iPhone 16e Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16eపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

iPhone 16e Sale : కొత్త ఐఫోన్ 16e మోడల్ సేల్ మొదలైంది. ఆపిల్ ఐఫోన్ అత్యంత సరసమైన ధరకే విక్రయిస్తోంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్ తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

iPhone 16e Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16eపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

iPhone 16e goes on sale

Updated On : February 28, 2025 / 2:35 PM IST

iPhone 16e Sale Offers : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐఫోన్ 16e అమ్మకానికి వచ్చేసింది. ఐఫోన్ 16e మోడల్ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే ఆపిల్ సరసమైన ఐఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 16e భారత్ ధర, డిస్కౌంట్ ఆఫర్‌లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

ఐఫోన్ 16e భారత్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఐఫోన్ 16e ఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.59,900గా ఉంది. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.69,900, 512GB వేరియంట్ ధర రూ.89,900కు లభ్యమవుతుంది. ఈ కొత్త ఐఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో మాత్రమే వస్తుంది.

Read Also : Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ.. ప్రతి రైతుకు ఏటా రూ. 20వేలు.. ఎప్పుడు? ఎలా ఇస్తారంటే? ఫుల్ డిటెయిల్స్..!

ఐఫోన్ 16e: డిస్కౌంట్, సేల్ ఆఫర్లు :
ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లలో ఐఫోన్ 16e రూ. 4వేల బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. దాంతో ఈ ఐఫోన్ ధర రూ. 55,900కి తగ్గుతుంది. ఈ ఆఫర్ ICICI, Kotak, HDFC, SBIతో సహా వివిధ బ్యాంక్ కార్డులపై అందుబాటులో ఉంది. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు వేర్వేరు బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను కలిగి ఉన్నాయి. తక్కువ ధరకు ఐఫోన్ 16eని కొనుగోలు చేసేందుకు ఒకే ప్లాట్‌ఫామ్‌లలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ట్రై చేయొచ్చు.

ఐఫోన్ 16e ఫీచర్లు, ఫుల్ స్పెషిఫికేషన్లు :
ఐఫోన్ 16e మోడల్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను నాచ్‌తో కలిగి ఉంది. సేఫ్ ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం ఫేస్ ఐడీ సిస్టమ్ కలిగి ఉంది. ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో కనిపించే ట్రెడేషనల్ మ్యూట్ స్విచ్‌కు బదులుగా యాక్షన్ బటన్‌ను కలిగి ఉంది. యాక్షన్ బటన్ ద్వారా కెమెరా లేదా డోంట్ డిస్టర్బ్ మోడ్‌ను ఎనేబుల్ చేయొచ్చు. తద్వారా వివిధ ఫంక్షన్‌లను యాక్సెస్ చేయొచ్చు. అదనంగా, ఆపిల్ ఐఫోన్ 16eని యూఎస్‌బీ-సి పోర్ట్‌తో వస్తుంది.

కొత్త ఐఫోన్ 16e ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ చిప్ 6-కోర్ సీపీయూని కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 11కి పవర్ అందించే A13 బయోనిక్ చిప్ కన్నా 80 శాతం వరకు వేగవంతమైనదని పేర్కొంది. ఈ ఫోన్ 4-కోర్ GPU, మెషిన్ లెర్నింగ్ వంటి టాస్కులను వేగంగా పూర్తి చేయగలదు.

ఇందులో 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కూడా ఉన్నాయి. ఆపిల్ ప్రకారం.. న్యూరల్ ఇంజిన్ A13 కన్నా 6 రెట్లు వేగంగా ఏఐ మోడళ్లను ప్రాసెస్ చేయగలదు. ఐఫోన్ 16e ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఏఐ ఆధారిత ఫీచర్ల సూట్.. ఇందులో జెన్‌మోజీ, రైటింగ్ టూల్స్, చాట్‌జీపీటీతో ఇంటిగ్రేషన్ వంటి టూల్స్ ఉన్నాయి.

ఐఫోన్ 16e ఫోన్ సింగిల్ 48MP ఫ్యూజన్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. హై-రిజల్యూషన్ ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. కెమెరా సిస్టమ్ 2x డిజిటల్ జూమ్ ఆప్షన్ అందిస్తుంది. డిఫాల్ట్‌గా ఈ ఐఫోన్ 24MP ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

Read Also : AP Budget 2025 : ఏపీ ప్రజలకు కొత్త పథకం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. ఎప్పటినుంచంటే?

కానీ, హై-రిజల్యూషన్ షాట్‌ల కోసం 48MP మోడ్‌కి మార్చవచ్చు. ఎలాంటి లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన ఫోటో క్వాలిటీని అందిస్తుంది. కెమెరా సిస్టమ్ పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, HDRకి సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్‌తో కూడిన 12MP ట్రూ డెప్త్ కెమెరాను కలిగి ఉంది.

వీడియో రికార్డింగ్ కోసం ఐఫోన్ 16e సెకనుకు 60 ఫ్రేమ్‌ల వరకు 4K రికార్డింగ్, డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. క్రాష్ డిటెక్షన్‌తో కూడా వస్తుంది. ఎమర్జెన్సీ సర్వీసులను ఆటోమాటిక్‌గా అలర్ట్ చేయగలదు.