Bad Loan vs Good Loan : లోన్ మంచిదా.. చెడ్డదా? మీ అప్పు ఏ కేటగిరీలో ఉందో ఇలా తెలుసుకోండి!

Bad Loan vs Good Loan : మీరు తీసుకునే లోన్ మంచిదా? చెడ్డదా? మీ అప్పు ఏయే కేటగిరీలోకి వస్తుందో చెక్ చేసుకోండి. ఆ లోన్ అవసరాన్ని బట్టి దాంతో మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా? ఇంకా తగ్గిస్తుందా? అనేది తెలుసుకోవాలి..

Bad Loan vs Good Loan ( Image Credit : AI )

  • ఏయే లోన్లు బెటర్? ఎలాంటి లోన్లు తీసుకోవద్దు?
  • అసలు గుడ్ లోన్.. బ్యాడ్ లోన్ అంటే ఏంటి?
  • ఆదాయాన్ని పెంచేలా లోన్లు ఉండాలి
  • బిజినెస్ లోన్, కారు లోన్ ఏది ఎవరికి బెస్ట్?

Bad Loan vs Good Loan : లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? ఇంతకీ లోన్ ఎందుకు? మీ అవసరం ఏంటి? అన్ని అవసరాలకు లోన్ ముఖ్యమే.. మీరు ఏదైనా కొనాలనుకుంటే.. సమయానికి చేతిలో డబ్బు లేకుంటే ఏం చేస్తారు.. బ్యాంకులో లోన్ తీసుకుంటారు.. ఇది కామన్.. అందరూ చేసేదే.. అయితే, అన్ని లోన్లు మంచివా? కాదా? అంటే మీరు తీసుకునే అవసరం బట్టి అది మారుతుంది..

అందుకే తీసుకున్న ప్రతి లోన్ మంచిదేనా? అంటే.. కాదనే చెప్పాలి. మన ఆదాయాన్ని పెంచే లోన్ ఏదైనా అది ‘గుడ్ లోన్’ అయితే, మన ఖర్చులను పెంచే లోన్ మాత్రం ‘బ్యాడ్ లోన్’ అవుతుంది. మీ అప్పు ఏ కేటగిరీలో ఉందో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతే అది మంచిదా? కాదా? అని నిర్ణయించుకోవచ్చు..

కారు రుణమే అద్భుతమైన ఎంగ్జాంపుల్.. ఒక వ్యక్తి రూ. 20 లక్షల లోన్ తీసుకుని కొత్త కారు కొన్నాడనుకుందాం.. 10 శాతం వడ్డీతో ఐదేళ్లకు ఈ రుణానికి నెలకు సుమారు రూ. 42,494 ఈఎంఐ చెల్లించాలి. కారును వ్యక్తిగత అవసరాలకే వాడితే.. ఈఎంఐతో పాటు ఇంధనం, నిర్వహణ ఖర్చులు కూడా అదనం. అంటే.. కారు ఆదాయం తీసుకురాదు.. పైగా భారీగా ఖర్చులను పెంచుతోంది. అందుకే ఇది బ్యాడ్ లోన్‌గా మారుతుంది.

కారు టాక్సిగా మారితే ఆదాయం :
అదే కారును టాక్సీగా నడిపి నెలకు రూ. 35వేలు సంపాదిస్తే.. రూ. 42,494 ఈఎంఐలో ఆ ఆదాయాన్ని తీసివేసిన తర్వాత నికర భారం రూ. 7,494కి తగ్గుతుంది. నెలకు రూ.50వేల కన్నా ఎక్కువ సంపాదిస్తే ఈఎంఐ కట్టిన తర్వాత కూడా డబ్బు మిగులుతుంది. అప్పుడు మీరు కొన్న కారు ఖర్చు చేసే వస్తువు కాకుండా ఆదాయం తెచ్చే ఆస్తిగా మారుతుంది. అంటే.. ప్రధాన ఆదాయాన్ని పెంచడం లేదా అదనపు ఆదాయం తెచ్చే లోన్ గుడ్ లోన్ అవుతుంది.

వ్యాపారంపై లోన్ మంచిదా? :
బిజినెస్ లోన్ కూడా ఇందుకు మరో ఉదాహరణ.. నెలకు 1,000 బ్రెడ్‌లు తయారు చేసే బిజినెస్ ఒక్కో బ్రెడ్‌పై రూ. 20 లాభం వస్తుందని అనుకుందాం.. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 10 శాతం వడ్డీతో 10 ఏళ్లకు రూ. 10 లక్షల లోన్ తీసుకుని నెలకు 10వేలు బ్రెడ్‌లు తయారు చేస్తే.. లోన్ పేమెంట్ల తర్వాత ఒక్కో బ్రెడ్‌పై రూ. 18 లాభం మిగిలినా నెలకు రూ. 1.8 లక్షల వరకు లాభం రావచ్చు. అంటే.. లోన్ ద్వారా ఆదాయ భారీగా పెంచుకోవచ్చు. ఇదే లీవరేజ్ అనమాట.

Read Also : Junk Food Ads Ban : జంక్ ఫుడ్ యాడ్స్‌తో పిల్లలకు ముప్పు? బ్యాన్ చేయాలా..? డాక్టర్లు చెప్పిన అసలు పరిష్కారం ఇదే!

అయితే, బిజినెస్ లోన్ తీసుకున్నంత మాత్రాన అది గుడ్ లోన్ కాదు. లోన్ వల్ల వచ్చే అదనపు ఆదాయం, లాభం, వడ్డీ, ఈఎంఐ, ఇతర ఖర్చుల కన్నా మెరుగ్గా ఉండాలి. పన్ను నిబంధనల ప్రకారం.. కొన్ని సందర్భాల్లో బిజినెస్ లోన్ వడ్డీపై మినహాయింపులు కూడా పొందవచ్చు.

లోన్లు ఇలా తీసుకోవద్దు :
మరోవైపు లైఫ్ స్టయిల్, స్టేటస్ లేదా ఇతరుల మెప్పు కోసం తీసుకునే అప్పులు ఆదాయం పెంచవు.. కేవలం ఖర్చులను మాత్రమే పెంచుతాయి. ఈరోజు ఖరీదైన వస్తువు ఇచ్చే ఆనందం కొద్దికాలమే ఉండొచ్చు. కానీ, ఈఎంఐలు ఏళ్ల పాటు కట్టాల్సి వస్తుంది. ఫలితంగా పొదుపు, పెట్టుబడులు, ఆస్తుల కూడబెట్టడానికి డబ్బు చేతిలో చిల్లిగవ్వ మిగలవు.

అందుకే లోన్ తీసుకునే ముందు ‘ఈ లోన్ నా ఆదాయాన్ని పెంచుతుందా? లేదా ఖర్చులను మాత్రమే పెంచుతుందా?’ అని ఒకటికి రెండు సార్లు ప్రశ్నించుకోవాలి. అది కారు టాక్సీగా మారితే గుడ్ లోన్.. వ్యక్తిగత ఖర్చుగా మారితే బ్యాడ్ లోన్ అని చెప్పొచ్చు. చివరికి లోన్ మంచిదా? చెడ్డదా? అనేది పేరులో కాదు.. అది మీ భవిష్యత్ డబ్బును ఎలా ప్రభావితం చేస్తుందన్నదే అసలు మ్యాటర్..

ఫైనల్‌గా చెప్పాలంటే.. మీరు అప్పు కోసం తీసుకునే లోన్ విషయంలో ముందు అది మంచి రుణమా లేక చెడ్డ రుణమా అని ఒక్క క్షణం ఆలోచించండి. మీ భవిష్యత్తు బాగుండాలంటే అవసరం లేని రుణాలకు వీలైనంత దూరంగా ఉండండి.