ITR Filing 2026 : ITR ఫైల్ చేస్తున్నారా? జూలై 31 డెడ్‌లైన్ ముందు ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!

ITR filing 2026 : మీరు జూలై 31, 2026 లోపు మీ ఐటీఆర్ దాఖలు చేస్తుంటే తొందరపడకండి. ఒక చిన్న పొరపాటు కూడా మీ రీఫండ్‌ ఆపేస్తుంది. దాఖలుకు ముందు, మొత్తం సమాచారం, ఇ-వెరిఫికేషన్, బ్యాంక్ వివరాలను తప్పకుండా సరిచూసుకోండి. ఈ 5 ఫైలింగ్ పొరపాట్లు అసలు చేయొద్దు..

ITR filing 2026 ( Image Credit : AI )

  • టాక్స్ పేయర్లకు ఐటీఆర్ జూలై 31 వరకు డెడ్ లైన్
  • పన్ను నోటీసులు, రీఫండ్ ఆలస్యం, అదనపు పన్ను
  • ఇ-వెరిఫికేషన్, బ్యాంక్ వివరాలను తప్పక చెక్ చేయండి

ITR Filing 2026 : పన్నుచెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ దగ్గరపడుతోంది. జూలై 31వరకు మాత్రమే టైమ్ ఉంది. ఈలోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయని టాక్స్ పేయర్లు ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలను చెక్ చేసుకోవడం బెటర్..

మీరు కేవలం జీతం ద్వారా ఆదాయం వస్తుందా? లేదా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారా? మీకు సొంత వ్యాపారం (ITR filing 2026) ఉంటే మీ ఆదాయపు ఎంత అనేది పన్ను రిటర్న్ (ITR) దాఖలు సమయంలో వెల్లడించాలి.

చాలా మంది డెడ్ లైన్ దగ్గరపడ్డాక తమ ఐటీఆర్ దాఖలు చేస్తుంటారు. ఈ తొందరపాటు కారణంగా కొన్ని ముఖ్యమైన వివరాలను వదిలిపెట్టే ఛాన్స్ ఉంది. ఫైలింగ్ హడావుడిలో పడి అనేక పొరపాట్లు జరగొచ్చు.

ఫలితంగా మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందవచ్చు లేదా మీ రీఫండ్ ఆలస్యం కావచ్చు. అందుకే మీ రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ 5 పొరపాట్లు అసలు చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1. జీతం ఆదాయాం మాత్రమే చూపడం :

జీతం తీసుకునే చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు సమయంలో కేవలం ఫారం 16పైనే ఆధారపడతారు. అయితే, ఫారం 16 కేవలం యజమాని రిపోర్టు ఇచ్చిన జీతపు ఆదాయాన్ని మాత్రమే చూపిస్తుంది.

Read Also : Paytm ITR Filing : టాక్స్ పేయర్లకు పండగే.. ఇక పేటీఎంలో జస్ట్ రూ. 11కే ITR ఫైల్ చేయొచ్చు.. ఫుల్ ప్రాసెస్ మీకోసం..!

సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండ్ ఆదాయం, అద్దె ఆదాయం, ఫ్రీలాన్స్ సంపాదన, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ల నుండి వచ్చే మూలధన లాభాలను కూడా తప్పనిసరిగా వెల్లడించాలి. పన్ను విధించదగిన ఆదాయాన్ని పేర్కొనకపోవడం వల్ల ఆదాయపు పన్ను శాఖ రికార్డులతో పొంతన లేకపోవచ్చు. భవిష్యత్తులో మీకు ఐటీ నోటీసులు జారీ కావచ్చు.

2. AIS, ఫారం 26ASలో అంశాలను వదిలేయడం :
రిటర్న్ దాఖలు చేసే ముందు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లో రిపోర్టు చేసే ఆదాయాన్ని AIS, TIS, ఫారం 26ASలో అందుబాటులో ఉన్న వివరాలతో పోల్చి చూసుకోవాలి. ఈ స్టేట్‌మెంట్‌లు యజమానులు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌బ్రోకర్లు, ఇతర సంస్థలు రిపోర్టు డేటాను అందిస్తాయి. ఈ రికార్డులలో చూపిన ఆదాయాన్ని రిటర్న్‌లో చూపించకపోతే అది అదనపు పన్ను డిమాండ్‌లకు లేదా మళ్లీ ఐటీ పరిశీలనకు దారితీయవచ్చు.

3. తప్పుడు ఐటీఆర్ ఫారమ్‌ ఎంచుకోవడం :

రాంగ్ ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం చాలామంది టాక్స్ పేయర్లు చేసే పొరపాటు. ఈ రాంగ్ ఫారమ్‌ దాఖలు వల్ల రిటర్న్ రిజెక్ట్ అవ్వొచ్చు లేదా ప్రాసెసింగ్ కూడా ఆలస్యం కావచ్చు. ఉదాహరణకు.. క్యాపిటల్ గెయిన్స్, విదేశీ ఆస్తులు, మల్టీ హోం అసెట్స్ ఉన్న పన్ను చెల్లింపుదారులు ITR-1 ఫైల్ చేయలేరు. దానికి బదులుగా మరో వర్తించే ఐటీఆర్ ఫారమ్‌ను వాడాల్సి రావచ్చు. అందుకే తమ ఆదాయ వివరాలకు సరిపోయే ఫారమ్‌ను ఎంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి.

4. రాంగ్ డిడెక్షన్, క్యాపిటల్ గెయిన్స్ క్లెయిమ్స్ :
అర్హతా షరతులను పాటించకుండా మినహాయింపులను క్లెయిమ్ చేయడం లేదా షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా ఆస్తి లావాదేవీల నుంచి వచ్చే మూలధన లాభాలను రిపోర్టు చేయకపోవడం వంటివి ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో తరచుగా మిస్టేక్స్ చేస్తుంటారు. టాక్స్ పేయర్లు సెక్షన్ 80C , 80D, ఇతర వర్తించే నిబంధనల కింద డిడెక్షన్లను సరిచూసుకోవాలి. పన్ను విధించదగిన అన్ని క్యాపిటల్ గెయిన్స్ రిటర్న్‌లో సరిగ్గా వెల్లడించారో లేదో చెక్ చేసుకోవాలి.

5. రిటర్న్‌ను ఇ-వెరిఫై చేయడం మర్చిపోవద్దు :

చాలామంది ఐటీఆర్ సబ్మిట్ చేసి అంతా అయిందని అనుకుంటారు. పన్ను చెల్లింపుదారులు నిర్దేశించిన సమయంలోగా ఇ-వెరిఫికేషన్‌ను కూడా పూర్తి చేయాలి. ఒకవేళ రిటర్న్ వెరిఫై చేయకపోతే అది వ్యాలీడ్ కాదు.

అంటే.. మీరు ఐటీఆర్ దాఖలు చేయనట్లే.. అందుకే ఇ- వెరిఫికేషన్ ముందు ఏదైనా లోపం ఉన్నట్టు గుర్తిస్తే నిర్దేశిత సమయంలోగా పన్ను చెల్లింపుదారులు ఆయా రిటర్న్‌ను క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత కొత్తగా మళ్లీ రిటర్న్‌ దాఖలు చేయాలి.

జూలై 31 గడువుకు కేవలం కొన్ని రోజులు సమయం ఉంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ వివరాలను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి. సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండి.

మినహాయింపులను కూడా సరిచూసుకోండి. అలాగే, ఇ-వెరిఫికేషన్‌ చేసే ముందు అన్ని వివరాలను చెక్ చేసుకోండి. చిన్న పొరపాటు కూడా లేకుండా చూసుకుంటే రీఫండ్ ఆలస్యం, పన్ను డిమాండ్లు, ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వంటివి ఇబ్బందులు ఉండవు.