Kia Syros EV : సేఫ్టీకి కొత్త బెంచ్‌మార్క్.. ఒక్క ఛార్జ్‌తో 526 కి.మీ ప్రయాణం.. కియా సైరోస్ ఈవీ బుకింగ్స్ ఓపెన్

Kia Syros EV : కియా ఇండియా కొత్త ఎలక్ట్రిక్ కారు సైరోస్ ఈవీని తీసుకొచ్చింది. బుకింగ్‌లు రూ. 25వేల నుంచి ప్రారంభమయ్యాయి. 526 కి.మీ.ల వరకు రేంజ్‌ అందిస్తుంది.

Kia Syros EV

  • ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్.. కియా సైరోస్ ఈవీ బుకింగ్స్ మొదలు
  • రేంజ్ చూసి షాక్ అవ్వాల్సిందే.. కియా సైరోస్ ఈవీ ఫస్ట్ లుక్
  • కియా నుంచి పవర్‌ఫుల్ ఈవీ గిఫ్ట్.. 526 కి.మీ రేంజ్‌తో సైరోస్ లాంచ్

Kia Syros EV : కొత్త కియా కారు వచ్చేస్తోంది.. కియా ఇండియా నుంచి రెండో మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కారు సైరోస్ ఈవీ వచ్చేసింది. రూ. 25వేలతో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మీరు కియా ఇండియా వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా అన్ని కియా డీలర్‌షిప్‌లలో ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 526 కి.మీ (ARAI) రేంజ్‌ను అందిస్తుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ, రేంజ్ :
మీకు 2 బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. అందులో ఒకటి 51.4kWh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్‌పై 562 కి.మీ రేంజ్ ఇస్తుంది. మరొకటి 42kWh బ్యాటరీ, ఫుల్ ఛార్జ్‌పై 443 కి.మీ రేంజ్ ఇస్తుంది. 100kW ఛార్జర్‌తో కేవలం 39 నిమిషాల్లో బ్యాటరీని 10శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.

ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ కోసం బ్యాటరీ టెంపరేచర్ స్థిరంగా ఉంచే బ్యాటరీ కండిషనింగ్ ఫీచర్ కూడా ఉంది. సైరోస్ వి, 10.8 kW ఆన్‌బోర్డ్ ఏసీ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు, కె-ఛార్జ్ ఎకోసిస్టమ్ ఇంటిగ్రేటెడ్ రూట్ ప్లానర్, ఈజీ ఛార్జింగ్ కంట్రోలింగ్‌తో వస్తుంది.

పర్ఫార్మెన్స్, పవర్ :
సైరోస్ ఈవీ, అడ్వాన్స్ నికెల్-మాంగనీస్-కోబాల్ట్ బ్యాటరీతో వస్తుంది. ఈ సెగ్మెంట్‌లోనే 171పీఎస్ పవర్ అందిస్తుంది. 51.4kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు కేవలం 8.1 సెకన్లలో 0 నుంచి 100km/h వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో లిక్విడ్-కూల్డ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో IP67-సర్టిఫైడ్ బ్యాటరీ ఉంది.

Read Also : Ather EL Electric Scooter : వారెవ్వా.. ఏథర్ ఫస్ట్ EL ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

కొత్త టెక్నాలజీ, ఫీచర్లు :
ఈ కారులో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్లు ఉన్నాయి. అందులో ఆటో మోడ్, ఐ-పెడల్‌తో రీజనరేటివ్ బ్రేకింగ్ కోసం ప్యాడిల్ షిఫ్టర్లు, వెహికల్-టు-లోడ్, బ్యాటరీ హీటింగ్ సిస్టమ్, డిజిటల్ కీ, వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్, షిఫ్ట్-బై-వైర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఐస్ క్యూబ్ ఎంఎఫ్ఆర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, స్టాండర్డ్ ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్లతో స్టార్ మ్యాప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉన్నాయి.

ఇంటర్నల్ ఫీచర్లు :
ఈ సెగ్మెంట్‌లో క్యాబిన్‌ లోపల ఫస్ట్ 30-అంగుళాల వెడల్పుతో ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇందులో 12.3-అంగుళాల హెచ్‌డీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ నావిగేషన్ కాక్‌పిట్, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ ఇంటర్‌ఫేస్ ఉన్నాయి.

అంతేకాదు.. ఇందులో 95కు పైగా ఫీచర్లతో కియా కనెక్ట్ 2.0, ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉన్నాయి. అంతేకాదు.. క్యాబిన్ లోపల హర్మాన్ కార్డాన్ 8-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కూడా పొందవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు :
సైరోస్ ఈవీ సేఫ్టీ కోసం లెవెల్-2 అడాస్ అందిస్తుంది. ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్, లేన్-ఫాలోయింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి 16 ఆటోమేటెడ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.