iPhone 16 Price : భలే డిస్కౌంట్ బ్రో.. అమెజాన్‌లో ఐఫోన్ 16పై భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఐఫోన్ అసలే దొరకదు..!

iPhone 16 Price : ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే ఐఫోన్ 16 లభ్యమవుతుంది. ఈ ఐఫోన్ డీల్ తక్కువ ధరలో ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

iPhone 16 Price : భలే డిస్కౌంట్ బ్రో.. అమెజాన్‌లో ఐఫోన్ 16పై భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఐఫోన్ అసలే దొరకదు..!

iPhone 16 Price

Updated On : April 17, 2025 / 10:22 PM IST

iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? అయితే, మీకోసం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. మీరు కొత్త ఫ్లాగ్‌షిప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే ఐఫోన్ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 16 ధర రూ. 11వేల తగ్గింపు (బ్యాంక్ ఆఫర్లు)తో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కూడా యాక్సస్ చేయొచ్చు.

Read Also : Realme 14T 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇవే..!

అంతేకాదు.. అద్భుతమైన ఫొటోలను క్యాపర్చ్ చేయొచ్చు. ఈ ఐఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్, సూపర్ బ్రైట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఈ ఐఫోన్ మీ పరిసర ప్రాంతాల్లో కనిపించే వస్తువులను గుర్తించేందుకు విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ కూడా ఉంది.

కెమెరా కంట్రోల్ బటన్‌ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ముందుగా అమెజాన్‌లో iPhone ఐఫోన్ 16 ధరను ఓసారి చెక్ చేయండి. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర :
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 రూ.72,900 ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో రూ.7వేల తగ్గింపు లభిస్తుంది. ఇంకా, కస్టమర్లు యాక్సిస్, కోటక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో రూ.4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 16 ధర రూ.63వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా మీరు రూ.22,800 వరకు ఎక్స్చేంజ్ వాల్యూను పొందవచ్చు. నెలకు రూ.3,534 నుంచి బ్యాంక్ ఆఫర్‌లతో కస్టమర్‌లు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉంటే.. కస్టమర్‌లు వన్ డే డెలివరీతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 సిరామిక్ షీల్డ్ గ్లాస్ కోటింగ్, HDR సపోర్ట్‌తో 6.1-అంగుళాల 60hz OLED ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ ఆపిల్ 3nm A18 బయోనిక్ చిప్‌సెట్‌తో సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 15 కన్నా బెస్ట్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

Read Also : Tech Tips : ఈ సమ్మర్‌లో మీ స్మార్ట్‌ఫోన్ పదేపదే వేడెక్కుతోందా? అసలు కారణాలివే.. ఈ 5 స్మార్ట్ కూలింగ్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

ఈ ఐఫోన్ AI ఫీచర్లకు సపోర్టుగా 8GB ర్యామ్ కూడా కలిగి ఉంది. 22 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఈ ఐఫోన్ IP68 సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ డివైజ్ 2x ఆప్టికల్ జూమ్, 12MP మాక్రో లెన్స్‌తో కూడిన 48MP ఫ్యూజన్ కెమెరా సెటప్‌తో కూడా వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.