ITR Tax Notices : ITR ఫైల్ చేశారా? ఈ నోటీసులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. 30 రోజుల్లోగా ఇలా చేయండి.. లేదంటే మీకే నష్టం!

ITR Tax Notices : ఐటీఆర్ ఫైల్ చేశాం కదా.. అని రిలాక్స్ మోడ్ లో ఉన్నారా? జర జాగ్రత్త.. ఈ నోటీసులు ఎప్పుడైనా రావొచ్చు.. 30 రోజుల్లోగా ఇలా చేయలేదంటే చాలా ఇబ్బందులు పడతారు..

ITR Tax Notices

  • ట్యాక్స్‌పేయర్స్‌కు అలర్ట్.. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు
  • 30 రోజుల్లో రిప్లై ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవు
  • ఐటీఆర్ లెక్కల్లో ఏమైనా తేడా ఉందో లేదో స్టేటస్ చెక్ చేసుకోండి

ITR Tax Notices : టాక్స్ పేయర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జూలై 31 డెడ్‌లైన్ వచ్చేసింది. మరికొద్దిగంటల్లో గడువు సమయం కూడా దాటిపోతుంది. మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయకుంటే వెంటనే చేసేయడం బెటర్. కానీ, ఒకవేళ ఐటీఆర్ ముందుగానే దాఖలు చేసి ఉంటే పర్వాలేదు.. చాలామంది పన్నుచెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేశాక పని పూర్తి అయిపోందని రిలాక్స్ అయిపోతుంటారు.

ఎలాంటి నోటీసు అయినా రావొచ్చు :

ఐటీఆర్ ఫైలింగ్ చేశాకే అసలు పని మొదలువుతుంది. మీరు ఫైల్ చేసిన రిటర్న్‌ను ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్‌గా పరిశీలిస్తుంది. తమ వద్ద టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్, ఇతర ఆదాయ వివరాలతో కంపేర్ చేసి చూస్తుంది. ఈ ప్రాసెస్ అనంతరం పన్ను చెల్లింపుదారులకు వివిధ రకాల నోటీసులు లేదా సమాచారాన్ని పంపుతుంది. అందుకే ఐటీ శాఖ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.

సెక్షన్ 143(1) ఇంటిమేషన్ కింద వచ్చే సమాచారం చాలా ముఖ్యం. ఇందులో రిటర్న్ ఆమోదం, రీఫండ్ వివరాలు, పన్ను బకాయి (ట్యాక్స్ డిమాండ్) వంటివి ఉంటాయి. రిటర్న్‌లో పేర్కొన్న ఆదాయం, టీడీఎస్, ట్యాక్స్ క్రెడిట్లు, డిడెక్షన్లు, మినహాయింపులు, వడ్డీ లెక్కలు, రీఫండ్ లేదా పన్ను డిమాండ్ వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

మీ పన్ను డిమాండ్ నోటీసు వచ్చిందా? మీరు నివేదించిన ఐటీఆర్ లెక్కల్లో ఏమైనా తేడా కనిపించినా ఐటీ శాఖ వెంటనే మీకు నోటీసులు పంపుతుంది. మీకు నోటీసు అందిన 30 రోజుల్లోపు తప్పనిసరిగా స్పందించాలి.

Read Also : Apple iPhone 16 : వావ్.. ఇది కదా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?

పొరపాట్లను వెంటనే సవరించుకోండి :

ఒకవేళ ఐటీఆర్‌లో ఏదైనా పొరపాటు ఉంటే సెక్షన్ 154 కింద రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ ఫైల్ చేయవచ్చు. లేదంటే సవరించిన లేదా అప్‌డేటెడ్ రిటర్న్ సమర్పించే అవకాశం ఉంటుంది. మీ డిమాండ్ సరైనదని పన్ను శాఖ భావిస్తే వెంటనే పన్ను చెల్లించి పేమెంట్ వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తుంది.

మీ ఐటీ రిటర్న్‌లో తప్పనిసరి సమాచారం ఉండాలి. లేదా ఏదైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే సెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ రిటర్న్ నోటీసు జారీ అవుతుంది. ఈ నోటీసు పన్నుచెల్లింపుదారులకు వచ్చినప్పుడు నిర్ణీత గడువులోపు సరిచేసిన రిటర్న్ మళ్లీ సమర్పించాలి. లేదంటే ఆ రిటర్న్ వ్యాలీడ్ కాదు. పన్ను నోటీసులు అందుకోవడంతో పాటు భారీ పెనాల్టీని కూడా భరించాల్సి ఉంటుంది.

అదేవిధంగా, సెక్షన్ 142(1) కింద ఐటీ రిటర్న్ దాఖలు చేయడం లేదా అదనపు సమాచారం సమర్పించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. మీకు ఒకవేళ సెక్షన్ 143(2) కింద నోటీసు పంపితే.. మీ రిటర్న్‌ను స్క్రూటినీ కోసం ఎంపిక చేస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ నిర్దేశించిన గడువులోపు సమాధానం ఇవ్వడం తప్పనిసరి.

మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏదైనా నోటీసులు వస్తే అసలు నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ అలాగే చేస్తే అదనపు పన్ను భారం పడుతుంది. భారీ పెనాల్టీలు, వడ్డీతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఫేస్ చేయకతప్పదు. అందుకే ఐటీఆర్ దాఖలు చేశాక కూడా ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ప్రతి నోటీసుకు సమయానికి స్పందించడం చాలా ముఖ్యం.