Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ.. ప్రతి రైతుకు ఏటా రూ. 20వేలు.. ఎప్పుడు? ఎలా ఇస్తారంటే? ఫుల్ డిటెయిల్స్..!
Annadata Sukhibhava : ప్రధాని మోదీ ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ రూ. 6వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి సాయంగా రైతన్నలకు అందించనుంది.

Annadata Sukhibhava
Annadata Sukhibhava : ఏపీ రైతులకు శుభవార్త.. త్వరలో రైతు భరోసా పథకం కింద ప్రతి రైతన్నకు ఏటా రూ.20వేలు అందనున్నాయి. రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఈ అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా రూ. 20వేలు ఇస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
పీఎం కిసాన్ రూ. 6వేలకు అదనంగా మరో రూ. 14 వేలు :
ఇప్పటికే, రైతన్నలకు పెట్టుబడి సాయంంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పీఎం కిసాన్ కింద అర్హత కలిగిన రైతన్నలకు రూ. 6వేలు జమ చేస్తోంది. అయితే, కేంద్రం ఇచ్చే రూ. 6వేలతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేల రూపాయలను పెట్టుబడి సాయంగా రైతన్నలకు అందించనుంది.
మొత్తం 3 విడతల్లో పెట్టుబడి సాయం :
ఈ పెట్టుబడి సాయాన్ని మొత్తం మూడు విడతలుగా అందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో అన్నదాత సుఖీభవ హమీ ఒకటి. ఇప్పుడు ఆ హమీ అమలు దిశగానే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయించింది.
మేలో పథకం అమలు చేసే ఛాన్స్ :
ఇప్పటికే, ఏపీ రైతన్నలకు రూ.20వేలు ఎప్పుడు ఇస్తారో కూడా మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం మే నెలలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.20 వేలు అందించనున్నట్టు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది.
Read Also : PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? అసలు కారణం ఇదే.. ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలంటే?
తద్వారా అర్హత కలిగిన ప్రతి రైతన్నకు ఏడాదికి రూ.20వేలు అందనున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలతో పాటు మరో 14 వేలు అదనంగా కలిపి మొత్తంగా రూ.20 వేలు రైతులకు అందించనుంది కూటమి ప్రభుత్వం.