Lower Interest Loans : మీ బ్యాంక్ లోన్‌పై ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుందా? ఇలా చేస్తే తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు తెలుసా?

Lower Interest Loans : మీ బ్యాంకు తీసుకున్న రుణంపై అధిక మొత్తంలో స్ప్రెడ్ రేటు వసూలు చేస్తోందా? ఇది ఎలా తగ్గించుకోవాలో తెలుసా? అసలు తక్కువ వడ్డీకే లోన్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Lower Interest Loans

  • EMI, క్రెడిట్ బిల్లులు సమయానికి చెల్లిస్తే తక్కువ స్ప్రెడ్ రేటు
  • స్థిర ఆదాయం ఉంటే రిస్క్ తక్కువ.. స్ప్రెడ్ రేటు తగ్గుతుంది
  • హోమ్, వెహికల్ లోన్ తక్కువ స్ప్రెడ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ
  • ప్రభుత్వ బ్యాంకులు తక్కువ, ప్రైవేట్, NBFCs కొంచెం హై స్ప్రెడ్ వసూలు

Lower Interest Loans : అందరికి అవసరాలు ఉంటాయి. కొన్నిసార్లు అనుకోని ఖర్చులు వచ్చి పడుతుంటాయి. అది లక్షల్లో అయితే అయ్య బాబోయ్ అన్ని లక్షలు ఎక్కడ తేవాలి? పోనీ ఎవరినైనా అడుగుదామంటే అన్ని డబ్బులు ఎవరు ఇస్తారు.. తెలిసినవాళ్లను అడిగినా అప్పటికప్పుడూ అన్ని డబ్బులు సర్దుబాటు చేయలేరు.. అప్పుడు మీరేం చేస్తారు.. బ్యాంకులో లోన్ల కోసం చూస్తారు కదా.. అయితే, ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులో లోన్ తీసుకుంటే కొన్ని బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తుంటాయి.

లోన్ తీసుకునే ముందు చాలామంది అడిగే ఒకే ఒక ప్రశ్న .. లోన్ తీసుకుంటే వడ్డీ ఎంత ఉంటుంది? ఇదే కదా.. అయితే ఎవరైనా లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే ప్రతి కస్టమర్‌కు వడ్డీ రేటు ఒకేలా ఉండదని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎవరికి ఎంత వడ్డీ రేటు ఇవ్వాలని బ్యాంకులు ఎలా నిర్ణయిస్తాయో కూడా చాలామందికి తెలియదు.. సాధారణంగా ఒకరికి లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు స్ప్రెడ్ రేటు ఆధారంగా వడ్డీని నిర్ణయిస్తాయి అనమాట. అందరికి ఒకే స్ప్రెడ్ రేటును నిర్ణయించవు. ఒక్కొక్కరికి ఒక్కోలా వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి.

స్ప్రెడ్ రేటును నిర్ణయించే విషయంలో ప్రతి బ్యాంకుకు వేర్వేరు ప్రమాణాలు ఉండవచ్చు. అందుకే బ్యాంకులు ప్రతి కస్టమర్‌కు వేర్వేరు వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తాయి. మీరు హోం లోన్, పర్సనల్ లోన్ లేదా కారు లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే స్ప్రెడ్ రేటు గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే తక్కువ వడ్డీకే వస్తుందో తెలుస్తుంది.

స్ప్రెడ్ రేట్ అంటే ఏంటి? :
ముందుగా అసలు స్ప్రెడ్ రేట్ ఏంటో కూడా తెలిసి ఉండాలి. బ్యాంకులు ఎలా నిర్ణయిస్తాయి? కస్టమర్లు ఏయే మార్గాల్లో తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
స్ప్రెడ్ రేటు అనేది బ్యాంకు స్థిర రుణ రేటు (బేస్ రేటు)పై అదనంగా విధించే వడ్డీ మార్జిన్ అనమాట. తుది వడ్డీ రేటును ఈఎంఐగా నిర్ణయిస్తుంది. ఒకవేళ బ్యాంకు బేస్ రేటు 7 శాతంగా ఉంటే మీ నుంచి 2శాతం స్ప్రెడ్ వసూలు చేస్తుంది. అప్పుడు మీరు మొత్తం 9 శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తుంది.

ఉదాహరణకు.. ఏదైనా బ్యాంకు బేస్ రేటు 7శాతంగా ఉందని అనుకుందాం.. ఇద్దరు స్నేహితులు 10 ఏళ్లకు రూ. 20 లక్షల హోం లోన్ తీసుకుంటే మొదటి స్నేహితుడికి మంచి క్రెడిట్ స్కోర్ ఉంది. 1.5శాతం స్ప్రెడ్ లభిస్తుంది. మొత్తం వడ్డీ రేటు 8.5శాతం అవుతుంది.

అప్పుడు ఈఎంఐ కూడా సుమారు రూ. 24,800 అవుతుంది. అలాగే రెండో స్నేహితుడు 2.5శాతం స్ప్రెడ్ పొందగా, మొత్తం వడ్డీ రేటు 9.5శాతం అయ్యింది. ఈఎంఐ కూడా సుమారు రూ. 25,900 అవుతుంది. రెండో వాడికి ప్రతి నెలా సుమారు రూ. 1,100 అదనంగా ఈఎంఐ చెల్లించాల్సి వచ్చింది. 10 ఏళ్లలో వడ్డీ రూపంలో సుమారు రూ. 1.3 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

లోన్లపై స్ప్రెడ్ రేట్లను బ్యాంకులు ఎలా నిర్ణయిస్తాయి? :
ఒక్క మాటలో చెప్పాలంటే.. బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు బేస్ రేటుపై వడ్డీ అదనంగా వేసే రేటుగా చెబుతారు. ఇంతకీ స్ప్రెడ్ రేట్ నిర్ణయించే ముఖ్య అంశాలేంటో తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా క్రెడిట్ స్కోర్, హిస్టరీ, గతంలో తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించారా? లేదా క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకులు తక్కువ స్ప్రెడ్ ఇస్తాయి అనమాట. ఒకవేళ ఈఎంఐ లేటు అయితే అధిక స్ప్రెడ్ వసూలు చేస్తాయి.

Read Also : Whatsapp Update : ఇక ఫోన్ నెంబర్‌తో పనిలేదు భయ్యా.. వాట్సాప్ ‘యూజర్‌నేమ్’తోనే చాటింగ్.. ఎలా పనిచేస్తుంది? బెనిఫిట్స్ ఏంటి?

మీ జీతం స్థిరంగా ఉందా? ఆర్ధిక సమస్యలు లేకుంటే స్ప్రెడ్ రేటు తక్కువగా ఉంటుంది. తక్కువ ఆదాయమైతే బ్యాంకులు రిస్క్ ఎక్కువగా భావించి స్ప్రెడ్ రేటు పెంచుతాయి. సాధారణంగా
హోం లోన్, వెహికల్ లోన్ల విషయంలో తక్కువ స్ప్రెడ్ రేటు వసూలు చేస్తాయి. వీటినే సెక్యూర్డ్ రుణాలుగా పిలుస్తారు. అదే అన్‌సెక్యూర్డ్ రుణాలు పర్సనల్ లోన్స్ అనమాట.. ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే హై స్ప్రెడ్ రేటును వసూలు చేస్తాయి.

అన్ని బ్యాంకుల్లో స్ప్రెడ్ రేట్లు ఎందుకు ఒకేలా ఉండవు :
ప్రతీ బ్యాంక్ ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో తక్కువ నిధుల ఖర్చు ఉంటుంది. ఎక్కువ కస్టమర్ బేస్ ఉంటుంది. అందుకే తక్కువ స్ప్రెడ్ వసూలు చేస్తాయి. అందులో ప్రైవేటు బ్యాంకులను చూస్తే లోన్ అప్రూవల్ స్పీడ్ ఉంటుంది. డిజిటల్ అప్రూవల్ కోసం కొద్దిగా హై స్ప్రెడ్ రేటును వసూలు చేయొచ్చు. NBFC లేదా ఫిన్‌టెక్ కంపెనీలు అయితే రిస్క్ ఎక్కువగా ఉంటే మాత్రం క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారికి స్ప్రెడ్ రేటు భారీగా పెంచుతాయి.

ఇక్కడ తక్కువ స్ప్రెడ్ అంటే చౌకగా లోన్ వస్తుందని కాదు.. మొత్తం వడ్డీ = బేస్ రేట్ + స్ప్రెడ్ అనమాట.. అంటే.. బేస్ రేట్ ఎక్కువ అయితే తక్కువ స్ప్రెడ్ ఉన్నా మొత్తం వడ్డీ అధికంగా ఉండొచ్చు. కొన్ని లోన్లపై ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీలు, అడ్వాన్స్ పేమెంట్ పెనాల్టీలు ఉంటే మొత్తం ఖర్చు కూడా పెరుగుతుంది.  అందుకే స్ప్రెడ్ రేటు మాత్రమే చూడొద్దు. మొత్తం వడ్డీ, ఫీజులు, షరతులేంటి అనేది కూడా చూడాలి.

స్ప్రెడ్ రేట్లు పెరగడానికి ముఖ్యమైన కారణాలివే :

  • మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు
  • ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోవడం
  • మీ ఆదాయం స్థిరంగా లేకపోవడం
  • ఉద్యోగం స్థిరంగా లేకపోవడం
  • అప్పులు ఎక్కువగా ఉండటం
  • ఎక్కువ లోన్లు తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ బకాయిలు
  • తక్కువ డౌన్ పేమెంట్ చేయడం, గ్యారెంటీ లేకపోవడం
  • లోన్ సెక్యూరిటీ తక్కువగా ఉన్నా బ్యాంకులు రిస్క్ కంపాన్సెషన్ కోసం స్ప్రెడ్ రేటు పెంచుతాయి.