Lenovo IdeaPad Slim 5i : వారెవ్వా.. కొంటే లెనోవో ల్యాప్‌టాప్ కొనాలి.. AI ఫీచర్లు మాత్రం హైలెట్.. ధర తెలిస్తే షాకవుతారు..!
Lenovo IdeaPad Slim 5i : లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5i (15IWC11) కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ వైల్డ్‌క్యాట్ లేక్ ప్రాసెసర్, 120Hz టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
- Sreehari A
- Published on- May 25, 2026 / 06:01 PM IST
Lenovo IdeaPad Slim 5i
- లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5i 120Hz ఐపీఎస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే
- ఇంటెల్ వైల్డ్‌క్యాట్ లేక్ ప్రాసెసర్, ఏఐ ఎన్‌పియుతో వస్తుంది
- జర్మనీ, యూకే, మలేషియా, ఆస్ట్రేలియాతో సహా పలు మార్కెట్లలో లాంచ్
Lenovo IdeaPad Slim 5i : లెనోవో కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. కొత్త ఐడియాప్యాడ్ స్లిమ్ 5i (15IWC11) అద్భుతమైన ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. కంపెనీ ధర, లభ్యత వివరాలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
కానీ, ఈ మోడల్ లెనోవో ప్రొడక్టు స్పెసిఫికేషన్ల వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ ఇంటెల్ కొత్త వైల్డ్‌క్యాట్ లేక్ ప్రాసెసర్‌లతో వస్తుంది. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5iలో 120Hz టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 32GB వరకు ర్యామ్ కోపైలట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే? :
లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5i ల్యాప్‌టాప్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ డివైజ్ ధర ఆస్ట్రేలియాలో 1,499 డాలర్లు, ఫ్రాన్స్‌లో 1,229 యూరోలు, జర్మనీలో 1,099 యూరోలు, హాంగ్‌కాంగ్‌లో 7,850 హెచ్‌కే డాలర్లు, మలేషియాలో RM4,280.20, యూకేలో £970గా ఉంది.
కంపెనీ సేల్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ ల్యాప్‌టాప్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బాడీ డిజైన్ అల్యూమినియం ఛాసిస్‌తో వస్తుంది. బరువు సుమారు 3.28 పౌండ్లు (దాదాపు 1.48 కిలోగ్రాములు) ఉంటుంది. రాబోయే రోజుల్లో కంపెనీ ధర, లభ్యత వివరాలను రివీల్ చేయనుంది.
Read Also : FASTag Toll Plaza : టోల్ ప్లాజాలో FASTag పనిచేయకపోతే టెన్షన్ పడొద్దు.. NHAI చెప్పిన సింపుల్ సొల్యూషన్!
ఈ ల్యాప్‌టాప్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 15.3-అంగుళాల ఐపీఎస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1920×1200 పిక్సెల్స్ , 16:10 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ స్క్రీన్ 400 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. sRGB కలర్ గామట్ కవరేజీతో వస్తుంది.
పర్ఫార్మెన్స్ కోసం.. :
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 5iలో ఇంటెల్ కోర్ 5 320 ఇంటెల్ కోర్ 7 350 ప్రాసెసర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు చిప్‌లు 6-కోర్ డిజైన్ అందిస్తాయి. ఇందులో 2 పెర్ఫార్మెన్స్ కోర్లు, 4 ఎఫిషియెన్సీ కోర్లు ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఐ ఫీచర్ల కోసం NPU (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్) కూడా ఉంది.
17 TOPS వరకు సపోర్ట్ చేస్తుంది. తత్ఫలితంగా, మైక్రోసాఫ్ట్ ఏఐ పీసీ కేటగిరీకి సపోర్ట్ చేస్తుంది. కోపైలట్ కీ ఫీచర్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 16GB, 32GB ర్యామ్ ఆప్షన్‌లతో వస్తుంది. ర్యామ్ మదర్‌బోర్డ్‌కు సోల్డర్ అయి ఉంటుంది. ఆ తర్వాత అప్‌గ్రేడ్ చేయడం సాధ్యపడదు. స్టోరేజ్ కోసం 1TB వరకు M.2 SSDకి సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. :
లెనోవా ఈ మోడల్‌ను 54.7Wh, 70Wh బ్యాటరీ ఆప్షన్‌లలో అందిస్తోంది. భారీ వేరియంట్ 22.8 గంటల వరకు లోకల్ 1080p వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, రియల్ టైమ్ బ్యాటరీ లైఫ్ మారవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. :
లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5iలో రెండు USB టైప్-C పోర్ట్‌లు, రెండు USB టైప్-ఎ పోర్ట్‌లు, HDMI 2.1, మైక్రో SD కార్డ్ రీడర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో 1080p వెబ్‌క్యామ్, ఫిజికల్ ప్రైవసీ షట్టర్ విండోస్ హలో ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉన్నాయి.
