Tech Tips : ఈ సమ్మర్‌లో మీ స్మార్ట్‌ఫోన్ పదేపదే వేడెక్కుతోందా? అసలు కారణాలివే.. ఈ 5 స్మార్ట్ కూలింగ్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

Tech Tips : స్మార్ట్‌ఫోన్ అదేపనిగా వేడెక్కుతుందా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్ హీట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

Tech Tips : ఈ సమ్మర్‌లో మీ స్మార్ట్‌ఫోన్ పదేపదే వేడెక్కుతోందా? అసలు కారణాలివే.. ఈ 5 స్మార్ట్ కూలింగ్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

Tech Tips

Updated On : April 17, 2025 / 9:51 PM IST

Tech Tips : అసలే సమ్మర్.. ఎండలు దంచికొడుతున్నాయి. ఎండాకాలంలో హీటింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుందా? అయితే, ఇది మీకోసమే..

మీ ఫోన్ వేగంగా వేడిక్కినా లేదా బ్యాటరీ వెంటనే అయిపోతున్నా లేదా మీ హ్యాండ్‌సెట్ బాగా స్లో అవుతున్నా సరే అసలు కారణం ఏంటో ముందు తెలుసుకోవాలి. వెంటనే ఆ హీటింగ్ సమస్యకు కారణాన్ని గుర్తించి పరిష్కరించాలి.

Read Also : Motorola Edge 50 Pro : వావ్.. వండర్‌ఫుల్ ఆఫర్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

లేదంటే మీ ఫోన్ బ్యాటరీ దెబ్బతినడమే కాదు.. ఒక్కోసారి ఫోన్ కూడా పేలే ప్రమాదం లేకపోలేదు. ఈ సీజన్‌లో మీ స్మార్ట్‌ఫోన్‌ను కూలింగ్ చేసేందుకు 5 స్మార్ట్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

1. నేరుగా సూర్యకాంతిలో ఫోన్ వాడొద్దు :
వేసవిలో చాలామంది ఎక్కువగా నిర్లక్ష్యంగా ఉంటారు. సూర్యరశ్మికి గురికావడం వల్ల మీ ఫోన్ వేగంగా వేడెక్కడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి. మీరు ప్రయాణిస్తున్నా, బయట వీడియోలు తీస్తున్నా, లేదా బీచ్‌లో కూర్చుని స్క్రోల్ చేస్తున్నా సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం వల్ల మీ ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. అలాగే బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుంది. వాడకం లేనప్పుడు మీ హ్యాండ్‌సెట్‌ను నీడలో, మీ బ్యాగ్‌లో లేదా ఏదైనా క్లాత్ కింద కింద ఉంచడం ఎంతైనా మంచిది.

2. వాడని యాప్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ క్లోజ్ చేయండి :
మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనేక మొబైల్ అప్లికేషన్‌లను రన్ అవ్వడం వల్ల మీ ఫోన్ సాధారణం కన్నా ఎక్కువ వర్క్ అవుతుంది. ఎందుకంటే.. అనవసరమైన హీట్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్  రన్ అయ్యే అన్ని అప్లికేషన్‌లను క్రమం తప్పకుండా క్లియర్ చేయాలి. అలాగే వాడని యాప్‌లను వెంటనే తొలగించాలి. తద్వారా మీ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అంతేకాదు.. హీట్ తగ్గించడమే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.

3. ఇంటెన్సివ్ గేమింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్‌ ఆపేయండి :
గేమింగ్, HD వీడియో స్ట్రీమింగ్ ఆడటం మానుకోవాలి. మీ ప్రాసెసర్‌ను ఫుల్ ఎనర్జీతో వర్క్ అవుతుంది. ఫలితంగా బ్యాటరీ వెంటనే ఖాళీ అవుతుంది. కొన్నిసార్లు వేగంగా వేడెక్కుతుంది. వేసవి వేడితో గేమ్ ప్లే సమయంలో మీ ఫోన్ వేగంగా వేడెక్కవచ్చు.

ప్రత్యేకించి మీరు బయట ఎక్కడైనా వాడితే.. ఎక్కువ గేమింగ్ సెషన్‌ లేదా మల్టీ టాస్కింగ్‌ లిమిట్ చేయాలి. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేసేందుకు హీట్ తగ్గించడానికి గేమింగ్ మోడ్‌లను కూడా ఉపయోగించాలి. చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

4. హై టెంపరేచర్‌లో ఫాస్ట్ ఛార్జింగ్‌ ఆఫ్ చేయండి :
చాలా ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తున్నాయి. ఇలాంటి హ్యాండ్‌సెట్ యూజర్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, ఇది ఎక్కువ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. తీవ్రమైన వేడిలో మీ ఫోన్ టెంపరేచర్ చాలా తీవ్రంగా ఉండొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతున్నట్లు మీరు గమనిస్తే.. సెట్టింగ్స్ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఆపివేయాలి లేదా మధ్యాహ్నం సమయంలో బేసిక్ ఛార్జర్‌కి మారాలి.

Read Also : Realme 14T 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇవే..!

5. ఛార్జింగ్, గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ కేసును రిమూవ్ చేయండి :
ముఖ్యంగా మందంగా లేదా గాలి చొరబడని ఫోన్ కేసులు మీ స్మార్ట్‌ఫోన్‌కు అత్యంత ప్రమాదకరం కావచ్చు. ఈ ఫోన్ కేసు వేడిని అలానే ఉంచుతుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు లేదా గేమింగ్ ఆడుతున్న సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ చాలా వేడిగా అనిపిస్తే.. కూలింగ్ కోసం మీరు ఫోన్ కేసును రిమూవ్ చేయండి.