్‌ల అవసరం లేకుండా వేగంగా ప్రయాణించవచ్చు.
GPS ఆధారిత టోలింగ్ బెనిఫిట్స్ :
దూరం ఆధారిత ఛార్జింగ్ : డ్రైవర్లు ప్రయాణించే దూరానికి కచ్చితంగా ఛార్జ్ చేస్తారు. ప్రయాణానికి సమానమైన టోల్ ఫీజులు ఉంటాయి.
తగ్గిన రద్దీ : టోల్ ప్లాజాలను తొలగించడం వలన ట్రాఫిక్ అడ్డంకులు తగ్గుతాయి. ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
మెరుగైన పారదర్శకత : రియల్-టైమ్ ట్రాకింగ్, ఆటోమేటెడ్ డిడెక్షన్స్, మానవ తప్పిదం, అవినీతి వంటివి తగ్గుతాయి.
పర్యావరణ ప్రభావం : ట్రాఫిక్ తగ్గడం వల్ల వాహన ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
దశల వారీగా అమలు :
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త టోల్ వసూలు సిస్టమ్ దశల వారీగా అమలు చేయనుంది. మొదటి దశలో ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలకు అమల్లోకి వస్తుంది. ఆ తరువాతి దశల్లో ప్రైవేట్ వాహనాలను చేర్చనున్నారు. ఏదైనా సాంకేతిక సమస్యలను ప్రారంభంలోనే ఇది పరిష్కరిస్తుంది. అన్ని వాహనదారులకు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ప్రైవసీ, డేటా సేఫ్టీ :
ప్రైవసీతో పాటు డేటా సేఫ్టీ సమస్యలపై స్పందించింది. నావిక్ అనేది ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) భారత్ సొంత శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. GNSS-ఆధారిత వ్యవస్థ జాతీయ సరిహద్దుల లోపల డేటా ఉండేలా చూస్తుంది.
ఈ వ్యూహంతో పౌరుల ప్రైవసీని కాపాడుతూ టోలింగ్ సిస్టమ్ కచ్చితత్వాన్ని అందిస్తుంది. వినియోగదారులు కొత్త జీపీఎస్ సిస్టమ్ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. కార్లలో అవసరమైన OBUs ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. దేశంలో ఈ అధునాతన టోల్ విధానంతో ప్రయాణికులు మరింత పారదర్శకమైన యూజర్ ఫ్రెండ్లీ హైవే రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు.