itel Washing Machine : కొత్త వాషింగ్ మిషన్ కావాలా? ఐటెల్ వాషింగ్ మిషన్ అదుర్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర జస్ట్..!
itel Washing Machine : ఐటెల్ కొత్త వాషింగ్ మెషీన్ వచ్చేసింది. ఈ వాషింగ్ మూడు మోడళ్లలో లభిస్తోంది. వాషింగ్ మిషన్ ప్రారంభ ధర కేవలం రూ. 9,999 నుంచి అందుబాటులో ఉంది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- August 14, 2026 / 07:31 PM IST
itel Washing Machine
- ఐటెల్ WM105SA సామర్థ్యం 10.5 కిలోలు
- ఐటెల్ WM095SA సామర్థ్యం 9.5 కిలోలు
- ఐటెల్ WM080SA సామర్థ్యం 8 కేజీలు
itel Washing Machine : కొత్త వాషింగ్ మిషన్ కొంటున్నారా? ఐటెల్ నుంచి కొత్త వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఐటెల్ WM105SA, ఐటెల్ WM095SA, ఐటెల్ WM080SA మోడళ్లతో కొత్త వాషింగ్ మెషీన్ రేంజ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది.
ఐటెల్ హోం అప్లియన్సెస్ పోర్ట్‌ఫోలియోను (itel Washing Machine) విస్తరించింది. ఐటెల్ వాషింగ్ మెషీన్లు 10.5 కేజీ, 9.5 కేజీ, 8 కేజీ సామర్థ్యాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త రేంజ్ అద్భుతమైన ఫీచర్లతో సరసమైన ధరలకు లభిస్తున్నాయి. ఐటెల్ కొత్త వాషింగ్ మెషీన్ రేంజ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధరలకు సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
ధర ఎంతంటే? :
ఐటెల్ WM105SA ధర రూ. 12,699, ఐటెల్ WM095SA ధర రూ. 12,099, ఐటెల్ WM080SA ధర రూ. 9,999కు లభిస్తున్నాయి.
ఫీచర్లు :
ఐటెల్ WM105SA వాషింగ్ మిషన్ 10.5 కిలోల సామర్థ్యంతో వస్తుంది. ట్రై-ఫ్లో వాటర్‌ఫాల్‌తో వస్తుంది. ఇందులో హెవీ-డ్యూటీ మోటార్ ఉంది. ఫుల్ గ్లాస్ కర్వ్ ప్యానెల్‌తో వస్తుంది. ఇందులో స్పిన్ ఫిన్‌లతో డిటర్జెంట్ బాక్స్ ఉంది. ఈ మెషీన్ IPX4 రేటింగ్‌తో వస్తుంది.
స్పెషిషికేషన్లు :
ఐటెల్ WM095SA 9.5 కిలోల సామర్థ్యంతో వస్తుంది. ఇందులో హై-ఫ్లో వాటర్‌ఫాల్ కూడా ఉంది. హెవీ-డ్యూటీ మోటార్‌తో రన్ అవుతుంది. ఫుల్-గ్లాస్ కర్వ్డ్ ప్యానెల్ ఉంది. స్పిన్ ఫిన్స్‌తో డిటర్జెంట్ బాక్స్ ఉంటుంది. IPX4 రేటింగ్ అందిస్తుంది.
ఐటెల్ WM080SA వాషింగ్ మెషీన్ 8 కేజీల సామర్థ్యంతో 6-వింగ్ పల్సేటర్‌తో వస్తుంది. ఈ వాషింగ్ మెషీన్‌లో హెవీ-డ్యూటీ మోటార్ ఫుల్ గ్లాస్ కర్వ్ ప్యానెల్ ఉన్నాయి. అలాగే డిటర్జెంట్ బాక్స్ కూడా వస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ IPX4 రేటింగ్ అందిస్తుంది.
