LED Credit Cards : పండగ చేస్కోండి.. కొత్త LED క్రెడిట్ కార్డులు ఇదిగో.. ఇకపై పేమెంట్ చేస్తే లైటింగ్.. స్పెషల్ ఫీచర్లు ఇవే!
LED Credit Cards : చెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారత మొట్టమొదటి ఎల్ఈడీ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టాయి. ఈ కార్డుతో పేమెంట్ చేసినప్పుడు ఎల్ఈడీ లైట్ వెలుగుతుంది. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎల్ఈడీ క్రెడిట్ కార్డులు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- April 18, 2026 / 04:47 PM IST
LED Credit Cards
- లైట్ బ్లింక్ అయ్యే క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయి
- భారత్‌లో ఫస్ట్ టైం ఎల్ఈడీతో రానున్న క్రెడిట్ కార్డులు
- పేమెంట్ చేసినా ప్రతిసారి ఎల్ఈడీ లైట్ బ్లింక్ అవుతుంది
- చెక్, ఏఐ సంయుక్త భాగస్వామ్యంతో రానున్న క్రెడిట్ కార్డులు
LED Credit Cards : క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ న్యూస్.. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం వెరీ కామన్. కేవలం మెట్రో నగరాలే కాకుండా ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా క్రెడిట్ కార్డుల వాడకం కనిపిస్తోంది. ఈ డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించి అద్భుతమైన న్యూస్.. ఇకపై ఎల్ఈడీ లైట్లతో క్రెడిట్ కార్డులు భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్డులతో పేమెంట్ చేసిన వెంటనే ఎల్ఈడీ లైట్ వెలుగుతుంది. క్రెడిట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘చెక్’ (CheQ), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో (LED Credit Cards) భాగస్వామ్యం కుదుర్చుకుని, దేశంలోనే ఫస్ట్ టైమ్ ఎల్ఈడీ ఆధారిత కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రతి లావాదేవీ సమయంలో ‘ట్యాప్-టు-పే LED ఫీచర్’ బ్లింక్ అవుతుంది. ఈ కార్డులో ఇంటర్నల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ అమర్చి ఉంటుంది. వినియోగదారులు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చేసేందుకు కార్డ్‌ను ట్యాప్ చేసిన వెంటనే LED లైట్ వెలుగుతుంది. ఈ టెక్నాలజీ POS మెషీన్, NFC ఫీల్డ్ కార్డులకు బెస్ట్ ఆప్షన్. ఇంటర్నల్ బ్యాటరీ అవసరం లేదు అనమాట.
రియల్ రివార్డ్స్ సిస్టమ్ :
గతంలో చెక్యూ అనేది బిల్లు పేమెంట్ ప్లాట్‌ఫారమ్. ఇప్పుడు ఈ కార్డు ద్వారా క్రెడిట్, రివార్డ్స్ ఎకోసిస్టమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కార్డుతో అందించే రివార్డ్స్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంటాయి. అన్ని రివార్డులు ‘CheQ Rewards’ రూపంలో అందుతాయి. వినియోగదారులు సింగిల్ ప్లాట్‌ఫారమ్‌పై ఈజీగా ట్రాక్ చేసి రీడీమ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ క్రెడిట్ కార్డులలో కనిపించే, రివార్డ్ పాయింట్లు కూడా పొందవచ్చు.
ఎల్ఈడీ క్రెడిట్ కార్డ్ యూపీఐకి సపోర్టు :
ఈ కార్డ్‌లో యూపీఐ సపోర్ట్ కూడా ఉంది. తద్వారా వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐకి లింక్ చేసి పేమెంట్లు చేయవచ్చు. అంతేకాదు.. అలా చేయడం ద్వారా తమ రివార్డులను సంపాదించవచ్చు. మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ను కావాలంంటే ఏప్రిల్ 28, 2026 నుంచి CheQ యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
ఎల్ఈడీ క్రెడిట్ కార్డ్ ఫీజులు ఏంటి? :
ఎల్ఈడీ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 499, అయితే ఏడాదికి రూ. 3 లక్షల ఖర్చు చేశాక ఈ రుసుమును మాఫీ చేయించుకోవచ్చు. కార్డ్ హోల్డర్లు రూ. 695 విలువైన EazyDiner మెంబర్‌షిప్ రూపంలో వెల్ కమ్ బెనిఫిట్ పొందుతారు. అదనంగా, ఈ కార్డ్ ఎల్ఈడీ వెర్షన్‌కు ఒకేసారి పేమెంట్ చేయాల్సిన అదనపు రుసుము రూ. 999 కాగా, అయితే, CheQ కస్టమర్లకు ఈ రుసుమును మే 31, 2026 వరకు మాఫీ చేశారు.
ఎల్ఈడీ క్రెడిట్ కార్డ్ స్పెషాలిటీ ఏంటి? :
ఇప్పటివరకు, CheQ అనేది కేవలం క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ ప్లాట్‌ఫారమ్ మాత్రమే. అయితే, కంపెనీ క్రెడిట్ కార్డ్ ఇన్సూరెన్స్, రివార్డులు, కమర్షియల్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ కార్డ్ 15 మిలియన్ల క్రెడిట్ కార్డులు, 4 మిలియన్ల యూజర్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందింది. ఇప్పుడు ఈ కార్డ్ అన్ని ఒకే చోట ఇంటిగ్రేట్ అయింది. కంపెనీ ప్రకారం.. అన్ని రివార్డులు ఒకే యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు.
