×
Ad

IT PAN Rules : పాన్ కార్డు కొత్త రూల్స్.. రూ. 5 లక్షల లోపు కారు కొంటే ఇక ‘PAN’ అక్కర్లేదు.. ఎందుకంటే?

IT PAN Rules : ఐటీ కొత్త రూల్స్ ప్రకారం.. అన్ని వాహనాల కొనుగోలు, అమ్మకాలకు పాన్ కార్డు నంబర్ తప్పనిసరి. కానీ, ఇప్పుడు రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు మాత్రమే అవసరం.

  • Published On : February 12, 2026 / 06:07 PM IST

IT PAN Rules ( Image Credit AI )

  • రూ. 5 లక్షలలోపు లావాదేవీలకు పాన్ అవసరం లేదు
  • సెకండ్ కారు కొనడం లేదా విక్రయిస్తే పాన్‌ కార్డు అక్కర్లేదు
  • వాహనం ధర రూ. 4 లక్షలలోపు ఉంటే పాన్ నంబర్ అవసరం

IT PAN Rules : టాక్స్ పేయర్లు, సాధారణ పౌరులకు బిగ్ షాకింగ్ న్యూస్.. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల్లో కీలక మార్పులు వచ్చాయి. ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తే.. ప్రత్యక్షంగా పన్నుచెల్లింపుదారులపై ప్రభావం పడనుంది. అంటే.. రూ. 5 లక్షల కన్నా తక్కువ వాల్యూ ఉన్న వాహనాలు, వాటి లావాదేవీలపై పాన్ కార్డు అవసరం ఉండదు. ఈ మేరకు కొత్త ఆదాయపు పన్ను నియమాల ముసాయిదా పేర్కొంది.

రూ. 5 లక్షల లోపు లావాదేవీలు, కొత్త కారు కొనడం లేదా సెకండ్ హ్యాండ్ వాహనం, కొత్త బైక్ కొన్నా లేదా అమ్మినా ఇకపై పాన్‌ కార్డు అందించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం, కారు లేదా ఏదైనా బైక్ కొనడం లేదా అమ్మేందుకు పాన్ కార్డు తప్పనిసరి. అయితే మీరు కొనే వాహనం ధర రూ. 4 లక్షల కన్నా తక్కువ ఉంటే పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి.

ఫిబ్రవరి 22లోగా అభిప్రాయాలు చెప్పండి :
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలపై ఫిబ్రవరి 22లోగా పన్నుచెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ కోరింది. డ్రాఫ్ట్ రూల్ 159A ఆర్థిక, హై వాల్యూ లావాదేవీలను పరిష్కరిస్తుంది. కారు కొనడం లేదా అమ్మేందుకు పాన్ కార్డు ఎందుకు అవసరం అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది.

ఇలాంటి లావాదేవీలకు పాన్ తప్పనిసరి :

రూల్ 150 ప్రకారం.. బ్యాంక్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్, క్రెడిట్ కార్డ్ అప్లయ్, భారీ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేయడం, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, బాండ్లు లేదా సెక్యూరిటీలు కొనుగోలు చేయడం, హై వాల్యూ వెహికల్ కొనుగోలు చేసేటప్పుడు లేదా ఆస్తిని కొనుగోలు చేస్తే తప్పనిసరిగా పాన్ కార్డు అందించాలి.

పెద్ద హోటల్‌లో ఈవెంట్ బిల్లు పేమెంట్ చేస్తే కూడా పాన్ అందించాలి. పెద్ద ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం, పన్ను సమ్మతిని పెంచడం, పన్ను ఎగవేతను నివారించడం వంటివి ఈ నిబంధనకు వర్తిస్తాయి.

ఒకటికిపైగా బ్యాంకు అకౌంట్లలో క్యాష్ డిపాజిట్ :

కొత్త రూల్ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు అకౌంట్లలో నుంచి రూ. 10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేసుకుంటే తప్పనిసరిగా పాన్‌ కార్డు సమర్పించాలి. ప్రస్తుతం, ఒకే రోజులో రూ. 50వేల కన్నా ఎక్కువ క్యాష్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తే పాన్ కార్డు చూపించాలి.

Read Also : Lava Yuva Star 3 : కొత్త లావా ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ యువ స్టార్ 3 ధర జస్ట్ రూ. 7,499కే, ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు

హోటల్, రెస్టారెంట్, కన్వెన్షన్ సెంటర్, బాంకెట్ హాల్ బిల్లు రూ. లక్ష దాటితే కూడా పాన్ అందించాలి. ప్రస్తుతం, హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు రూ. 50వేల కన్నా ఎక్కువగా ఉంటే కూడా పాన్ కార్డు ఇవ్వాలి. అయితే, పాన్ కార్డుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు వర్తిస్తాయి

ఆదాయపు పన్ను చట్టం 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ చట్టం ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో వస్తుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం నిబంధనలను సులభతరం చేస్తుంది.

పన్నుకు సంబంధించి అన్ని వివరాలను సరళమైన భాషలో అందిస్తుంది. కొత్త పన్ను నియమాలు సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. పన్ను నిపుణుల అవసరం ఉండదు. ఆదాయపు పన్ను చట్టం 1961లో సరళమైన భాష లేదు. పన్ను చెల్లింపుదారులకు పన్ను నిబంధనలను అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డారు.